Guess The Child-Priyadarshini Ghattamaneni: మహేష్‌ బాబు పక్కన్న ఉన్న ఈ చిన్నారి.. ఓ స్టార్‌ హీరో భార్య.. ఎవరో గుర్తు పట్టారా!

మహేష్‌ బాబు పక్కన్న ఉన్న ఈ చిన్నారి.. ఓ స్టార్‌ హీరో భార్య.. ఎవరో గుర్తు పట్టారా!

Guess The Child: ఇక్కడ చిత్రంలో మహేష్‌ బాబు పక్కన ఉన్న చిన్నారి ఎవరో గుర్తు పట్టారా.. ఆమె ఓ స్టార్‌ హీరో భార్య. ఇంతకు తను ఎవరంటే..

Guess The Child: ఇక్కడ చిత్రంలో మహేష్‌ బాబు పక్కన ఉన్న చిన్నారి ఎవరో గుర్తు పట్టారా.. ఆమె ఓ స్టార్‌ హీరో భార్య. ఇంతకు తను ఎవరంటే..

ఇప్పుడు సోషల్‌ మీడియాలో అంతా చైల్డ్‌హుడ్‌ పిక్‌ ట్రెండ్‌ నడుస్తోంది. పలువురు సెలబ్రిటీలు తాము బాల్యం, యవ్వనంలో ఎలా ఉన్నారో తెలిపే ఫొటోలను షేర్‌ చేస్తూ.. నెటిజనులను ఆకట్టుకుంటున్నారు. వీరిలో కొందరైతే.. బాల్యానికి.. ఇప్పుడున్న తీరుకు సంబంధం లేకుండా.. అసలు గుర్తు పట్టరాకుండా మారారు. వారంతటా వారే స్వయంగా చెప్తే గుర్తు పట్టలేము. అసలు చిన్నప్పటికి.. ఇప్పటికి ఏమాత్రం పోలిక లేకుండా మారిపోయారు. మరి కొందరేమో.. సినిమాల్లోకి వచ్చాక.. రాక ముందు వారు ఎలా ఉండే వారో తెలిపే ఫొటోలను షేర్‌ చేస్తూ.. వైరల్‌ అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ స్టార్‌ హీరో భార్య ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకు ఆ చిన్నారి ఎవరో మీరు గుర్తు పట్టారా.. లేదా..

పైన ఫోటోను చూశారు కదా.. దీనిలో మహేష్ బాబు పక్కనే ఎంతో అమాయకంగా కనిపిస్తున్న చిన్నారి ఎవరో గుర్తు పట్టారా.. తనేదో హీరోయిన్ అనుకుంటే మాత్రం పొరపాటే. ఆ అమ్మాయి ఇప్పుడు ఓ టాలీవుడ్‌ స్టార్ హీరో భార్య. ఇంతకీ మహేష్ బాబు పక్కనే కనిపిస్తున్న ఆ అమ్మాయి ఎవరో కాదు.. మహేష్ బాబు చెల్లెలు, సూపర్ స్టార్‌ కృష్ణ చిన్న కూతురు ప్రియదర్శిని ఘట్టమనేని. టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని. ప్రస్తుతం మహేష్, ప్రియదర్శిని చిన్ననాటి ఫోటో నెట్టింట తెగ వైరలవుతుంది. అస్సలు గుర్తు పట్టలేకుండా ఉంది కదా అంటున్నారు ఈ ఫోటో చూసిన ఘట్టమనేని అభిమానులు.

సూపర్ స్టార్ కృష్ణ, ఇందిరా దేవి దంపతులకు నలుగురు సంతానం. రమేష్ బాబు, మహేష్ బాబు, మంజుల ఘట్టమనేని, ప్రియదర్శిని ఘట్టమనేని. వీరిలో పెద్దబ్బాయి రమేష్ బాబు హీరోగా కొన్నాళ్ల పాటు టాలీవుడ్‌లో రాణించారు. ఆ తర్వాత సినిమాలకు బ్రేక్‌ ఇచ్చారు. ఇక కొన్నాళ్ల క్రితమే అనారోగ్య సమస్యలతో రమేష్‌ బాబు మరణించారు. ఇక కృష్ణ-ఇందిరల మరో సంతానం మహేష్‌ బాబు విషయానికి వస్తే.. ఆయన ఇప్పుడు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ హీరోగా రాణిస్తున్నారు. బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాల్లో నటిస్తూ.. కెరీర్‌లో బిజీగా ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు జక్కన్న డైరెక్షన్‌లో నటించబోతున్నారు.

ఇక కుమార్తెల విషయానికి వస్తే.. మంజుల ఘట్టమనేనికి నటన అంటే ఇష్టం. చాలా సినిమాల్లో ఆమె క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కీలకపాత్రలలో నటించింది. ఇక చిన్న కూతురు ప్రియదర్శిని విషయానికి వస్తే.. ఆమె సినిమాలకు దూరంగా ఉంటారు. 2006లో హీరో సుధీర్ బాబు, ప్రియదర్శినీల వివాహం జరిగింది. వీరికి ఇద్దరి కుమారులు సంతాంన. ఇక సుధీర్‌ బాబు.. 2012లో శివ మనసులో శ్రుతి సినిమాతో హీరోగా టాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. వరుస సినిమాలు చేస్తూ.. బిజీగా ఉన్నాడు.

Show comments