CM Jagan Helps Child Treatment: గొప్ప మనసు చాటుకున్న CM జగన్‌.. చిన్నారి వైద్యానికి ఏకంగా రూ.41.5 లక్షలు

గొప్ప మనసు చాటుకున్న CM జగన్‌.. చిన్నారి వైద్యానికి ఏకంగా రూ.41.5 లక్షలు

కష్టం అని తెలిస్తే చాలు.. వెంటనే నేనున్నాను అంటూ ఆపన్న హస్తం అందిస్తారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. ఆపద అని తెలిస్తే చాలు.. మానవతా దృక్పథంతో స్పందిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా కులాలు, మతాలకతీతంగా.. పార్టీల భేదం చూడకుండా.. ఎందరినో ఆదుకున్నారు సీఎం జగన్‌. ఇక తాజాగా మరోసారి ఆయన గొప్ప మనసు చాటుకున్నారు. బ్రెయిన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారి వైద్యానికి ఏకంగా రూ.41.5 లక్షలు సాయం చేశారు. ఆ వివరాలు..

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలుకు చెందిన పలివెల రాంబాబు అనే వ్యక్తి కుమార్తె.. తొమ్మిదేళ్ల బాలిక బ్లెస్సీ కొన్నాళ్లుగా తలనొప్పితో బాధపడుతుండేది. ఈ క్రమంలో బ్లెస్సీ తల్లిదండ్రులు.. చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. బాలికకు బ్రెయిన్‌ క్యాన్సర్‌ అని వైద్యులు నిర్థారించారు. చికత్సకు ఏకంగా 41 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని తెలిపారు. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. వైద్యం కోసం అంత భారీ మొత్తం.. ఎలా ఖర్చు చేయగలం అని బాధ పడ్డారు. బ్లెస్సీని ఎలా కాపాడుకోవాలో వారికి అర్థం కాలేదు. దేవుడి మీద భారం వేసి.. ఆదుకునే ఆపన్న హస్తం కోసం ఎదురు చూడసాగారు.

అయితే వారి మొరను దేవుడు ఆలకించాడు. ఈ క్రమంలో ఆగస్ట్‌ 11న సీఎం జగన్‌ అమలాపురం పర్యనటకు వచ్చారు. దాంతో బ్లెస్సీ తండ్రి రాంబాబు.. తన బిడ్డ సమస్య గురించి.. సీఎం జగన్‌కు తెలియజేయాలనుకున్నాడు. దాంతో తన కుమార్తె సమస్య గురించి.. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ దృష్టికి తీసుకెళ్లి సాయం చేయమని కోరాడు.

మంత్రి ద్వారా.. చిన్నారి బ్లెస్సీ సమస్య గురించి తెలుసుకున్న సీఎం జగన్‌ చలించిపోయాడు. వెంటనే చిన్నారి వైద్యానికి అవసరమైన 41.50 లక్షల రూపాయల మొత్తాన్ని మంజూరు చేశారు. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును మంత్రి విశ్వరూప్‌ భార్య బేబీ మీనాక్షి, కుమారుడు డాక్టర్‌ శ్రీకాంత్‌ సోమవారం.. బ్లెస్సీ కుటుంబానికి అందించారు. సీఎం జగన్‌ మంచి మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు జనాలు.

Show comments