No Ticket To Vangaveeti Radha: వంగవీటి రాధాకు మొండి చెయ్యి.. మరీ ఇంత అవమానామా?

Vangaveeti Radha: వంగవీటి రాధాకు మొండి చెయ్యి.. మరీ ఇంత అవమానామా?

టీడీపీ-జనసేన టికెట్ల కేటాయింపు వ్యవహారంలో వంగవీటి రాధాకు దారుణ అవమానం జరిగింది. దీనిపై ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు..

టీడీపీ-జనసేన టికెట్ల కేటాయింపు వ్యవహారంలో వంగవీటి రాధాకు దారుణ అవమానం జరిగింది. దీనిపై ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు..

టీడీపీ జనసేన టికెట్ల కేటాయింపుతో రెండు పార్టీల మధ్య ఉన్న అసంతృప్తులు బయటపడ్డాయి. ఇన్నాళ్లు పార్టీని నమ్ముకుని.. సేవలు చేసిన తమను కాదని.. పక్క పార్టీ వాళ్లు సీట్లు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. కష్టకాలంలో ఉన్నా సరే పార్టీని వదలకుండా రాత్రింబవళ్లు కష్టపడ్డ తమను కాదని.. జనసేన నాయకులకు ఎలా టికెట్లు కేటాయిస్తారని టీడీపీ కేడర్‌ ప్రశ్నిస్తోంది. అనేక చోట్ల తెలుగుదేశం నేతలు రాజీనామాలకు రెడీ అవుతున్నారు. ఇన్నాళ్లూ తమను వాడుకుని టికెట్ల అంశానికి వచ్చే సరికి మొండి చేయి చూపుతారా అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డ తమను కాదని.. ఏమాత్రం బలం లేని జనసేనకు టికెట్లు ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తమను కాదని జనసేన నేతలకు టికెట్లు ఇచ్చారు కదా.. వారు ఎలా గెలుస్తారో చూస్తామంటున్నారు. ఇక టికెట్లు రాని వారిలో వంగవీటి రాధా కూడా ఉన్నారు.

నమ్మించి, వాడుకుని.. ఆ తర్వాత వారిని కూరలో కరివేపాకులా తీసి పక్కకు పడేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. తాజాగా ప్రకటించిన సీట్ల వివరాలు చూస్తే ఈ విషయం మరోసారి తేటతెల్లమవుతోంది. బాబు ఇలా నమ్మించి.. ఆఖరి నిమిషయంలో హ్యాండ్‌ ఇచ్చిన వారిలో వంగవీటి రాధా కూడా ఉన్నారు. విజయవాడ సెంట్రల్‌ టికెట్‌పై ఆశలు పెట్టుకున్న వంగవీటి రాధాకు చంద్రబాబు ముఖం చాటేశారు. ఇటీవల లోకేష్‌ పాదయాత్రలో రాధా ఇమేజ్‌ను వాడుకున్న చంద్రబాబు.. తాజాగా సీట్ల కేటాయింపు విషయానికి వచ్చే సరికి ఆయనకు చెయ్యిచ్చారు.

ఇక చంద్రబాబు వ్యవహారశైలి పట్ల రాధా వర్గం రగిలిపోతోంది. కనీసం విజయవాడ తూర్పులో అయినా తమకు అవకాశం ఇస్తారని భావిస్తే.. అక్కడ కూడా వారికి నిరాశే ఎదురయ్యింది. దీంతో రాధాకు టీడీపీలో శాశ్వతంగా తలుపులు మూసేసినట్టే అన్న విషయం స్పష్టంగా అర్థం అవుతోంది. విజయవాడలో మంచి పట్టు ఉన్న వంగవీటి కుటుంబాన్ని చంద్రబాబు తన అవసరాల మేరకు వాడుకుని.. ఆ తర్వాత కూరలో కరివేపాకులా తీసిపడేశారని ఆయన అనుచరులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

విజయవాడ తూర్పులో అంబశెట్టి వాసు, బత్తిన రాములు జనసేన తరఫున టికెట్‌ ఆశించారు. ఇక తాజాగా వెల్లడించిన టికెట్ల ప్రకటన వారి ఆశలపై కూడా నీళ్లు చల్లింది. మరో సారి చంద్రబాబు కాపులను మోసం చేశారని వారు మండిపడుతున్నారు. చంద్రబాబు, పవన్‌లకు ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు.

Show comments