Chegondi Surya Prakash: CM జగన్ సమక్షంలో YSRCPలో చేరిన హరిరామ జోగయ్య కుమారుడు!

CM జగన్ సమక్షంలో YSRCPలో చేరిన హరిరామ జోగయ్య కుమారుడు!

Chegondi Surya Prakash: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పవన్ కల్యాణ్ కి మద్దతుగా నిలించిన చేగొండి కుటుంబ ఆయనకు గట్టి షాకిచ్చింది. చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు సూర్య ప్రకాష్ ఆ పార్టీకి రాజీనామా చేశారు.

Chegondi Surya Prakash: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పవన్ కల్యాణ్ కి మద్దతుగా నిలించిన చేగొండి కుటుంబ ఆయనకు గట్టి షాకిచ్చింది. చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు సూర్య ప్రకాష్ ఆ పార్టీకి రాజీనామా చేశారు.

ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాపు సంక్షేమ సంఘ అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ వైఎస్సార్ సీపీలో చేరారు. జనసేన పార్టీలో క్రీయాశీలక సభ్యునిగా జనసేన పొలిటికల్ ఎఫైర్స్ సభ్యుడిగా కీలకంగా వ్యవహరించిన సూర్యప్రకాష్, పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలిసి చేస్తున్న పొత్తు రాజకీయంతో విభేధించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఇప్పటికే సీట్ల విషయంలో జనసేన నేతలు చేస్తున్న ఒత్తిడి, ఇతర అసంతృప్తులతో పవన్ ఫ్రష్టెషన్ లో ఉన్నారు. ఇలాంటి సమయంలోనే సూర్య ప్రకాష్ వైఎస్సార్ సీపీలో చేరుతూ మరో షాకిచ్చారు.

మాజీ మంత్రి చేగొండి హరిమాజోగయ్య..జనసేన పార్టీ కోసం, పవన్ కల్యాణ్ కోసం అనేక బహిరంగ లేఖలు రాశారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో జనసేన ఎలా వ్యవహరించాలో పవన్ కల్యాణ్ కి సలహాలు కూడా ఇచ్చారు. ఇటీవల టీడీపీ, జనసేన కూటమి విడుదల చేసిన తొలిజాబితాపై కూడా ఆయన లేఖను వదిలారు. తాజాగా శుక్రవారం కూడా పవన్ కల్యాణ్ కే తన మద్దతు అంటూ చెప్పుకొచ్చారు. ఇలాంటి తరుణంలోనే ఆయన కుమారుడు వైఎస్సార్ సీపీలోకి చేరారు. 2018లో చేగొండి సూర్యప్రకాష్ జనసేన పార్టీలో చేరారు. అనంతరం పార్టీ అభివృద్ధి కోసం తన శక్తివంచన లేకుండా కృషి చేశారు. చివరికి పవన్ నుంచి కూడా పార్టీ బలోపేతానికి సరైన సహకారం లభించపోయినప్పటికి సూర్యప్రకాష్ ఆ పార్టీలోనే ఉన్నారు. అయితే ఇటీవల టీడీపీతో పవన్ కళ్యాణ్ 24 సీట్లు మాత్రమే తీసుకోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైనట్లు సమాచారం.

జనసేన మరీ..24 స్థానాల్లోనే పోటీ చేయడం మింగుడుపడని కాపునేతలు ఇప్పటికే ఆ పార్టీ నుండి దూరం జరుగుతూ వస్తున్నరు. కాపులు అంతా ఐక్యతగా ఉండి రాజ్యాధికారం సాధించుకోవాలని చెబుతూ లేఖలు రాసే  హరిరామ జోగయ్య  సైతం పొత్తు, సీట్ల పంపకాలు, పవర్ షేరింగ్ విషయంలో పవన్ కళ్యాణ్ కి ఎంతో చెప్పి చూసినా ఆయన వాటిని పాటించకలేదు.  పైగా జెండా సభ వేదికపై నుంచి తనకు ఎవరు సలహాలు ఇవ్వొద్దని జోగయ్య, ముద్రగడ లాంటి సీనియర్ కాపు నాయకులనే పరోక్షంగా హెచ్చరించడం ఆ సామాజిక వర్గానికి నచ్చలేదు. ఈ నేపధ్యంలోనే జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ కూడా జనసేనాకు  గుడ్ బై చెప్పారు. అంతేకాక సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. పవన్ కల్యాణ్ కి ఎంతో మద్దతుగా నిలిచిన హరిరామ జోగయ్య కుటుంబం నుంచి గట్టి షాక్ తగిలిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయా పడుతున్నారు.

Show comments