OTT Suggestion: గేటెడ్ కమ్యూనిటీస్ లో ఉండే వారే టార్గెట్! OTTలోని ఈ సిరీస్ ఖాకీ కన్నా ఘోరం!

OTT Suggestion: గేటెడ్ కమ్యూనిటీస్ లో ఉండే వారే టార్గెట్! OTTలోని ఈ సిరీస్ ఖాకీ కన్నా ఘోరం!

కొత్త సినిమాలను, సిరీస్ లను వచ్చినవి వచ్చినట్లుగా చూస్తూనే ఉన్నారు మూవీస్ లవర్స్. ఈ క్రమంలో కొన్ని పాత సినిమాలను, సిరీస్ లను మిస్ చేసేస్తున్నారు. ఒకవేళ మీరు మిస్ చేసిన వాటిలో ఈ సిరీస్ కూడా ఉందేమో ఓ లుక్ వేసేయండి.

కొత్త సినిమాలను, సిరీస్ లను వచ్చినవి వచ్చినట్లుగా చూస్తూనే ఉన్నారు మూవీస్ లవర్స్. ఈ క్రమంలో కొన్ని పాత సినిమాలను, సిరీస్ లను మిస్ చేసేస్తున్నారు. ఒకవేళ మీరు మిస్ చేసిన వాటిలో ఈ సిరీస్ కూడా ఉందేమో ఓ లుక్ వేసేయండి.

రియల్ లైఫ్ స్టోరీస్ ను డాక్యుమెంటరీస్, మూవీస్, సిరీస్ ల రూపంలో తెరకెక్కిస్తున్న క్రమంలో వాటికి లభించే ఆదరణ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. దీనితో మేకర్స్ కూడా నిజ జీవిత సంఘటనలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నారు. దీనితో చూసేవాళ్లకు కూడా అసలు అక్కడ ఏం జరిగింది అనే విషయాలను తెలుసుకోగలుగుతున్నారు. ఇలాంటి ఎన్నో నిజ జీవిత సంఘటనలు తెరమీద చూపించారు. ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ కూడా ఇటువంటిదే. ఒకవేళ ఈ సిరీస్ ను కనుక మిస్ అయ్యి ఉంటె.. కొన్ని విషయాలను ఎప్పటికి తెలుసుకోలేరు. మరి ఆ సిరీస్ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఈ సిరీస్ మరేదో కాదు.. “ఢిల్లీ క్రైమ్”. ఈ సిరీస్ రెండు సీజన్స్ గా వచ్చింది. ఇది ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఢిల్లీలో జరిగిన నిర్భయ గ్యాంగ్ రేప్ సంఘటన దేశం మొత్తాన్ని దిగ్బ్రాంతికి గురి చేసిన విషయం తెలియనిది కాదు. ఆ తర్వాత దేశంలో ఎన్నో చట్టాలు అమలులోకి వచ్చాయి. ఆ సంఘటనను ఆధారంగా తీసుకుని.. ఈ సిరీస్ ను రూపొందించారు. ఇది తప్పకుండా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన వాస్తవ సంఘటనలకు అద్దం పట్టిన సిరీస్. ఢిల్లీ క్రైమ్ సీజన్ 1 లో.. గ్యాంగ్ రేప్, దారుణమైన హత్యకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చుట్టూ జరిగే కథను చూపించారు. ఇక ఆ సిరీస్ సక్సెస్ అవ్వడంతో.. సీజన్ 2 ను కూడా కొనసాగించారు మేకర్స్. ఇక సీజన్ 2 లో ఢిల్లీ లో కచ్చా బనియన్ గ్యాంగ్ పేరుతో ఎలాంటి క్రూర హత్యలు జరిగాయి.. ఆ కేసులను పరిష్కరించడానికి వచ్చిన డీసీపీ ఎలా వీటిని సాల్వ్ చేసింది అనేది చూపించారు.

1990లో ఢిల్లీని మొత్తాన్ని వణికించినా కచ్చా బనియన్ గ్యాంగ్ మళ్ళీ ఢిల్లీ కి వచ్చిందా ! ఈసారి నగర శివార్లలో కాకుండా.. నగరం నడిబొడ్డున ఉన్న గేటెడ్ కమ్యూనిటీస్ లో ఒంటరిగా ఉండే వృద్ధులను టార్గెట్ చేసి.. వారిని దారుణంగా హతమార్చి .. అందినవి అందినట్లు దోచుకుంటుందా ! అసలు ఈ హత్యలు అన్నీ చేస్తుంది కచ్చా బనియన్ గ్యాంగ్ ఏ నా లేదంటే వారి పేర్లు చెప్పుకుని ఇంకా ఎవరైనా ఈ హత్యలు చేస్తున్నారా ! వీటి వెనుక ఎవరున్నారు ! ఈ కేసును సాల్వ్ చేసే ప్రాసెస్ లో వారు ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే.. ఈ సిరీస్ ను అసలు మిస్ అవ్వకుండా చూడాల్సిందే. మరి ఈ సిరీస్ ను ఇప్పటివరకు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి. మరి ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments