బీర్లు దొరకట్లేదని యువకుడు పాదయాత్ర.. 24 గంటల్లో సమస్యకు పరిష్కారం!

బీర్లు దొరకట్లేదని యువకుడు పాదయాత్ర.. 24 గంటల్లో సమస్యకు పరిష్కారం!

సోషల్ మీడియా హావ రోజు రోజుకి పెరుగుతున్న క్రమంలో.. కొంతమంది నిజంగా చేస్తున్నారో లేక.. ఫేమస్ అవ్వడం కోసం చేస్తున్నారో తెలియదు కానీ.. రకరకాల వింతలు విన్యాసాలతో వార్తల్లోకి వచ్చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ తాగుబోతుల సంఘం అధ్యక్షుడు చేసిన నిరసన ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సోషల్ మీడియా హావ రోజు రోజుకి పెరుగుతున్న క్రమంలో.. కొంతమంది నిజంగా చేస్తున్నారో లేక.. ఫేమస్ అవ్వడం కోసం చేస్తున్నారో తెలియదు కానీ.. రకరకాల వింతలు విన్యాసాలతో వార్తల్లోకి వచ్చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ తాగుబోతుల సంఘం అధ్యక్షుడు చేసిన నిరసన ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సోషల్ మీడియాలో రక రకాల పోస్ట్స్ లతో ఎవరో ఒకరు ఫేమస్ అవుతూనే ఉన్నారు. ఈ క్రమంలో ఓ తాగుబోతుల సంఘం అధ్యక్షుడు చేసిన నిరసన కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది. అసలే వేసవి కాలం బయట ఎండలు మండిపోతున్నాయి. అందులోను కొన్ని ప్రాంతాలలో నీటి కొరత దారుణంగా ఉంది. ప్రజలు రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. వీరందరిది ఓ ఇబ్బంది అయితే తాగుబోతులది మరో రకమైన ఇబ్బంది. ఈ మండుటెండల్లో తాము తాగేందుకు చిల్డ్ బీర్ కావాలంటూ మొరపెట్టుకుంటున్నారు. దీనితో ఓ ప్రాంతంలో తాగాగుబోతుల సంఘం అధ్యక్షుడు.. కూలింగ్ బీర్లు కొరతతో మద్యం ప్రియులు ఇబ్బంది పడుతున్నారని ఓ పోరాటమే చేశాడు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందంటే..

ఈ విచిత్ర సంఘటన.. మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఆ జిల్లా తాగుబోతుల సంఘం అధ్యక్షుడ.. తరుణ్ మద్యం ప్రియుల తరపున ఈ పోరాటం చేసాడు. కూలింగ్ బీర్లు కొరతతో మద్యం ప్రియులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని.. మండే ఎండలలో మద్యం ప్రియుల బాధలు తీర్చాలని.. మంచిర్యాల ఐబీ నుంచి మంచిర్యాల కలక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టాడు. ఆ తర్వాత అక్కడ ఉనన్ ఎక్సైజ్ శాఖకు తన మానవుని చెప్పుకున్నాడు. దీనితో అతని పోరాటానికి ప్రతిఫలంగా కేవలం 24 గంటలలోనే సమాధానం లభించింది. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న బార్లు, వైన్ షాప్స్ లో కింగ్ ఫిషర్ బీర్లు స్టాక్ ను అధికారులు అందుబాటులోకి తీసుకుని వచ్చారు. దీనితో మద్యం ప్రియులు ఫుల్ ఖుషి అయిపోతున్నారు. తమ తరపున పోరాటం చేసిన ఆ సంఘ, అధ్యక్షుడిని ఘనంగా శాలువాతో సన్మానం కూడా చేశారు. దీనితో ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక మంచిర్యాలతో పాటు. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలలో కూడా కింగ్ ఫిషర్ బీర్లు దొరకడం లేదని, దీనితో వారి ఆరోగ్యాలు దెబ్బ తింటున్నాయని.. తరుణ్ మంచిర్యాల జిల్లా ఎక్సెజ్ సూపరింటెండెంట్ కు వినతి పత్రం ద్వారా తమ బాధను వ్యక్తం చేశారు. ఇలాంటి నిరసన తొలిసారి జరిగిందంటూ.. ఇంతవరకూ ఎక్కడా కూడా బీర్లు కోసం పాదయాత్ర చేసి నిరసన తెలిపిందే లేదంటూ.. సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. పైగా అధికారులు కూడా కేవలం 24 గంటలలోనే ఈ సమస్యకు చెక్ పెట్టి.. పరిష్కారం చూపించడం విశేషం. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments