అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని.. భర్తని పెట్రోల్ పోసి కాల్చేసిన భార్య!

అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని.. భర్తని పెట్రోల్ పోసి కాల్చేసిన భార్య!

మహిళలు కూడా మహా ముదుర్లుగా తయారవుతున్నారు. భర్తను చీటింగ్ చేస్తూ.. ప్రియుడితో గంటలు గంటలు గడుపుతున్నారు. అతడితో షాపింగ్, షికార్లు చేస్తూ పిల్లల్ని కూడా పట్టించుకోవడం లేదు. చివరకు అడ్డుగా ఉన్న భర్తను సైతం

మహిళలు కూడా మహా ముదుర్లుగా తయారవుతున్నారు. భర్తను చీటింగ్ చేస్తూ.. ప్రియుడితో గంటలు గంటలు గడుపుతున్నారు. అతడితో షాపింగ్, షికార్లు చేస్తూ పిల్లల్ని కూడా పట్టించుకోవడం లేదు. చివరకు అడ్డుగా ఉన్న భర్తను సైతం

వివాహ బంధానికి తూట్లు పొడుస్తున్నాయి వివాహేతర/అక్రమ సంబంధాలు. కట్టుకున్న భర్తలో లేదా భార్యలో వంకలు వెతుకుతూ.. మరొకరితో రొమాన్స్ చేస్తున్నారు. ఈ చాటు మాటు వ్యవహారం కారణంగా సంసారం నాశనం అవుతుంది. దీని వల్ల పిల్లల జీవితాలు నడి రోడ్డు మీద పడుతున్నాయి. బంధువులు, చుట్టాల్లో పరువుపోయి తలెత్తుకోలేని స్థితికి చేరిపోతున్నారు. ప్రియుడి/ప్రియురాలు మోజులో పడి జీవిత భాగస్వామిని కాటికి పంపేందుకు కూడా వెనకాడటం లేదు. తాజాగా ప్రియుడి మోజులో భర్తను కడతేర్చిందో ఇల్లాలు. ఈ ఘటన తెలుగు రాష్ట్రంలోనే చోటుచేసుకుంది. చివరకు పోలీసులు పట్టుకున్నారు.

గత నెల 30న తెలంగాణలోని శంషాబాద్ ప్రాంతంలోని కడ్తాల్ పీఎస్ పరిధి మక్త మాధారంలోని బటర్ ఫ్లై సిటీ వెంచర్‌లో కాలిపోయిన వ్యక్తి డెడ్ బాడీని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. మృతుడు బాలాపూర్ పరిధి నాదర్ గుల్ గ్రామం బాలాజీ నగర్‌కు చెందిన తాండ్ర రవీందర్‌గా గుర్తించారు. తీగ లాగితే డొంక కదిలినట్లు అయ్యింది. భార్య సంగీతనే అతడిని హత్య చేసిందని నిర్ధారణకు వచ్చారు పోలీసులు. అక్రమ సంబంధం మోజులో పడి, ప్రియుడితో కలిసి భర్తను భార్యే హత్య చేసిందని తేల్చారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రవీందర్‌, సంగీత భార్య భర్తలు. సంగీత బాలాపూర్‌కు చెందిన వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది.

తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య.. అతడ్ని చంపేయాలనుకుంది. అనుకున్నదే తడువుగా.. ఈ విషయాన్ని ప్రియుడితో చెప్పింది. యాదగిరి, అతని ఫ్రెండ్ అనిల్ కుమార్ కలిసి ప్లాన్ వేశారు. ఏప్రిల్ 29న రాత్రి రవీందర్ తన భార్య కోసం స్థానిక విశాల్ మార్ట్ వద్ద వేచి ఉండగా.. సంగీత యాదగిరికి విషయం చెప్పింది. ఈ ముగ్గురు కలిసి.. ఓ కారులో వచ్చి రవీందర్‌ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లి.. కొట్టి చంపారు. ఆనవాళ్లు దొరకకుండా బటర్ ఫ్లై సిటీ వెంచర్‌కు డెడ్ బాడీ తీసుకెళ్లి.. పెట్రోల్ పోసి నిప్పంటించారు. మరుసటి ఏం ఎరుగన్నట్లుగా భర్త కనిపించడం లేదని బావ రఘనందన్‌కు ఫోన్ చేసి తెలిపింది. అయితే మిస్సింగ్ కంప్లయింట్ చేయాలని ఆమెకు సూచించాడు. కానీ ఆమె చేయలేదు. నిర్లక్ష్యంగా ఉండటంతో బావే.. సంగీతను తీసుకెళ్లి.. ఫిర్యాదు చేశాడు. ఇంతలో రవీందర్ మృతదేహం లభించడం.. మిస్సింగ్ కేసు చేధించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Show comments