అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి ముహూర్తం ఖరారు

అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి ముహూర్తం ఖరారు

  • Published - 09:11 AM, Sat - 11 January 20
అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి ముహూర్తం ఖరారు

అందరు ఊహించినట్టు ఈ నెల 20 న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కాబోతుంది. ఈ సమావేశంలో రాజధాని తరలింపు, అధికార వికేంధ్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి పై ప్రభుత్వానికి జియన్ రావు, బోస్టన్ కమిటీలు ఇచ్చిన నివేదికలతో పాటు గతంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామ కృష్ణ కమిటీ నివేదిక పై కూడా అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశం ఉంది.

ఈ సమావేశంలోనే రాష్ట్రంలో అభివృద్ధి వికేంధ్రీకరణతో పాటు కార్యానిర్వాహక రాజధాని, శాసన నిర్వాహక రాజధాని, న్యాయ పరిపాలనా రాజధాని వంటి అంశాలపై కూలంకుషంగా చర్చించే అవకాశం వుంది. దీనికి సంభందించి 18 వ తేదీనే అసెంబ్లీ ని సమావేశపరచాలని తొలుత భావించినప్పటికీ జియన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ లను సమగ్రంగా అధ్యయనం చెయ్యడానికి రాష్ర ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ ఇప్పటికే రెండు సార్లు సమావేశమై ఈ రెండు నివేదికలపై చర్చించగా, మూడవ భేటీ ఈనెల 13 న జరగనుంది. ఈ 13 న జరిగే భేటీతో హైపర్ కమిటీ అన్ని అంశాలపై ఒక అవగాహనకి వచ్చిన తరువాత మరుసటి రోజు కానీ ఆ తరువాత రోజు కానీ స్థూలంగా ఒక సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందించే అవకాశం ఉంది.

హైపర్ కమిటీ తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన తరువాత 18 వ తేదీ జరుగునున్నకేబినెట్ సమావేశంలో ఈ నివేదిక పై చర్చించిన తరువాత 20 న ప్రత్యేకంగా అసెంబ్లీ ఉభయ సభల సమావేశం ఏర్పాటు చేసి హైపర్ కమిటీ తుది నివేదికని రాష్ట్రప్రభుత్వం అసెంబ్లీలో చర్చకి పెట్టనున్నట్టుగా తెలుస్తుంది. దింతో 20 వ తేదీ 3 రాజధానుల అంశంపై ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వెలువడే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఆ సందర్భంలోనే అమరావతి రాజధాని రైతుల ఆందోళనకు ముగింపు పలికేలా ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

Show comments