EBC Nestham: మహిళలకు గుడ్‌న్యూస్‌! రేపే ఖాతాల్లోకి రూ.15 వేలు

EBC Nestham: మహిళలకు గుడ్‌న్యూస్‌! రేపే ఖాతాల్లోకి రూ.15 వేలు

ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెంచేందుకు ప్రయత్నిస్తున్న ఏపీ సర్కార్‌.. తాజాగా మరో పథకానికి శ్రీకారం చుట్టబోతోంది. ఈ మేరకు సీఎం జగన్‌ ప్రతి మహిళ ఖాతాలో 15 వేలు జమచేస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పేదలను ఆదుకోవడమే ధ్యేయంగా, వారి ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పనిచేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ.. పేదల ఇళ్లలో వెలుగులు నింపుతున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లోని మహిళలకు జగన్‌ సర్కార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఈబీసీకి చెందిన ప్రతి మహిళ ఖాతాలో రూ.15 వేలను గురువారం జమచేయనున్నారు. గురువారం కర్నూలు, నంద్యాల జిల్లాల్లో సీఎం జగన్‌ పర్యటించనున్నారు.

ఈ పర్యటనలో భాగంగా వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం పథకాన్ని సీఎం జగన్‌ ప్రారంభించనున్నారు. ఈ పథకంలో భాగంగా ప్రతి ఈబీసీ మహిళ ఖాతాలో ఏడాది రూ.15 వేల చొప్పున మూడేళ్ల పాటు నగదును జమచేయనున్నారు. ఈ పథకంతో రూ.45 ఆర్థిక చేయూత అందిచనుంది జగన్‌ సర్కార్‌. 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న ఓసీ వర్గాలకు చెందిన పేద మహిళలకు ప్రతి ఏటా రూ.15 వేలు ఆర్థిక సాయం చేయనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.

ఈ పథకంతో రాష్ట్రంలోని ఎంతో మంది పేద ఈబీసీ, ఓసీ మహిళలకు మేలు జరగనుంది. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలతో పేద ప్రజలను ఆదుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ పథకంతో పేద ఓసీ కుటుంబాలకు కూడా ఆర్థిక తోడ్పాటు అందివ్వనుంది. ఈ పథకంపై ఇప్పటికే ఆ వర్గానికి చెందిన ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లా పర్యటన సందర్భంగా సీఎం జగన్‌ ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టడంపై హర్షం వ్యక్తమవుతోంది. మరి ఈ పథకంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments