సీసీటీవీ ఫుటేజ్: ప్రియురాలి కళ్ల ముందే ప్రియుడి హత్య

సీసీటీవీ ఫుటేజ్: ప్రియురాలి కళ్ల ముందే ప్రియుడి హత్య

ప్రేమ వ్యవహారం ఓ యువకుడి ప్రాణాలను తీసింది. నడిరోడ్డుపై ప్రియురాలు చూస్తుండగానే వేటకొడవళ్లతో నరికి చంపారు కొందరు దుండగులు. దీనికి సంబంధించిన విజువల్స్ నెట్టింటా వైరల్ గా మారాయి.

ప్రేమ వ్యవహారం ఓ యువకుడి ప్రాణాలను తీసింది. నడిరోడ్డుపై ప్రియురాలు చూస్తుండగానే వేటకొడవళ్లతో నరికి చంపారు కొందరు దుండగులు. దీనికి సంబంధించిన విజువల్స్ నెట్టింటా వైరల్ గా మారాయి.

ఇటీవల ప్రేమ వ్యవహారాలు ఘోరాలకు దారితీస్తున్నాయి. ప్రేమించిన యువతి దక్కదన్న అక్కసుతో ప్రియురాలిని చంపడానికైనా కూడా వెనకాడడం లేదు కొంతమంది వ్యక్తులు. దారుణాతి దారుణంగా దాడులకు పాల్పడుతూ ప్రాణాలు తీస్తున్నారు. మరికొంతమంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కర్ణాటకాలో తనను ప్రేమించడం లేదని ఓ యువతిని కత్తితో పొడిచి ప్రాణాలు తీసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమిళనాడులో ఘోరం చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారం ఓ యువకుడి ప్రాణాలను తీసింది. ప్రియురాలి కళ్ల ముందే ప్రియుడిని వేట కొడవళ్లతో నరికి చంపింది ఓ ముఠా. దీనికి సంబంధింని సీసీటీవీ ఫుటేజ్ నెట్టింటా వైరల్ గా మారింది.

తమిళనాడు రాష్ట్రంలో ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. ఒళ్లు గగుర్పొడిచేలా ఓ ముఠా ఓ యువకుడిపై దాడికి పాల్పడింది. రద్దీగా ఉండే రోడ్డు పక్కన కారులో వచ్చిన కొందరు దుండగులు అందరుచూస్తుండగానే యువకుడి ప్రాణాలు తీశారు. పట్టపగలే నడిరోడ్డుపై వేటకొడవల్లతో కర్కశంగా నరికి చంపారు. ప్రియురాలి ఎదుటనే ఈ దారుణానికి పాల్పడ్డారు. వేటకొడవల్లతో నరకగానే రక్తపు మడుగులో పడిపోయాడు ఆయువకుడు. ఆ తర్వాత అక్కడి నుంచి హత్యకు పాల్పడిన ముఠా వచ్చిన కారులోనే పరారైంది. మృతుడిని దీపక్ రాజ్ గా గుర్తించారు. అయితే ఆ యువకుడిని చంపడానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Show comments