Man Cheated Youtube: యూట్యూబ్ నే మోసం చేశాడు.. 3.5 కోట్లు కొట్టేశాడు..!

యూట్యూబ్ నే మోసం చేశాడు.. 3.5 కోట్లు కొట్టేశాడు..!

Man Sentenced For Making Fake Live Stream: యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలాగో అందరికీ తెలుసు. కానీ, ఇతను మాత్రం యూట్యూబ్ ని బురిడీ కొట్టించి ఏకంగా.. 3 కోట్లు సంపాదించేశాడు.

Man Sentenced For Making Fake Live Stream: యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలాగో అందరికీ తెలుసు. కానీ, ఇతను మాత్రం యూట్యూబ్ ని బురిడీ కొట్టించి ఏకంగా.. 3 కోట్లు సంపాదించేశాడు.

ప్రస్తుతం డిజిటల్ క్రియేటర్స్, సోషల్ మీడియా ఇన్ ఫ్లుఎన్సర్స్ ఎక్కువైపోయారు. కొంతమంది కేవలం యూట్యూబ్ వంటి వాటిని కెరీర్ గా మలుచుకుని కళ్లు చెదిరే మొత్తాలు రాబడుతున్నారు. మీరు ఆకట్టుకునే విధంగా కంటెంట్ క్రియేట్ చేయగలిగితే చాలు మీరు లక్షలు సంపాదించవచ్చు. అందుకు యూట్యూబ్ ఎంతో ప్రోత్సాహకం అందిస్తూ ఉంటుంది. ఇప్పటికే ఎంతో మంది క్రియేటర్స్ మిలియన్స్ కొద్దీ సబ్ స్క్రైబర్స్ ని సొంతం చేసుకుని తమ టాలెంట్ ని ఈ ప్రపంచానికి పరిచయం చేశారు. అయితే ఒకడు మాత్రం తన టాలెంట్ చూపించి ఏకంగా యూట్యూబ్ నే బురిడీ కొట్టించేశాడు. ఏకంగా కోట్లలో సంపాదించుకున్నాడు.

ఈ ఘటన చైనాలో జరిగింది. అక్కడి సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం ఈ విషయం వెలుగు చూసింది. ఆ వ్యక్తి నేరుగా యూట్యూబ్ ని మోసం చేయలేదు. కానీ, తన సర్వీస్ తో విక్రయదారులను పొంది ఏకంగా కోట్లలో సంపాదించుకున్నాడు. అసలు విషయం ఏంటంటే.. చైనాలో వాంగ్ అనే వ్యక్తి ఏకంగా 4,600 మొబైల్ ఫోన్స్ కొనుగోలు చేశాడు. ఆ తర్వాత అన్నీ ఫోన్లని ఆపరేట్ చేసేందుకు ఒక సాఫ్ట్ వేర్ తీసుకున్నాడు. అలాగే కొన్ని వీపీఎన్ సర్వీసులను కూడా కొనుగోలు చేశాడు. దీనివల్ల వాంగ్ కేవలం ఒక్క క్లిక్ తో ఆ 4,600 ఫోన్లను ఆపరేట్ చేయగలడు. అలా అన్ని ఫోన్స్ తో యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్, ఫేక్ వ్యూవర్స్ ని సృష్టించేవాడు.

ఈ సర్వీస్ ద్వారా వాంగ్ తనకు నచ్చిన వీడియో లైవ్ స్ట్రీమింగ్ చూడటం, షేర్స్ చేయడం వంటివి చేసేవాడు. అలా కేవలం 4 నెలల వ్యవధిలో ఏకంగా రూ.3.4(4,15,000 డాలర్లు) కోట్లు సంపాదించుకున్నాడు. ఇతను ఈ సర్వీస్ ని యూట్యూబ్ ఛానల్స్ లో లైవ్ స్ట్రీమ్ చేసే వారికి అందించేవాడు. అలా చేయడం వల్ల వారికి లైవ్ స్ట్రీమింగ్ లో ఫేక్ బూస్టింగ్ లభిస్తుంది. అలా తాను డబ్బు సంపాదించడం ప్రారంభించాడు. అక్కడి ప్రభుత్వం చట్టాల ప్రకారం దీనిని ఒక స్కామ్ గానే పరిగణించారు. ఇది డైరెక్ట్ స్కామ్ కాకపోయినా.. ఆ ఫోన్స్ ద్వారా మరో కుంభకోణం చేసే అవకాశం ఉందంటూ తెలిపారు.

ఈ వాంగ్ అనే వ్యక్తికి ఏకంగా 15 నెలల జైలు శిక్ష విధించారు. అలాగే 7 వేల డాలర్ల జరిమానా కూడా వేశారు. నిజానికి వాంగ్ చేసిన ఆలోచనకు అంతా పిచ్చోళ్లైపోయారు. ఎందుకంటే ఇలాంటి ఒక సర్వీస్ ని స్టార్ట్ చేసి డబ్బు సంపాదిచవచ్చు అని అతను కనుగొనడాన్ని ప్రశంసిస్తున్నారు. ఈ ఫోన్లను వాడేందుకు వాంగ్ కు కేవలం రోజుకు ఒక డాలర్ కంటే తక్కువ ఖర్చు అవుతుందని చెప్పుకొచ్చాడు. అది కూడా ఆ ఫోన్ ఎంతసేపు ఆన్ లో ఉంటుంది అనే దాని మీదే ఆధారపడి ఉంటుందని చెప్పుకొచ్చాడు. మొత్తానికి యూట్యూబ్ ని కూడా బాగానే బురిడీ కొట్టించి.. కోట్లు అయితే సంపాదించాడు. కానీ, తప్పును ఎక్కువ రోజులు దాచలేరు కాబట్టి అతను జైలు పాలయ్యాడు.

Show comments