ఒక్క అమ్మాయి.. 5 మంది అబ్బాయిలతో కలిసి! కేరళ ఇలా తయారైంది ఏంటి?

ఒక్క అమ్మాయి.. 5 మంది అబ్బాయిలతో కలిసి! కేరళ ఇలా తయారైంది ఏంటి?

కేరళ అనగానే అక్కడి నేచర్, ఆ తర్వాత మలయాళ సినిమాలు గుర్తుకు వస్తాయి. అక్కడ నేచర్ అద్భుతంగా ఉంటుదన్న పేరు ఉంది. ఒక్కసారైనా ఆ రాష్ట్రాన్ని విజిట్ చేయాలనుకుంటారు. కానీ ఇది ఓ కోణం.

కేరళ అనగానే అక్కడి నేచర్, ఆ తర్వాత మలయాళ సినిమాలు గుర్తుకు వస్తాయి. అక్కడ నేచర్ అద్భుతంగా ఉంటుదన్న పేరు ఉంది. ఒక్కసారైనా ఆ రాష్ట్రాన్ని విజిట్ చేయాలనుకుంటారు. కానీ ఇది ఓ కోణం.

గాడ్స్ ఓన్ కంట్రీగా కేరళకు పేరు. కేరళ అనగానే కొబ్బరి తోటలకు ప్రసిద్ధి అని భావిస్తుంటారు. ఆ రాష్ట్రమంతా పచ్చగా, ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంటుంది. సమ్మర్ వచ్చిందంటే చాలా మంది కేరళను చుట్టి వచ్చేయాలను అనుకుంటారు. ఇక్కడ అక్షరాస్యత శాతం కూడా చాలా ఎక్కువ. ముస్లిం మైనార్టీలు కూడా ఎక్కువ. అలాగే హిందువులకు ఎంతో ప్రసిద్ధి గాంచిన దేవాలయాలు కూడా ఇక్కడే ఉన్నాయి. స్వాములు భక్తిగా మొక్కే అయ్యప్ప దేవాలయం కొలువైన శబరిమల ఇక్కడే ఉంది. అలాగే దేశంలోనే అత్యంత సంపద కలిగిన దేవాలయం పద్మనాభ స్వామి టెంపుల్ కూడా కేరళలో ఉంది. అలాగే పురాతన చర్చిలకు ఇక్కడ కొదవలేదు. కేరళ అనగానే మలయాళ సినిమాలతో పాటు ఓ పాజిటివ్ వైబ్స్ ప్రజల్లో ఉంది.

కేరళలో అమ్మాయిలు కూడా కత్తిలా ఉంటారని అనుకుంటూ ఉంటారు. రింగు రింగుల జుట్టుతో అందంగా కనిపిస్తుంటారు. కానీ ఇది ఒక కోణం.. మరో కోణం కూడా ఉంది. మామూలు కాదు మహా కిలాడీలు కూడా ఉన్నారు. ఇంతకు ఏం జరిగిందంటే.. ఇటీవల కేరళలో విశృంఖలంగా డ్రగ్స్ వినియోగం జరుగుతుంది. యువత మత్తు పదార్ధాల మత్తులో జోగుతున్నారు. డ్రగ్స్ నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా.. విక్రయాలు కొనసాగుతున్నాయి. తాజాగా కొచ్చి సమీపంలో కారుకపల్లిలో ఓ లాడ్జిలో ఆరుగురు వ్యక్తులు ఓ బృందంగా కలిసి డ్రగ్స్ విక్రయాలు చేస్తుండగా పోలీసులకు పట్టుబడ్దారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు వైట్ హౌస్ అనే లాడ్జిపై దాడి చేశారు. అక్కడ కొకైన్ ఇతర డ్రగ్స్ పెద్ద మొత్తంలో పట్టుకున్నారు. అయితే ఆరుగురు నిందితుల్ని పట్టుకున్నారు. ఇందులో ప్రధాన నిందితురాలిగా ఉంది ఓ మహిళ.

వరపుజాకు చెందిన మోడల్ అల్కా బెనోయ్.. ఆమె స్నేహితుడు ఎబిన్ లైజులు కలిసి ఈ చీకటి సామ్రాజ్యాన్ని నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. మోడలింగ్ ముసుగులో బెంగళూరు నుండి డ్రగ్స్ రవాణా చేస్తోంది అల్కా. మరో నలుగురితో కలిసి డ్రగ్ విక్రయిస్తోంది. ఆ నలుగుర్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆషిక్ అన్సారీ, రంజిత్, సూరజ్, మహమ్మద్ ఉన్నారు. ఆషిక్ అనే వ్యక్తి పేరుతో ఓ గదిని రిజిస్టర్ చేయించుకున్నారు. ఈ ఆరుగుర్ని అరెస్టు చేశారు. డ్రగ్స్‌తో పాటు వాటి అమ్మకాలకు సంబంధించి లెడ్జర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. కేరళలోనే ఇలా ఉంటే.. మిగిలిన ప్రాంతాల్లో ఈ డ్రగ్ దందా ఇంకా ఎంత సాగుతుందో అన్న అనుమానాలు మొదలవుతున్నాయి.

Show comments