OTT Suggestion: బ్లైండ్ డేట్ తో యువతికి అదృష్టం! బ్యాడ్ లక్ ఉన్న వాళ్ళు ఈ సిరీస్ మిస్ కాకండి!

OTT Suggestion: బ్లైండ్ డేట్ తో యువతికి అదృష్టం! బ్యాడ్ లక్ ఉన్న వాళ్ళు ఈ సిరీస్ మిస్ కాకండి!

ఓటీటీ లో ఎన్నో సిరీస్ లు, సినిమాలు వస్తూ ఉంటాయి. కానీ, వాటిలో ఏ సినిమా చూడాలి.. ఏ సిరీస్ చూడాలి అనే కన్ఫ్యూషన్ అందరికి ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పుడు అందరికి నచ్చేలా ఒక మంచి సిరీస్ ఓటీటీ లో స్ట్రీమింగ్ అయిపోతుంది. మరి ఆ సిరీస్ ఏంటి ఎక్కడ స్ట్రీమ్ అవుతోంది అనే విషయాలను చూసేద్దాం.

ఓటీటీ లో ఎన్నో సిరీస్ లు, సినిమాలు వస్తూ ఉంటాయి. కానీ, వాటిలో ఏ సినిమా చూడాలి.. ఏ సిరీస్ చూడాలి అనే కన్ఫ్యూషన్ అందరికి ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పుడు అందరికి నచ్చేలా ఒక మంచి సిరీస్ ఓటీటీ లో స్ట్రీమింగ్ అయిపోతుంది. మరి ఆ సిరీస్ ఏంటి ఎక్కడ స్ట్రీమ్ అవుతోంది అనే విషయాలను చూసేద్దాం.

కొన్ని పదుల సినిమాలు, సిరీస్ లు ఓటీటీ నిత్యం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాయి. అయితే అందరు కోరుకునేది ఒక మంచి సినిమా కానీ సిరీస్ కానీ చూసి హ్యాపీగా ఎంటర్టైన్ అవ్వాలనే కదా. ఇప్పటివరకు ఓటీటీ లో ఉన్న సినిమాలు, సిరీస్ లలో కామెడీ, హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇలా అన్ని జోనర్స్ ఉంటూనే ఉన్నాయి. ఇవన్నీ నిత్యం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాయి. అయితే కొన్ని సినిమాలు, సిరీస్ లు మాత్రం ప్రేక్షకులను ఇన్స్పైర్ చేసే విధంగా కూడా ఉంటాయి. ఆ సినిమాలను లేదా సిరీస్ లను చూసి తమ నిర్ణయాలను మార్చుకునే వారు కూడా ఎంతో మంది ఉంటారు. మేము ఇంతే ఇది మా బ్యాడ్ లక్ అనుకుంటూ ఉండేవారు ఎంతో మంది ఉంటారు. కానీ, అటువంటి వారి జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలు జరుగుతాయని.. ఈ సిరీస్ చూస్తే అర్ధమౌతుంది. అందరికి ఇన్స్పిరేషన్ కలిగించే ఈ సిరీస్ ఏ ప్లాట్ ఫార్మ్ లో అందుబాటులో ఉందో.. అసలు ఈ సిరీస్ కథేంటో చూసేద్దాం.

ఇప్పటివరకు చెప్పుకున్న సిరీస్ పేరు “వార్మ్ మీట్ యు”. ఈ పేరు వినడానికి హాలీవుడ్ సిరీస్ ల అనిపిస్తున్న మాట నిజమే.. ఇది ఒక కే- డ్రామా ప్లాట్ కు సంబంధించిన సిరీస్ . అలా అని ఈ సిరీస్ ను స్కిప్ చేయవలసిన అవసరం లేదు.. ఎందుకంటే ఈ సిరీస్ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. అది కూడా ఫ్రీ గా అమెజాన్ మినీ టీవీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ కథ విషయానికొస్తే.. జాహో న్యూహాన్ అనే యువతికి అద్భుతమైన డ్రాయింగ్ స్కిల్స్ ఉంటాయి. చైనాలోనే ప్రసిద్ధి గాంచిన ఒక గొప్ప కామిక్ కళాకారిణిగా ఎదగాలని ఆమె కల. కానీ, ఆమె ప్రయత్నించిన ప్రతి సారి ఫెయిల్ అవుతూనే ఉంటుంది. అనుకోకుండా ఒకసారి ఆమె ఒక బ్లైండ్ డేట్ కు వెళ్లాల్సి వస్తుంది. ఆ డేట్ లో ఆమె అనుకోకుండా గుయి చెన్ అనే వ్యక్తిని కలుస్తుంది. ఆమెకు ఉన్న ఒకే ఒక్క లోపం ఏంటంటే ఆమె ఏం కోరుకున్న కూడా అది జరగదు.. బ్యాడ్ లక్ ఆమెను వెంటాడుతూనే ఉంటుంది. ఇదంతా నా తలరాత అని బాధపడుతున్న క్రమంలో.. దానికి వ్యతిరేకంగా ఆమె గుయి చెన్ ను కలిసినప్పటినుంచి.. ఆమె అదృష్టం మెరుగ్గా మారుతూ వస్తుంది.

దీనితో ఆమె అతనితో కలిసి ట్రావెల్ చేయాలి అనుకుంటుంది. అతనికి దగ్గరగా ఉండాలి అనుకుంటుంది. తన ఇరవై ఏళ్ల దురదృష్టాన్ని మార్చుకునేందుకు ఆమె అబ్బాయి వేషం వేయడానికి కూడా వెనుకాడదు. ఈ క్రమంలోనే అతని ఆఫీస్ లో క్లీనింగ్ ఉద్యోగాన్ని సంపాదిస్తుంది. కానీ, ఆమెకు తెలియని విషయం ఏంటంటే గుయి చెన్ కు ఒక విచిత్రమైన వ్యాధి ఉంది. అదేంటంటే అతనికి అపోజిట్ జెండర్ టచ్ ఎలర్జీ. అంటే ఆడవారి చేతి స్పర్శ తాకితే వెంటనే ఎలర్జీ వచ్చేస్తుంది. మరి, ఈ జంట ఇద్దరు కలిసి తమ లోపాలను ఎలా సరిచేసుకుంటారు ! ఎవరికీ ఎవరు తోడుగా నిలుస్తారు ! ఇప్పటివరకు ఇదంతా నా బ్యాడ్ లక్ అనుకున్న ఆమెకు గుయి చెన్ దొరకడం అదృష్టంగా భావించి.. తన లోపం గురించి తెలిసాక ఎలా ఫీల్ అవుతుంది! ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ సిరీస్ ఖచ్చితంగా చూడాల్సిందే. ఈ మధ్య కే-డ్రామాస్ కు పెరుగుతున్న క్రేజ్ వలన వీటికి మంచి ఆదరణ లభిస్తుంది. మరి, ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments