chennai: భారీ వర్షాలు.. ఏకంగా 16.7 సెంమీ వర్షపాతం! సెలవు ప్రకటించిన ప్రభుత్వం

chennai: భారీ వర్షాలు.. ఏకంగా 16.7 సెంమీ వర్షపాతం! సెలవు ప్రకటించిన ప్రభుత్వం

చెన్నైలో గతేడాది భారీ వర్షాలు, వరదలతో నగరాన్ని అతలకుతలం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన మరువక ముందో మరోసారి తమిళనాడు రాష్ట్రంలో భారీ వర్షలు ప్రజలను వణికిస్తున్నాయి. తాజాగా ఈ భారీ వర్షలతో నగరం అస్తవ్యస్తమైంది.

చెన్నైలో గతేడాది భారీ వర్షాలు, వరదలతో నగరాన్ని అతలకుతలం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన మరువక ముందో మరోసారి తమిళనాడు రాష్ట్రంలో భారీ వర్షలు ప్రజలను వణికిస్తున్నాయి. తాజాగా ఈ భారీ వర్షలతో నగరం అస్తవ్యస్తమైంది.

చెన్నై నగరానికి ఏమైంది..? గతేడాది అకాల వర్షాల కారణంగా నగరం మొత్తం అతలకుతలం చేసిన విషయం తెలిసిందే. ఈ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. దీంతో ప్రజలు ఇంటి నుంచి బయటకి అడుగు పెట్టాడానికి కూడా భయపడ్డారు. అలాగే రహదారులన్నీ వరద నీటితో అస్తవ్యస్తమైంది. పలు ప్రాంతాల్లోని ఈ వరద నీరు ఇళ్లలో చేరడంతో ప్రజలు దిక్కుతోచని స్థితిలో సాయం కోసం రోడ్లెక్కారు. నగరంలో ఎటు చూసినా వరద నీరుతో తినడానికి తిండి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురైయ్యారు. అయితే ఇప్పుడిప్పుడే అంత కుదటపడుతందన్న తరుణంలో.. తాజాగా తమిళనాడులో మరోసారి భారీ వర్షాలు ముంచెత్తున్నాయి. ఆదివారం నుంచి నగరంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఇటీవలే తమిళనాడులో భారీ వర్షాలు వరదలతో నగరాన్నిముంచెత్తిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన మరువక ముందే మరోసారి చెన్నైలో ఆదివారం నుంచి ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. ఈ కుండపోత వరదలకు జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. తమిళనాడులో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసాయి. ఆదివారం ఉదయం 8.30 నుంచి సోమవారం ఉదయం 5.30 వరకు 16.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతవరణశాఖ అధికారులు తెలిపారు. అలాగే గడిచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైయ్యింది. అందులో కరైకల్ (12.2 సెం.మీ), పుదుచ్చేరి (9.6 సెం.మీ), కడలూరు (9.3 సెం.మీ.), ఎన్నూర్ (9.2 సెం.మీ.) వర్షపాతం నమోదైంది. ఇదిలా ఉంటే.. చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం జనవరి 7, 8న రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతో ప్రజలు అంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చారు శ్రీ. సూచించారు. ఇక లోతట్టు ప్రాంతాల వారిని సహాక సిబ్బంది ద్వారా పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేస్తామని తెలిపింది.

కాగా, రాష్ట్రంలో కడలూరు, విల్లుపురం, కోయంబత్తూరు, తంజవూరు, కాంచీపురం, దిండిగల్, విల్లుపురం, మైలాడుతురై, నాగపట్నం, వెల్లూరు, రాణిపేట్, తిరువణ్ణామలై, తిరువారూర్, కళ్లకురిచ్చి, చెంగల్‎పట్టు, కన్యాకుమారి తో సహా 18 జిల్లాల్లో భారీ వర్షాం కురిసింది. దీంతో నేడు కూడా తమిళనాడులో భారీ వర్షం కురిసే ఆవకాశం ఉందని వాతవరణ శాఖ హెచ్చరించడంతో ప్రభుత్వం సోమవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అలాగే యూనివర్సిటీ పరిధిలోని అన్ని కళాశాలకు సోమవారం సెలవు ప్రకటించారు. ఇక ఈరోజు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేశారు. త్వరలో రీషెడ్యూల్ తేదీని ప్రకటిస్తామని యూనివర్సిటీ వర్గాలు స్పష్టం చేశాయి.

అయితే బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడటంతో పాటు ఈశాన్య గాలులు తమిళనాడులో కురుస్తున్న వర్షాలకు కారణమని ఆర్ ఎంసిలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ పి. సెంతమరై కన్నన్ చెప్పారు. కాగా, ఇది మైచాంగ్ తుఫాన్ అంత తీవ్రంగా ఉండదని, తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. మరి, తమిళనాడులో మళ్లీ భారీగా కురుస్తున్న వర్షాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments