SRH vs RR Kumar Sangakkara Fight With Umpire: వీడియో: అంపైర్లతో సంగక్కర గొడవ.. ఇంత సీరియస్​గా ఎప్పుడూ చూసుండరు!

SRH vs RR: వీడియో: అంపైర్లతో సంగక్కర గొడవ.. ఇంత సీరియస్​గా ఎప్పుడూ చూసుండరు!

లెజెండ్ కుమార సంగక్కర ఎప్పుడూ కూల్​గా ఉంటాడనేది తెలిసిందే. అలాంటోడు సన్​రైజర్స్​ హైదరాబాద్​తో మ్యాచ్​లో అంపైర్లతో గొడవకు దిగాడు.

లెజెండ్ కుమార సంగక్కర ఎప్పుడూ కూల్​గా ఉంటాడనేది తెలిసిందే. అలాంటోడు సన్​రైజర్స్​ హైదరాబాద్​తో మ్యాచ్​లో అంపైర్లతో గొడవకు దిగాడు.

శ్రీలంక లెజెండ్ కుమార సంగక్కర ఎప్పుడూ కూల్​గా ఉంటాడనేది తెలిసిందే. ఇంటర్నేషనల్ కెరీర్​లో ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లోనూ అతడు సంయమనంతో వ్యవహరిస్తూ వచ్చాడు. అపోజిషన్ టీమ్ ప్లేయర్లు రెచ్చగొట్టినా అతడు మాత్రం చిరునవ్వు చిందిస్తూ ఉంటాడు. అలాంటోడు సన్​రైజర్స్​ హైదరాబాద్​తో మ్యాచ్​లో అంపైర్లతో గొడవకు దిగాడు. రాజస్థాన్ రాయల్స్​కు కోచ్​గా వ్యవహరిస్తున్న సంగక్కర.. ఆరెంజ్ ఆర్మీతో ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్​లో చాలా సీరియస్​గా కనిపించాడు. దీనికి కారణం ఓ రనౌట్.

ఎస్​ఆర్​హెచ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ (58) ఔట్ విషయంలో సంగక్కర సీరియస్ అయ్యాడు. 15వ ఓవర్​లో ఆవేశ్ ఖాన్ వేసిన బాల్ వికెట్లకు దూరంగా పడి వెళ్తుండగా దాన్ని వెంటాడి మరీ బాదేందుకు ప్రయత్నించాడు హెడ్. అయినా బంతిని టచ్ చేయలేకపోయాడు. అయితే షాట్ ఆడాక క్రీజులో బ్యాట్​ను ఉంచడంలో అతడు కాస్త ఆలస్యం చేశాడు. అంతే కీపర్ సంజూ శాంసన్ బాల్​తో స్టంప్స్​ను హిట్ చేశాడు. అతడు ఔట్ అని అందరూ అనుకున్నారు. అయితే బాల్ వికెట్లను తాకిన టైమ్​లోనే హెడ్ బ్యాట్​ను క్రీజులో పెట్టడంతో థర్డ్ అంపైర్ నాటౌట్​గా ప్రకటించాడు. ఈ డిసిషన్​తో అసంతృప్తికి గురైన సంగక్కర సీరియస్ అయ్యాడు. డగౌట్​లో నుంచి లేచి వచ్చి అంపైర్లతో గొడవకు దిగాడు. నాటౌట్ ఎలా ఇస్తారంటూ వాదనకు దిగాడు. అయితే తర్వాతి బంతికే హెడ్​ను క్లీన్​బౌల్డ్ చేశాడు ఆవేశ్. దీంతో ఈ ఫైట్ కాస్తా సద్దుమణిగింది.

Show comments