ఆన్ లైన్ గేమ్ కొంప ముంచిది.. రూ. 35 లక్షల గోల్డ్ చోరీ చేసి 10 క్లాస్ స్టూడెంట్

ఆన్ లైన్ గేమ్ కొంప ముంచిది.. రూ. 35 లక్షల గోల్డ్ చోరీ చేసి 10 క్లాస్ స్టూడెంట్

చదువుల పేరిట విద్యార్థులకు సెల్ ఫోన్స్ ఇచ్చేశారు పేరేంట్స్, హోం వర్క్ కూడా ఫోనులో ఇస్తుండటంతో చిన్న పిల్లలు సైతం విపరీతంగా ఫోన్లను వాడుతున్నారు. చదువుకుంటున్నారన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు పట్టించుకోకపోతే..

చదువుల పేరిట విద్యార్థులకు సెల్ ఫోన్స్ ఇచ్చేశారు పేరేంట్స్, హోం వర్క్ కూడా ఫోనులో ఇస్తుండటంతో చిన్న పిల్లలు సైతం విపరీతంగా ఫోన్లను వాడుతున్నారు. చదువుకుంటున్నారన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు పట్టించుకోకపోతే..

ఆన్ లైన్ గేమింగ్ మోజులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు కొంత మంది. ముఖ్యంగా స్కూల్ స్టూడెంట్స్, టీనేజ్ యువకులు ఈ గేమ్సింగ్‌కు వ్యసన పరులౌతున్నారు. ఇంట్లో తల్లిదండ్రులకు తెలియకుండా డబ్బులు కొట్టేయడం లేదంటే..ఫ్రెండ్స్, బయట అప్పులు చేసి మరీ ఈ గేమ్స్ ఆడుతున్నారు. ఆ అప్పులు ఇచ్చిన వాళ్లు.. డబ్బులు అడిగే సరికి తిరిగి కట్టలేక, పేరెంట్స్ తెలిస్తే తిడతారని, కొడతారని, తన పరువు పోతుందని, బంధువులు హేళన చేస్తారన్న భయంతో పారిపోవడం లేదంటే ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. తాజాగా ఓ స్కూల్ స్టూడెంట్..ఈ ఆన్ లైన్ గేమింగ్ బారిన పడి ఇంటికి కన్నం పెట్టాడు.

కర్ణాటకలోని ఆర్ఆర్ నగర్‌కు చెందిన పదో తరగతి విద్యార్థి ఆన్ లైన్ గేమింగ్‌కు బానిసయ్యాడు. చివరకు ఇంట్లో బంగారాన్ని కూడా కాచేశాడు. ఆభరణాలు కనిపించకపోవడంతో పోలీసు కంప్లయింట్ ఇవ్వగా.. ఇద్దరు పదోతరగతి  చదువుతున్న విద్యార్థులను పట్టుకున్నారు. అప్పుడు కానీ అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆన్ లైన్ గేమింగ్స్ బారిన పుత్ర రత్నం.. తిన్నింటి వాసాలు లెక్క పెట్టాడని. వందలు కాదు వేలు కాదు. ఏకంగా రూ.  35 లక్షల విలువైన బంగారు ఆభరణాలను చోరీ చేసి అమ్మేశాడు. అందులో బంగారు ఆభరణాలతో పాటు వజ్రభరణాలు కూడా ఉన్నాయి.  తన స్నేహితులతో కలిసి ఈ రాచకార్యం వెలగబెట్టినట్లు తెలియడంతో ఖంగుతిన్నాడు తండ్రి.

ఆన్లైన్ గేమింగ్, జల్సాలు అలవాడు పడ్డ కొడుకు.. మరో స్నేహితుడి సాయంతో తన ఇంటి నుండి బంగారు ఆభరణాలు చోరీ చేశాడు. కెంగేరిలో బంగారం దుకాణంలో పని చేసే వర్కర్ల సాయంతో ఆభరణాలను విక్రయించారు.  నగలు పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పదో తరగతి చదువుతున్న కొడుకుతో సహా మరొకర్ని పట్టుకున్నారు పోలీసులు.  చోరీకి గురైన 400 గ్రాముల బంగారాన్ని విక్రయించగా వాటిలో రూ.23 లక్షల విలువైన 300 గ్రాముల బంగారాన్ని రీకవరి చేశారు. డైమండ్ నెక్లెస్ ను ఇంకా స్వాధీనం చేసుకోలేదని పోలీసులు చెబుతున్నారు. ఆ ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు.  దీంతో సెల్ ఫోన్స్ వాడుతున్న పిల్లలు, అందులో ఏం చేస్తున్నారో చూడాలని పోలీసులు తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. లేకుంటే ఇలాంటి తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని పేర్కొంటున్నారు.

Show comments