Hero Suhas viral Video: అప్పట్లో సుహాస్ లైఫ్ ని మలుపు తిప్పిన వీడియో! ఇప్పుడు వైరల్ అవుతోంది!

అప్పట్లో సుహాస్ లైఫ్ ని మలుపు తిప్పిన వీడియో! ఇప్పుడు వైరల్ అవుతోంది!

Hero Suhas viral Video: హ్యాట్రిక్ హీరో సుహాస్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హీరోగా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అయితే సుహాస్ ఇంత దూరం రావడానికి కారణం ఒక వైరల్ వీడియో అని మీకు తెలుసా?

Hero Suhas viral Video: హ్యాట్రిక్ హీరో సుహాస్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హీరోగా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అయితే సుహాస్ ఇంత దూరం రావడానికి కారణం ఒక వైరల్ వీడియో అని మీకు తెలుసా?

హీరో సుహాస్.. టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఈ హ్యాట్రిక్ హీరో గురించి తెలియనివాళ్లు ఉండరేమో? రోజుకి రూ.100 తీసుకునే ఒక చిన్న ఆర్టిస్టుగా తన కెరీర్ ప్రారంభించానని స్వయంగా సుహాస్ వెల్లడించాడు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో, కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తో సుహాస్ టాలీవుడ్ లో షూర్ షాట్ హీరోగా కొనసాగుతున్నాడు. అతను ఇంత దూరం వచ్చాడు అంటే కచ్చితంగా అతని కష్టం, కథ విషయంలో అతని జడ్జిమెంట్ స్కిల్సే ప్రధాన కారణం అని చెప్పచ్చు. అయితే సుహాస్ రాత మార్చింది మాత్రం ఒక వీడియో అని మీకు తెలుసా? ఒక చిన్న వీడియోతో సుహాస్ ఇప్పుడు ఇక్కడి దాకా వచ్చాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

టాలీవుడ్ స్థాయిని పాన్ వరల్డ్ దాకా తీసుకెళ్లింది అనడానికి తొలి మెట్టు వేసింది దర్శకధీరుడు రాజమౌళి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తీసిన బాహుబలి సినిమాతో టాలీవుడ్ పేరు ప్రపంచ వేదికలదాకా వెళ్లింది. ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్ అనే పరిస్థితికి ఇప్పుడు చేరుకున్నాం. అయితే తొలి ప్రయత్నం మాత్రం జక్కన్న ద్వారానే జరిగింది. అలాగే సుహాస్ కెరీర్ మలుపు తిరగడానికి కూడా స్టార్ డైరెక్టర్ రాజమౌళీనే కారణం అని చెప్పచ్చు. బహుబలి చిత్రంలో ప్రభాకర్ చేసిన కాలకేయ మహారాజు పాత్రను ఎవరూ మర్చిపోలేరు. ఆయన మాట్లాడిన కిలికి భాషను ఇప్పటికీ గుర్తు పెట్టుకున్నారు.

సుహాస్ వైరల్ అయ్యింది ఈ కిలికి భాషతోనే అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ప్రభాకర్ చెప్పిన కిలికి డైలాగ్ మొత్తాన్ని సుహాస్ సింగిల్ టేక్ లో చెప్పి ఒక వీడియో అప్ లోడ్ చేశాడు. ఇంకేముంది అది కాస్తా వైరల్ అయ్యింది. అటు తిరిగి ఇటు తిరిగి అది చాయ్ బిస్కెట్ వాళ్ల కంట్లో పడింది. ఆ తర్వాత సుహాస్ ని పిలిచి అతనికి షార్ట్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేసే అవకాశాన్ని ఇచ్చారు. ఆ తర్వాత అతనికి సందీప్ రాజ్ తో పరిచయం కావడం, వాళ్ల కాంబోలో కలర్ ఫొటో సినిమా రావడం, ఆ మూవీకి 68వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో తెలుగు బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా అవార్డు రావడం చూశాం. ఆ తర్వాత హీరోగా సుహాస్ రైటర్ పద్మభూషణం, అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్నాడు.

సుహాస్ ఇంత దూరం రాగలిగాడు అంటే అతనిలో ఉన్న టాలెంట్ కారణం అని అందరికీ తెలుసు. కానీ, ఆ కిలికి భాష వైరల్ వీడియో కారణం అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అందుకే ఇప్పుడు సుహాస్ ని అలా చూడగానే అందరూ తెగ షేర్స్ చేస్తున్నారు. అరె సుహాస్ కెరీర్ ఈ వీడియోతో స్టార్ట్ అయ్యిందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంక సుహాస్ కెరీర్ విషయానికి వస్తే.. కేబుల్ రెడ్డి, ప్రసన్న వదనం, గొర్రె పురాణం అంటూ చాలానే విభిన్న, వైవిధ్య భరిత కథలతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైపోయాడు. అన్ని ప్రాజెక్టులు శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకుల్లో సుహాస్ పై ఒక అభిప్రాయం ఏర్పడింది. అదేంటంటే.. సుహాస్ కథ ఎంచుకున్నాడు అంటే అది సూపర్ హిట్టే అని. మరి.. కిలికి భాషలో అదరగొట్టిన సుహాస్ వైరల్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments