నాది కాని భూమి నాకొద్దు.. దయచేసి వెనక్కి తీసుకొండి..

నాది కాని భూమి నాకొద్దు.. దయచేసి వెనక్కి తీసుకొండి..

ధరణి పోర్టల్ లో తప్పుగా కొన్ని కోట్ల రూపాయల విలువజేసే భూమి.. ఓ వృద్దుడి పేరిట నమోదైంది. ఈ క్రమంలో నాది కానీ భూమి నాకు వద్దంటూ ఆ వృద్ధుడి వాపోతున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ధరణి పోర్టల్ లో తప్పుగా కొన్ని కోట్ల రూపాయల విలువజేసే భూమి.. ఓ వృద్దుడి పేరిట నమోదైంది. ఈ క్రమంలో నాది కానీ భూమి నాకు వద్దంటూ ఆ వృద్ధుడి వాపోతున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

78 ఏళ్ళ శ్రీభద్రి రామ స్వామి అనే వృద్ధుడు.. 1995లో ప్రస్తుత వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గరలోని.. పెగడపల్లి గ్రామ పంచాయితీ పరిధి రెడ్డి పురం ప్రాంతంలో ఎకరం భూమిని కొన్నాడు. అయితే తన అవసరాల నిమిత్తం పదేళ్ల క్రితం 399/A సర్వే క్రింద ఆ భూమిని అమ్మకానికి పెట్టాడు. కానీ , ధరణిలో మాత్రం పొరపాటున 399/B సర్వే నంబర్ లో 33 గుంటల భూమి.. రామ స్వామి పేరుతో నమోదయ్యింది. కానీ, ఆ భూమికి వారసులు వీరు అని చెప్పలేని పరిస్థితిలో రెవెన్యూ అధికారులు ఉన్నారు. రెండేళ్ల క్రితమే ఈ భూమి పక్కనుంచి ఇన్నర్ రింగ్ రోడ్ మొదలవ్వడంతో.. ఈ భూమి విలువ అమాంతంగా పెరుగుతూ వచ్చింది. అక్కడ ప్రస్తుతం ఒక్కో గుంటకు రూ.12 లక్షలకు పైగా పలుకుతుంది. ఈ లెక్కన చూస్తే ఇప్పుడు ఆ భూమి ధర అక్షరాలా రూ.4 కోట్లకు పైగా విలువ ఉంది. అసలు సమస్య ఏంటంటే.. ఇప్పుడు ఇదే రామస్వామి పాలిట శాపం అయింది.

ధరణి పోర్టల్ లో పొరపాటున నమోదయిన తన పేరును తొలగించాలని .. రామ స్వామి చెప్పులు అరిగేలా అధికారుల చుట్టూ.. ఆఫీసుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. తనది కానీ భూమి తనకొద్దని.. రామ స్వామి.. ప్రతి సోమవారం.. కలెక్టరేట్ లో నిర్వహించే.. గ్రీవెన్స్ లో అధికారులను కలిసి వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నాడు. కానీ, పోర్టల్ లో పేరు మార్చే అవకాశం మాకు లేదని.. అధికారులు చెప్పేస్తున్నారు. దీనితో ఈ సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. దీనితో భూ కబ్జా దారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఈ భూమిపై కన్నేశారు. గత రెండేళ్లుగా రామస్వామిని బెదిరిస్తూ బలవంతగా ఆ భూమిని కబ్జా చేయాలని . ప్రయత్నిస్తూనే ఉన్నారు. మరి కొంతమైతే రామస్వామి సంతకం చేయకపోతే చనిపోతామని కూడా బెదిరిస్తున్నారు. దీనితో ఇప్పుడు ఈ విషయం రామ స్వామి ప్రాణాల మీదకు వచ్చింది.

మరి కొంతమంది ఏకంగా పోలీసులు, అధికారులతోనే రికమెండ్ చేయిస్తున్నారు. మరి కొంతమంది రెవెన్యు ఆఫీసర్లు కూడా తాము చెప్పిన వారికి రిజిస్ట్రేషన్ చేస్తే.. భూమి విలువలో సగం ఇప్పిస్తామంటూ.. రామ స్వామిని ఒత్తిడికి గురి చేస్తున్నారంట.. మరో వైపు ఆ ఏరియా పోలీస్ స్టేషన్ కు కొత్తగా వచ్చిన సీఐ కూడా తనను స్టేషన్ కు పిలిపించి మరి.. ఈ భూమి గురించి బెదిరిస్తున్నాడని అతను వాపోయాడు. కానీ రామ స్వామి మాత్రం ప్రభుత్వానికి తప్ప తన భూమిని ఎవరికీ ఇవ్వదలచుకోవడం లేదని నిక్కచ్చిగా చెప్పేశాడు. ఈ క్రమంలో తన ప్రాణానికి ముప్పు ఉన్న కారణంగా.. రామ స్వామి కుమారుడు.. వేణు .. తన తండ్రిని కాపాడాలని ప్రభుత్వాన్నీ సహాయం అడుగుతున్నాడు. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments