బిగ్ బ్రేకింగ్: ప్రముఖ నటికి యాక్సిడెంట్.. తీవ్ర గాయాలు

బిగ్ బ్రేకింగ్: ప్రముఖ నటికి యాక్సిడెంట్.. తీవ్ర గాయాలు

ప్రముఖ నటికి యాక్సిడెంట్ జరిగింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ముంజేతి ఎముకలు విరిగినట్లు చెబుతున్నారు ఆమె భర్త. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

ప్రముఖ నటికి యాక్సిడెంట్ జరిగింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ముంజేతి ఎముకలు విరిగినట్లు చెబుతున్నారు ఆమె భర్త. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

ప్రముఖ టీవీ సీరియల్ నటి దివ్యాంకా త్రిపాఠి దహియా ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయాన్ని ఆమె భర్త వివేక్ దహియా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం ఆమె వైద్యుల సంరక్షణలో ఉంది. ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతోంది. గురువారం సాయంత్రం ఈ ప్రమాదానికి గురైనట్లు వివేక్ వెల్లడించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటుందని పేర్కొన్నాడు. ఆమె ఎత్తైన ప్రాంతం నుండి పడిపోయిందని, దీని కారణంగా ఆమె రెండు మంజేతులు ఎముకలు విరిగిపోయాయని తెలిపారు. వెంటనే శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు సూచించారని తెలిపారు.

మా పట్ల ప్రేమ, అభిమానానికి ధన్యవాదాలు అంటూ ఇన్ స్టాలో పోస్టు చేశాడు దివ్యాంక భర్త వివేక్. గురువారం సాయంత్రం.. వివేక్ దహియా సోషల్ మీడియా లైవ్ సెషన్ షెడ్యూల్ చేయగా.. ఈ యాక్సిడెంట్ కారణంగా రద్దు చేశారు. ఈ సందర్భంగా ఈ సెషన్ రద్దు చేస్తున్నట్లు వివేక్ టీం పేర్కొంది. షూటింగ్ జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన దివ్యాంక ఆకాశవాణిలో నటిగా కెరీర్ స్టార్ చేసింది. ఎక్కువగా హిందీ సీరియల్లోనే నటించింది. య హై మొహబ్బత్తేన్ అనే సీరియల్లో నటించింది. ఇది స్టార్ మాలో మనసు పలికే మౌనగీతం పేరుతో డబ్ అయ్యి మంచి ఆదరణ చూరగొంది.

ఇవే కాకుండా రియాలిటీ షోల్లో కూడా పాల్గొంటూ సత్తా చాటుతుంది. నాచ్ బలియా 8లో కంటెస్టెంట్‌గా పోటీ చేసి.. విన్నర్ అయ్యింది. ఫియర్ ఫ్యాక్టర్ అనే షోలో కూడా పార్టీసిపేట్ చేసింది. ఇవే కాదు లాలా హర్దౌల్, ఏ డివోర్స్ టూ రిమెంబర్ సినిమాలో నటించింది. వీటితో పాటు పలు వెబ్ సిరీస్సుల్లోనూ నటించింది. 2016లో తన సహ నటుడు, టీవీ యాక్టర్ వివేక్ దహియాను వివాహం చేసుకుంది. ఇతడు కూడా బాలీవుడ్ టీవీ ఇండస్ట్రీ ప్రేక్షకులకు బాగా సుపరిచితడే. పలు సినిమాల్లో కూడా నటించాడు.

Show comments