చర్చిలో రంజాన్ ప్రార్థనలు

Kerala: చర్చిలో రంజాన్ ప్రార్థనలు

నేడు దేశ వ్యాప్తంగా రంజాన్ సంబరాలు అద్భుతంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా మత సామరస్యాన్ని చాటేలా కనుల పండుగగా కేరళలో ఓ ఘటన చోటు చేసుకుంది.అసలు ఎం జరిగిందో చూసేద్దాం.

నేడు దేశ వ్యాప్తంగా రంజాన్ సంబరాలు అద్భుతంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా మత సామరస్యాన్ని చాటేలా కనుల పండుగగా కేరళలో ఓ ఘటన చోటు చేసుకుంది.అసలు ఎం జరిగిందో చూసేద్దాం.

భారతదేశం అనేక మతాల కలయిక అని అందరికి తెలుసు. హిందూ ముస్లిం భాయి భాయి అంటూనే .. హిందూ ముస్లింల మధ్యన మత సంబంధమైన మారణహోమాలు జరిగేవి. దేశంలో ఈ సంఘటనలు ఎన్నో హింసలకు దారి తీసిన రోజులను కూడా ఇప్పటివరకు ఎన్నో చూశాము. అయితే అదంతా ఒకప్పుడు.. ఇప్పుడు కాలంతో పాటు సమాజంలో కూడా అనేక మార్పులు సంభవించుకుంటున్నాయి. నేడు రంజాన్ సంధర్బంగా దేశ వ్యాప్తంగా ముస్లిం సోదరులు సంబరాలు అద్భుతంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో భారతీయతకు వన్నె తెచ్చేలా.. మతసామరస్యాన్ని చాటి చెప్పేలా .. కేరళలో ఓ ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన మతం పేరుతో సమాజంలో జరిగే ఎన్నో చర్చలకు స్వస్తి పలికేలా సూచిస్తోంది. మత పరమైన ఘర్షణలు మనుషులని వేరు చేయలేవని.. సమాజాన్ని నాశనం చేయలేవని సందేశాన్ని ఈ ఘటన చాటి చెప్తుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.

దేశ వ్యాప్తంగా ముస్లింలు ఎంతో భక్తి శ్రద్దలతో.. ఈద్ వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంలో కేరళలోని మలప్పురం జిల్లాలో.. మంజేరి పట్టణంలో ఉన్న నికోలస్‌ మెమోరియల్‌ సీఎస్‌ఐ చర్చి ముందు.. ముస్లింల ప్రార్థనల కోసం చర్చి గేట్లను తెరిచి, ఆ చర్చి మైదానంలో ఈద్ ప్రార్ధనలు చేసుకోవడం కోసం.. ముస్లిం సోదరులను ఆహ్వానించారు. ఆ ప్రాంతంలో ప్రతి సంవత్సరం ముస్లింలు ఈద్ ప్రార్ధనలు అక్కడ ఉన్న ప్రభుత్వ పాఠశాల గ్రౌండ్ లో చేసుకునేవారు. కానీ, ఈసారి అక్కడ లోక్ సభ ఎన్నికల కారణంగా ఆ పాఠశాలను క్లోజ్ చేశారు. దీని కారణంగా చర్చి గేట్లు తెరిచి వారిని ఈద్ ప్రార్ధనలు చేసుకోడానికి ఆహ్వానించాలని చర్చి పెద్దలు నిర్ణయించారు. దీనితో ఆ ప్రాంతమంతా కూడా మత సామరస్యానికి ప్రతీకగా మారింది. ఈ క్రమంలో చర్చి ఫాదర్ ఫ్రాన్సిస్ జాయ్ మస్లామణి మాట్లాడుతూ.. పవిత్రమైన రోజున ముస్లిం సోదరుల ప్రార్థనలకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం దక్కినందుకు చాలా సంతోషంగా ఉందంటూ పేర్కొన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా మతపరమైన ఘర్షణలతో కూడిన సమయాల్లో.. ప్రేమ, ఐక్యత ప్రాముక్యత గురించి మరింత గొప్పగా చెప్పారు.

అలాగే, బుధవారం రోజున చర్చి ఆవరణలో.. రంజాన్ ప్రార్ధనలు చేసేందుకు ఎంతో మంది ముస్లిం సోదరులు.. విచ్చేసిన దృశ్యాలు అందరికి కనువిందు చేశాయి. ఈ సంధర్బంగా.. ఈద్ వేడుకల నిర్వహణ కమిటీ సభ్యుడు అలీ మాట్లాడుతూ.. “లౌకికవాద దేశంలో విభేదాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్న విభజన శక్తులకు ఇదో శక్తివంతమైన ప్రతిస్పందన” అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక సోషల్ మీడియాలో ఈ వార్త గురించి తెలిసిన నెటిజన్లు .. రకరకాల కామెంట్స్ తో వారికి శుభాకాంక్షలు తెలుపుతూ.. వారిని మెచ్చుకుంటూ.. వారిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల వచ్చిన కేరళ స్టోరీ సినిమా చూసిన వారు.. ఇది కదా అసలైన కేరళ స్టోరీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments