ప్రసంగానికి ముగ్ధుడైన ముఖ్యమంత్రి.. ముద్దులందుకున్న చిరంజీవి..

ప్రసంగానికి ముగ్ధుడైన ముఖ్యమంత్రి.. ముద్దులందుకున్న చిరంజీవి..

12 ఏళ్ల చిరంజీవి.. ఎదురుగా వేలాది మంది.. తన వెనుకనే రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు.. చేతిలో మైక్‌.. అయితే ఏం.. ఏమి మాట్లాడాలో క్లారిటీ ఉంది. బట్టిపట్టిందైతే మరిచిపోవచ్చునేమో, లేని, తాను చూడనదైతే తడబడొచ్చునేమో గానీ.. అంతా తాను విన్నదే.. కన్నదే.. కావడంతో ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడాడు ఆరో తరగతి చదువుతున్న ఆ చిరంజీవి. విజయనగరం జిల్లా బొపెడం జిల్లా పరిషత్‌ హైస్కూల్లో ఆరో తరగతి చదువుతున్న సీహెచ్‌.అభిమన్యూకు ఈ రోజు జగనన్న వసతి దీవెన పథకం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం జగన్‌ ఆశీనులైన వేదికపై మాట్లాడే అవకాశం లభించింది.

తనకు లభించిన అవకాశం పట్ల చిరంజీవి అభిమన్యూ ఎంత ఆనందించాడో అతని ప్రసంగంలో కనిపించింది. జగనన్న అమ్మ ఒడి, జగనన్న గోరుముద్దలు పథకాలు.. వాటి వల్ల తమకు ఎలాంటి ఉపయోగం కలుగుతుందీ.. అభిమన్యూ చెబుతుంటే.. సీఎం మోములో చిరునవ్వులు చిందాయి. సీఎం జగన్‌ పాలన, ఆయన వ్యక్తిత్వాని గురించి చిరంజీవి అభిమన్యూ చక్కగా వివరించాడు. మాట తప్పని.. మడమ తిప్పని మా దేవుడు జగనన్న అంటూ తన అభిమానాన్ని చాటుకున్నాడు.

ఆ చిన్నారి ప్రసంగానికి ముగ్ధుడైన సీఎం జగన్‌ ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. మాట్లాడే అవకాశంతోపాటు సీఎంను సృశించే ఛాన్స్‌ దక్కడంతో ఆ చిరంజీవి జగన్‌ పాదాలకు నమస్కరించి తమ కోసం, తమ విద్య కోసం పాటుపడుతున్న సీఎంకు కృతజ్ఞతలు తెలిపాడు. ఆ చిన్నారిని హత్తుకున్న సీఎం జగన్‌.. ముద్ధాడుతూ తన ఆశీస్సులు అందించారు. ఈ సన్నివేశం.. సభలో హైలెట్‌గా నిలిచింది.

Show comments