స్మార్ట్ ఫోన్ లో ఇలాంటి KeyBoard వాడుతున్నారా? మీ డబ్బులు గల్లంతే!

స్మార్ట్ ఫోన్ లో ఇలాంటి KeyBoard వాడుతున్నారా? మీ డబ్బులు గల్లంతే!

టెక్నాలజీ పెరుగుతోంది దానితో పాటు సమస్యలు కూడా పెరుగుతున్నాయి. టెక్నాలజీని ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నారు. స్మార్ట్ ఫోన్ కీబోర్డులతో కూడా మోసాలు జరుగుతున్నాయి.

టెక్నాలజీ పెరుగుతోంది దానితో పాటు సమస్యలు కూడా పెరుగుతున్నాయి. టెక్నాలజీని ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నారు. స్మార్ట్ ఫోన్ కీబోర్డులతో కూడా మోసాలు జరుగుతున్నాయి.

స్మార్ట్ ఫోన్ మానవ జీవితంలో భాగమైపోయింది. ఏ చిన్న పనికైనా స్మార్ట్ ఫోన్ లేకపోతే క్షణం గడవని పరిస్థితికి వచ్చింది. ఎంటర్ టైన్ మెంట్ కోసం, ఆర్థిక లావాదేవీల కోసం, ఫోటోలు, వీడియోలు, ఇతర సమాచారం పంపించుకునేందుకు స్మార్ట్ ఫోన్లపైనే ఆధారపడుతున్నారు. పిల్లలకు ఆన్ లైన్ క్లాస్ లకు ఉపయోగపడుతోంది. స్మార్ట్ రాకతో ప్రతి పని సులువైపోయింది. ప్రపంచాన్ని అరచేతిలోకి తీసుకొచ్చింది స్మార్ట్ ఫోన్. అయితే స్మార్ట్ ఫోన్ తో లాభాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ లో మీ నెంబర్ కు వచ్చే అనవసరపు లింకులు, మెసేజ్ లకు స్పిందించి మోసపోయిన ఘటనలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇంకో కొత్త భయం మొదలైంది. స్మార్ట్ ఫోన్ లో కీబోర్డ్ యాప్స్ తో హ్యాకింగ్ కు పాల్పడుతున్నారు.

పలు ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీలకు చెందిన ఫోన్లలో హ్యాకింగ్ వ్యవహారం వెలుగుచూసింది. కీబోర్డ్ సౌండ్‌తో ఫోన్‌లోని బ్యాంకింగ్, సోషల్ మీడియా పాస్‌వర్డ్‌లను హ్యాక్ చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. మీరు స్మార్ట్‌ఫోన్ నుంచి ఆన్ లైన్ పేమెంట్స్ లేదా సోషల్ మీడియా యాప్‌లో లాగిన్ అవ్వడానికి, మీ లాగిన్ ఐడి, పాస్‌వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో కీబోర్డులో స్ట్రోక్ నమెదు చేయబడుతుంది. దీంతో హ్యాకర్స్ సమాచారాన్ని దొంగిలించి ఫ్రాడ్ చేస్తున్నారు.

ఈ కీబోర్డ్ యాప్స్ సామ్ సంగ్, షియోమీ వంటి స్మార్ట్‌ఫోన్లలో ఉపయోగించబడ్డాయి. అయితే కీ బోర్డుల్లో ప్రమాదకరమైనవి ఏవంటే.. సామ్ సాంగ్ కీబోర్డ్, షియోమీ ఫోన్ బైడు, ఐఫ్లైటెక్ అండ్ సొగోయ్ కీబోర్డ్స్, వివో, ఒప్పో, హానర్స్ వంటి కీబోర్డ్స్ ల ద్వారా హ్యాకింగ్ జరుగుతున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు మీ కీబోర్డ్ యాప్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలి. వీలైతే, కీస్ట్రోక్ డేటాను స్టోర్ చేయని కీబోర్డ్ యాప్స్ ఉపయోగించాలని సిటిజన్ ల్యాబ్ ప్రజలకు సూచించింది.

Show comments