Vijayawada: స్నేహితులు అలా చేసే సరికి డాక్టర్ సంచలన నిర్ణయం.. కుటుంబ సభ్యులను..

స్నేహితులు అలా చేసే సరికి డాక్టర్ సంచలన నిర్ణయం.. కుటుంబ సభ్యులను..

కుటుంబ సభ్యులను చంపి, తాను ఆత్మహత్య చేసుకున్న విజయవాడ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ధారావత్ శ్రీనివాస్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చనిపోయే ముందు అతడు వాట్సప్ వాయిస్ మేసేజ్ చేశాడు. అందులో ఏముందంటే....?

కుటుంబ సభ్యులను చంపి, తాను ఆత్మహత్య చేసుకున్న విజయవాడ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ధారావత్ శ్రీనివాస్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చనిపోయే ముందు అతడు వాట్సప్ వాయిస్ మేసేజ్ చేశాడు. అందులో ఏముందంటే....?

విజయవాడలో ఆర్థోపెటిక్ సర్జన్ ధారావత్ శ్రీనివాస్.. కుటుంబ సభ్యులను చంపి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం స్థానికంగా సంచలనం కలిగిచింది. కని పెంచిన తల్లిని, కట్టుకున్న భార్యను, అల్లారు ముద్దుగా పెంచుకుంటోన్న పిల్లల్ని కత్తితో పొడిచి చంపి.. అనంతరం అతడు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే ఈ కేసులో ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. అయితే బంధువులు మాత్రం.. స్నేహితుల మోసం వల్లే అతడు చనిపోయారంటూ ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి పెట్టి.. మంచి వైద్యం అందించాలని కలలు కన్న వైద్యుడు కల నేరవేర్చుకున్నాడు. కానీ కొన్ని సమస్యలు వెంటాడి.. చివరకు హత్యకు, ఆత్మహత్యకు పురిగొల్పేలా చేశాయి.

వివరాల్లోకి వెళితే.. విజయవాడలోని గురు నానక్ కాలనీలోని మారుతి కో ఆపరేటివ్ కాలనీలో ప్లాట్ నంబర్ 53లోని భవనంలో నివసిస్తున్నాడు ఎముకల డాక్టర్ ధారావత్ శ్రీనివాస్. ఆయన తల్లి రమణమ్మ (65), భార్య ఉష (38), కూతురు శైలజ (11), కుమారుడు శ్రీహాన్( 6)తో జీవిస్తున్నాడు. శ్రీనివాస్ తండ్రి జమలయ్య నాయక్ విజయవాడ తూర్పు ఏసీపీగా పనిచేశారు. ఇప్పుడు తండ్రి లేరు. అన్నయ్య దుర్గా ప్రసాద్ హైదరాబాద్‌లో న్యాయాధికారిగా పని చేస్తున్నారు. చెల్లెలికి వివాహం అయ్యింది. గుంటూరులో వైద్య విద్యను అభ్యసించిన శ్రీనివాస్.. విజయవాడలో పలు ఆసుపత్రుల్లో పని చేశారు. అయితే ఎప్పటి నుండో ఆయనకు సొంత ఆసుపత్రి నిర్మించాలన్నది కల. గత ఏడాది ఓ భవనాన్ని లీజుకు తీసుకుని, శ్రీజ ఆర్థోపెడిక్ పేరుతో ఆసుపత్రిని స్టార్ట్ చేశారు. అందులో పరికరాల కోసం కొంత మంది స్నేహితులను సాయం కోరారు. సుమారు మూడు కోట్లు అప్పులు అయ్యాయని తెలుస్తోంది.

అయితే ఆసుపత్రి సరిగ్గా నడవకపోవడంతో.. అప్పులు ఇచ్చిన స్నేహితులు.. ఆ ఆసుపత్రిలో 90 శాతం వాటాను సొంతం చేసుకున్నారు. దీంతో మానసికంగా ఆవేదన చెందిన శ్రీనివాస్.. చనిపోవాలనుకున్నాడు. తాను లేకపోతే.. తనను నమ్ముకున్న కుటుంబ సభ్యులు బతక లేరని నిర్ణయించుకుని.. వారిని చంపి.. అతడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఏప్రిల్‌ 25వ తేదీన గురునానక్‌ నగర్‌లోని సూపర్‌ మార్కెట్‌కు వెళ్లి రెండు చాకులు కొన్నాడు. మంగళవారం తెల్లవారు జామున నిద్రిస్తున్న కుటుంబ సభ్యలు మెడ మీద కత్తితో గాట్లు పెట్టి చంపేశాడు. అనంతరం ఇంటిలో ఉన్న కొంత నగదు, నగలు, ఆస్తి డాక్యుమెంట్లను ఓ బ్యాగులో సర్ది దానిని కారులో పెట్టాడు. తన అన్నకు రాసిన లెటర్‌ను, కారు తాళం చెవిని ఎదురింటి గేటుకు ఉన్న డబ్బాలో వేశాడు. తిరిగి తన ఇంటికి వచ్చి వరండాలో ఉరివేసుకున్నారు. తొమ్మిది గంటల ప్రాంతంలో పనిమనిషి పిలవగా పలకలేదు. ఏం జరిగిందని గేటుపై నుంచి చూస్తే వరండాలో ఉరికి వేలాడుతూ కనిపించాడు శ్రీనివాస్.

వెంటనే స్థానికులకు, బంధువులకు సమాచారం అందించింది. శ్రీనివాస్‌ అన్న దుర్గాప్రసాద్‌ పటమట పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ రామకృష్ణ, డీసీపీ అదిరాజ్‌సింగ్‌ కేసు దర్యాప్తు చేపట్టారు.ఆత్మహత్య చేసుకునే ముందు డాక్టర్‌ శ్రీనివాస్‌ తన వాట్సాప్‌ నంబరుకు వాయిస్‌ మెసేజ్‌ పెట్టుకున్నాడు. తన పరిస్థితికి తానే కారణమని, ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి బయటపడలేక ఈ దారుణానికి ఒడిగట్టినట్లు చెప్పాడు. తాను లేకపోతే తన కుటుంబ సభ్యులు అనాథలు అవుతారన్న భయంతో వారిని కూడా చంపేసినట్లు ఆ మెసేజ్‌లో పేర్కొన్నాడు. దీంతో ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Show comments