Nagababu Konidela: అల్లు అర్జున్ ఫ్యాన్స్ దెబ్బకు ట్విట్టర్ నుంచి నాగబాబు అవుట్! అసలేం జరిగింది?

అల్లు అర్జున్ ఫ్యాన్స్ దెబ్బకు ట్విట్టర్ నుంచి నాగబాబు అవుట్! అసలేం జరిగింది?

ఏపీ ఎలక్షన్స్ లో ఉన్నంత హీట్ వేరే రాష్ట్రాల్లో ఉండదు. ఈ ఎన్నికల పుణ్యమా అని మెగా వర్సెస్ అల్లు వార్ నడుస్తోంది. బన్నీ తన స్నేహితుడికి ఎన్నికల్లో మద్దతు తెలపడం.. ఇది జరిగిన కాసేపటికే నాగబాబు ట్వీట్ చేయడం వివాదానికి తెరలేపింది. అల్లు అర్జున్ నే టార్గెట్ చేస్తావా అంటూ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున రివర్స్ అవ్వడంతో ఆయన ఎక్స్ ఖాతాను డియాక్టివేట్ చేసుకున్నారు.

ఏపీ ఎలక్షన్స్ లో ఉన్నంత హీట్ వేరే రాష్ట్రాల్లో ఉండదు. ఈ ఎన్నికల పుణ్యమా అని మెగా వర్సెస్ అల్లు వార్ నడుస్తోంది. బన్నీ తన స్నేహితుడికి ఎన్నికల్లో మద్దతు తెలపడం.. ఇది జరిగిన కాసేపటికే నాగబాబు ట్వీట్ చేయడం వివాదానికి తెరలేపింది. అల్లు అర్జున్ నే టార్గెట్ చేస్తావా అంటూ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున రివర్స్ అవ్వడంతో ఆయన ఎక్స్ ఖాతాను డియాక్టివేట్ చేసుకున్నారు.

మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో అల్లు అర్జున్.. తన స్నేహితుడైన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి తన సపోర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలిపిన కారణంగా.. పవన్ కళ్యాణ్ అభిమానులు విపరీతంగా తమ వ్యతిరేకతను ప్రకటించారు. అల్లు అర్జున్ ఎంత అన్నట్టు మాట్లాడారు. ఈ క్రమంలోనే నాగబాబు తన ఎక్స్ ఖాతాలో ఒక ట్వీట్ చేశారు. ‘మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసే వాడు మావాడైనా పరాయి వాడే.. మాతో నిలబడేవాడు పరాయి వాడైనా మావాడే’ అంటూ చేసిన ట్వీట్ పెద్ద దుమారమే రేపింది. ఎందుకంటే అల్లు అర్జున్ మద్దతు తెలిపి కొన్ని గంటలకే ఈ ట్వీట్ చేయడంతో.. నాగబాబు టార్గెట్ చేసింది మా హీరోనే అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. దీంతో మెగా వర్సెస్ అల్లు గొడవగా మారిపోయింది. 

మెగా అభిమానులు కూడా పెద్ద ఎత్తున అల్లు అర్జున్ ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమైనా తక్కువ తిన్నారా? తమ హీరోని డిఫెన్స్ చేసుకుంటూ వచ్చారు. వారు కూడా రివర్స్ లో కౌంటర్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. దీంతో నాగబాబు ఏకంగా తన ఎక్స్ ఖాతాను డియాక్టివేట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎక్స్ ఖాతాలో నాగబాబు ఖాతా కనిపించడం లేదు. బన్నీ ఫ్యాన్స్ దెబ్బకు ఖాతా డియాక్టివేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. స్నేహితుడి కోసం మద్దతు ఇస్తే మా వాడు కాదు అని ఎలా అంటారు అంటూ నాగబాబుపై బన్నీ ఫ్యాన్స్ మండిపడ్డారు. ఇదే ట్వీట్ ఎన్నికల ముందు వేసి ఉంటే బన్నీ ఫ్యాన్స్ ఓట్లు కూడా పడుండేవి కాదని.. నాగబాబుని ట్యాగ్ చేస్తూ పోస్టులు పెట్టారు.

గతంలో అల్లు అర్జున్ జనసేన పార్టీకి 2 కోట్ల రూపాయలు విరాళం ఇవ్వలేదా అంటూ గుర్తు చేశారు. నా పేరు సూర్య సినిమాకి నాగబాబు పేరుని ప్రెజెంటర్ గా వేసి ఆర్థికంగా సాయం అందేలా బన్నీ చేశారు కదా ఎలా మర్చిపోయారు అంటూ విమర్శిస్తున్నారు. చిరంజీవి కూడా గతంలో అనేక సార్లు తన స్నేహితుల కోసం ఎలక్షన్స్ సమయంలో సపోర్ట్ చేయలేదా అంటూ ప్రశ్నించారు. బన్నీ ఫ్యాన్స్ నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో ఈ గొడవను ఇంతటితో ఆపేయాలని తాత్కాలికంగా నాగబాబు సోషల్ మీడియా ఖాతాను డియాక్టివేట్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు చిరంజీవి కూడా తగ్గమని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కారణంగా కూడా ఆయన ఖాతాను డియాక్టివేట్ చేసినట్లు తెలుస్తోంది.   

Show comments