Chandrayaan-3: ఇస్రో రిపోర్ట్‌లో కీలక విషయాలు.. చంద్రయాన్-3 సక్సెస్ కి ఆ 4 సెకన్ల ఆలస్యం కారణం!

Chandrayaan-3: ఇస్రో రిపోర్ట్‌లో కీలక విషయాలు.. చంద్రయాన్-3 సక్సెస్ కి ఆ 4 సెకన్ల ఆలస్యం కారణం!

చంద్రయాన్ 3.. ఈ పేరు చెప్పగానే ప్రతి  భారతీయుడి ఒళ్లు పులకరిస్తుంది.  అందుకు  కారణంగా ప్రపంచంలోని  ఏ దేశానికి సాధ్యం కానీ ఘనతను ఈ ప్రయోగం ద్వారా భారత్ సాధించింది. తాజాగా ఈ ప్రయోగం గురించి ఇస్రో కీలక విషయాలను వెల్లడించింది.

చంద్రయాన్ 3.. ఈ పేరు చెప్పగానే ప్రతి  భారతీయుడి ఒళ్లు పులకరిస్తుంది.  అందుకు  కారణంగా ప్రపంచంలోని  ఏ దేశానికి సాధ్యం కానీ ఘనతను ఈ ప్రయోగం ద్వారా భారత్ సాధించింది. తాజాగా ఈ ప్రయోగం గురించి ఇస్రో కీలక విషయాలను వెల్లడించింది.

భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) గురించి ఎంత చెప్పిన తక్కువ. అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా ఎన్నో అద్భుతమైన ప్రయోగాలు చేసి.. భారత ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా పెంచింది. అగ్రదేశాలకు కూడా సాధ్యం కానీ ఎన్నో  ప్రయోగాలను ఇస్రో చేసి..విజయం సాధించింది. అలానే చంద్రయాన్ 3 ప్రయోగం ద్వారా అంతరిక్ష చరిత్రలోనే భారత్ పేరును సువర్ణ అక్షరాలతో లిఖించేలా చేసింది. ఏ దేశానికి సాధ్యం కానిది..చంద్రుని సౌత్ పోల్ పై చంద్రయాన్ 3 అడుగు పెట్టింది. అయితే ఈ చంద్రయాన్ సక్సెస్ పై ఇస్రో రిపోర్టను విడుదల చేసింది. అందులో కీలక అంశాలను ప్రస్తావించింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

చంద్రయాన్ 3.. ఈ పేరు చెప్పగానే ప్రతి  భారతీయుడి ఒళ్లు పులకరిస్తుంది.  అందుకు  కారణంగా ప్రపంచంలోని  ఏ దేశానికి సాధ్యం కానీ ఘనతను ఈ ప్రయోగం ద్వారా భారత్ సాధించింది. ఈ ప్రయోగ సక్సెస్ కావడంతో చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. అలాగే అమెరికా, రష్యా, చైనాల తర్వాత జాబిల్లిని ముద్దాడిన నాలుగో దేశంగా ఇండియా నిలిచింది.

చంద్రుడిపైనే అత్యంత కఠినమైన పరిస్థితులు ఉండే దక్షిణ ధృవంపై చంద్రయాన్ 3 ద్వారా  విక్రమ్ ల్యాండర్‌ను ల్యాండ్ అయ్యింది. అలా చంద్రయాన్ 3  ద్వారా ఇస్రో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది. గతేడాది జూలై 14న చంద్రయాన్3 ప్రయోగం చేపట్టగా.. 40పైగా సుదీర్ఘ ప్రయాణం తరువాత చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయింది. ఈ క్రమంలోనే తాజాగా చంద్రయాన్ 3 ప్రయోగానికి సంబంధించి సరికొత్త విషయం బయటికి వచ్చింది. చంద్రయాన్ 3 ప్రయోగాన్ని 4 సెకన్లు ఆలస్యంగా ల్యాండ్ చేయడం వల్ల కూలిపోయే ప్రమాదం నుంచి బయటపడేసినట్లు ఇస్రో వెల్లడించింది.

తాజాగా ఇస్రో ఓ రిపోర్టును విడుల చేసింది. అందులో కీలక అంశాలను ప్రస్తావించింది. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్-3 లోని విక్రమ్ ల్యాండర్‌ను చంద్రుడి ఉపరితలంపై దించడం వల్ల చంద్రయాన్ 3 ప్రయోగాన్ని రక్షించుకోగలిగామని ఇస్రో తెలిపింది. విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ కావడానికి కొన్ని క్షణాల ముందు.. ఆ ప్రాంతంలో ఉన్న అంతరిక్ష వ్యర్థాల కారణంగా ప్రయోగం విఫలమయ్యే ప్రమాదం ఉందని,  ల్యాండర్‌లో ఉన్న పరికరాలు గుర్తించి ఇస్రోకు పంపినట్లు పేర్కొంది. ల్యాండర్‌లోని  కీలకమైన మొదటి ఆర్బిటల్ ప్రాంతం.. ఆ అంతరిక్ష వ్యర్థాలను తాకి పేలిపోయే ప్రమాదం ఉండేదని ఇస్రో తెలిపింది.

వెంటనే ల్యాండింగ్ సమయాని కంటే 4 సెకన్లు ఆలస్యంగా విక్రమ్ ల్యాండర్‌ను చంద్రుడిపై ల్యాండ్ చేసినట్లు తెలిపింది. మొత్తంగా ఆ  4 సెకన్లు ఆలస్యంగా చేయడమే చంద్రయాన్-3 నుంచి కాపాడినట్లు స్పేస్ సిట్యూయోషనల్ అసెస్ మెంట్ నివేదిక పేర్కొంది. ఉపగ్రహాలను రక్షించడానికి.. అంతరిక్ష వ్యర్థాలను ప్రమాదాలను నివారించేందుకు 23 రకాల ప్రయోగాలను నిర్వహించినట్లు ఇస్రో తన తాజా నివేదికలో తెలిపింది. మరి.. చంద్రయాన్ 3 గురించి తాజాగా ఇస్రో వెల్లడించిన కీలక అంశాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments