17 ఏళ్లు జైల్లో ఉండి.. ఎన్నికల కోసం 60 ఏళ్ల వయసులో పెళ్లి! ఇది లాలూ తెలివి

17 ఏళ్లు జైల్లో ఉండి.. ఎన్నికల కోసం 60 ఏళ్ల వయసులో పెళ్లి! ఇది లాలూ తెలివి

ఒకప్పుడు దేశ వ్యాప్తంగా ఓ హత్య కేసులో సంచలనం సృష్టించిన గ్యాంగ్ స్టర్ పేరు ఇప్పుడు మళ్లీ వార్తల్లో మారుమ్రోగుతుంది. తాజాగా ఎన్నికల్లో పోటీ చేయాలనే కోరికతో ఆయన ఏం చేశాడంటే..

ఒకప్పుడు దేశ వ్యాప్తంగా ఓ హత్య కేసులో సంచలనం సృష్టించిన గ్యాంగ్ స్టర్ పేరు ఇప్పుడు మళ్లీ వార్తల్లో మారుమ్రోగుతుంది. తాజాగా ఎన్నికల్లో పోటీ చేయాలనే కోరికతో ఆయన ఏం చేశాడంటే..

దేశ వ్యాప్తంగా 90వ దశకంలో అశోక్ మహతో అనే గ్యాంగ్‌స్టర్‌ పేరు మారుమ్రోగిన సంగతి తెలిసిందే. ఈయన ఓ హత్య కేసులో 17 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు. కాగా, గతేడాది ఈయన జైలు నుంచి విడుదలయ్యాడు. అయితే ప్రస్తుతం అతడి వయసు 60 ఏళ్ల వయసులో ఉన్న మహతో.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు. నిజానికి అతి భయంకరమైన నేర చరిత్ర ఉన్న ఇతడు ఎన్నికల్లో పోటీ చేయడమనేది చట్టపరంగా సాధ్యం కాదు. ఎందుకంటే.. చట్ట నిబంధనల ప్రకారం రెండేళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి ఆరేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడు.దీంతో ఎలాగైనా ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనే తపనతో ఈయన చేసిన పని తెలిస్తే ఆశ్చర్యపోతారు.

90వ దశకంలో దేశ వ్యాప్తంగా మారుమ్రోగిన కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ అశోక్‌ మహతో పేరు మళ్లీ వార్తల్లో నిలిచింది. ఓ హత్య కేసులో 17 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన ఇతను తాజాగా ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమయ్యాడు. కానీ, రెండేళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి ఆరేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడు కావడంతో.. ఎలాగైనా ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆశతో ఈయన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు కలిశాడు. అయితే లాలూ ఇచ్చిన సలహాతో 60 ఏళ్ల వయసులో ఉన్న అశోక్ మహతో తాజాగా అనిత (46) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ఇక నూతన వధువరులు లాలూ ఇంటికి వెళ్లారు. అలాగే మాజీ సీఎం జంట లాలూ రబ్రీదేవీల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం బయటకు వచ్చిన ఆయన వాహనాన్ని మీడియా ప్రతినిధులు చుట్టుముట్ట.. ఆర్జేటి టికెట్ ఇస్తుందా లాలూ హామి ఇచ్చారా .. ఇక ఎన్నికల్లో మీ భార్యను బరిలోకి దింపుతున్నారా అసలు హడవిడిగా పెళ్లలి చేసుకోవడానికి కారణాలేంటి అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. అయితే అశోక్ మాత్రం తెలివిగా ప్రజల అశీర్వదిస్తే తప్పకుండా ఆర్జేటీ నుంచి పోటీ చేస్తాం అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అసలు అశోక్ మహతో నేర చరిత్ర ఏమిటంటే.. బీహార్‌లోని నవాదా జిల్లాలోని కోనన్‌పుర్‌ గ్రామానికి చెందిన అశోక్‌ మహతో అనే గ్యాంగ్‌స్టర్‌.. షేక్‌పురా జేడీయూ నేత, ఆరుసార్లు ఎమ్మెల్యే, రెండు సార్లు ఎంపీగా ఎన్నికైన రణధీర్ కుమార్ సోనీ హత్యాయత్నం చేయడంతో పాటు, అలాగే నవాదా జైలు బద్దలుగొట్టిన కేసులో నేరస్థుడిగా రుజువైంది. దీంతో 17ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు. సరైన సాక్ష్యాధారాలు లేనికారణంగా 2023లో అతడు జైలు నుంచి విడుదలయ్యాడు. ఇక లాలూ సూచనతో అనిత అనే మహిళను భక్తియార్‌పుర్‌లోని కరౌటా జగదాంబ ఆలయంలో మంగళవారం రాత్రి వివాహం చేసుకున్నాడు. అయితే ఎన్నికల్లో పోటీ కోసం తన భార్య అనితను ముంగేర్‌ లోక్‌సభ స్థానం నుంచి ఆర్జేడీ అభ్యర్థిగా బరిలోకి దింపబోతున్నట్లు రాజకీయ ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. మరి, ఎన్నికల్లో పోటీ చేయడం కోసం గ్యాంగ్ స్టార్ అశోక్ మహతో 60 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments