ఆదుకున్న వారిని ముంచేసి..రూ.30 లక్షలతో పరార్! ఇంత ద్రోహమా?

ఆదుకున్న వారిని ముంచేసి..రూ.30 లక్షలతో పరార్! ఇంత ద్రోహమా?

వృద్ధప్యంతో మంచం పట్టిన ఓ వ్యక్తికి సేవలు చేయడానకి కేర్ టేకర్ గా ఓ వ్యక్తిని నియమించుకున్నారు. అయితే గత కొంతకాలంగా నమ్మకంగా.. పనిచేస్తున్న ఆ వ్యక్తి దుర్బద్ధితో చేసిన పనికి ఆ ఇంట్లో వాళ్లు షాక్ కు గురయ్యారు.

వృద్ధప్యంతో మంచం పట్టిన ఓ వ్యక్తికి సేవలు చేయడానకి కేర్ టేకర్ గా ఓ వ్యక్తిని నియమించుకున్నారు. అయితే గత కొంతకాలంగా నమ్మకంగా.. పనిచేస్తున్న ఆ వ్యక్తి దుర్బద్ధితో చేసిన పనికి ఆ ఇంట్లో వాళ్లు షాక్ కు గురయ్యారు.

కొత్తగా పేరెంట్ అయిన వారికి ఇంటి పనులతో పాటు, ఆఫీసు పనులు కూడా ఉంటాయి. అలాంటి సమయంలో  పిల్లల అలనా పాలానా చూసుకోవడానిక ఓ వ్యక్తి అవసరం కచ్చితంగా ఉండాలి. అలాగే అనారోగ్య సమస్యలతో వృద్ధాప్యంలో బాధపడుతున్న తల్లిదండ్రుల బాగోగులు చూసుకోడానికి సమయం లేకపోయినప్పుడు కూడా వారికి తోడుగా ఓ వ్యక్తి అవసరం కచ్చితంగా ఉంటుంది. అలాంటి సమయంలో చాలామంది ఇళ్లలో పిల్లల సంరక్షణకోసం, వృద్ధుల కోసం ఓ వ్యక్తిని నియమిస్తారు. వారినే హోమ్ కేర్ టేకర్ అని అంటారు. ఇటీవల కాలంలో ఎంతోమంది ఇళ్లలో ఈ హోమ్ కేర్ టేకర్స్ ను నియమించుకుంటున్నారు. అయితే ఇలా హోమ్ కేర్ టేకర్స్ గా నియమించిన వ్యక్తులు నమ్మకంగా పనిచేయకుండా.. అనేక నేరాలకు పాల్పడుతున్న ఘటనలు చాలానే చూస్తున్నాం. తాజాగా ఓ ఇంట్లో కొంతకాలం నుంచి హోమ్ కేర్ టేకర్ గా.. నమ్మకంగా పని చేస్తున్న ఓ వ్యక్తి దుర్బద్ధితో చేసిన పని తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇంతకు ఏం జరిగిందంటే..

సేవలు చేయడానకి వచ్చి కొంతకాలంగా నమ్మకంగా.. పనిచేస్తున్న ఓ వ్యక్తి దుర్బద్ధితో చేసిన పనికి ఆ ఇంట్లో వాళ్లు షాక్ కు గురయ్యారు. ఎంతో కాలంగా నమ్మకంగా పని చేస్తున్న ఆ వ్యక్తి అదను చూసి రూ. 30 లక్షలు కాజేసిని ఘటన దోమలగూడ ఠాణా పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుల వివరాల మేరకు.. ఉన్నత ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగి వి. రాధాకృష్ణయ్య , అతని భార్య కమల దోమలగూడ గగన్ మహల్ బాలసాయిబాబా మందిరం సమీపంలోని.. రాఘవ టవర్స్ లో నివసిస్తున్న కూతురు కవిత, అల్లుడు నాగేంద్ర ఇంట్లో ఉంటున్నారు. అయితే నాగేంద్ర పంజాగుట్టలో ఓ మెడికల్ షాప్ నిర్వహిస్తుండగా.. కవిత సంగారెడ్డిలో ప్రభుత్వ వైద్యురాలిగా పని చేస్తున్నారు. అయితే.. రాధాకృష్ణయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో మంచం పట్టాడు. దీంతో ఆయనకు సపర్యలు చేయడానికి ఏడాది క్రితం కుత్బుల్లాపూర్ కు చెందిన బీవీ లోకేశ్వర్ రావు (27) ను కేర్ టేకర్ గా పెట్టుకున్నారు. కాగా, ఆ కేర్ టేకర్ కి వీరి ఇంట్లోనే ఓ గది ఇచ్చి, రోజు భోజనం పెడుతూ.. నెలకు రూ.35 వేలు ఇస్తున్నారు. అయితే ఇంట్లో వారికి, బంధువులకు నమ్మకంగా ఉంటున్నాడు. అంతేకాకుండా.. అతని కుటుంబ సమస్యలు చెబుతూ.. కొంత డబ్బును అప్పుగా తీసుకున్నాడు.

అయితే రాధాకృష్ణయ్యకు పదవీ విరమణ సమయంలో వచ్చిన డబ్బును రూ. 10 లక్షలు, తన అకౌంట్ లో, రూ. 11 లక్షలు తన భార్య కమల ఖాతాలో జమ చేశాడు. ఈ క్రమంలోనే మందుల అవసరం ఉండటంతో.. రెండు, మూడుసార్లు రాధాకృష్ణ, లోకేశ్వర్ రావుతో ఏటీఎం కార్డు ఇచ్చి మందులు తెప్పించుకున్నాడు. దీంతో బ్యాంకులో పెద్ద మొత్తంలో డబ్బు ఉన్నట్లు తెలుసుకున్న లోకేశ్వరావుకు వాటిని కాజేయాలన్న దుర్బుద్ధి పుట్టింది.దీంతో జనవరిలో ఇద్దరి బ్యాంకు ఖాతాల నుంచి రూ. 21 లక్షలు డ్రా చేశాడు. ఈ క్రమంలోనే వేర్వేరు కారణాలు చెబుతూ.. మరో రూ. 9 లక్షలు తీసుకున్నాడు. ఇలా పలుమార్లు డబ్బు కాజేసిన లోకేశ్వర్ రావు ఫిబ్రవరి 5న చెప్పపెట్టకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అతని ఫోన్ కూడా స్విచ్ఛాప్ వస్తోంది. దీంతో మార్చి 14న బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేయడానికి వెళ్తే ఇద్దరి అకౌంట్లో బ్యాలెన్స్ లేదని తేలియడంతో.. వారు ఖంగుతిన్నారు. దీంతో వెంటనే దోమలగూడ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకోవడంలో జాప్యం చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. మరి, హోమ్ కేర్ టేకర్ గా వచ్చిన వ్యక్తి దుర్బద్ధితో చేసిన పని పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments