AP Govt-YSR Pension Kanuka Rs 3000: AP ప్రజలకు సీఎం జగన్ గుడ్ న్యూస్... నేటి నుంచి వారందరికి నెలకు రూ.3 వేలు

AP ప్రజలకు సీఎం జగన్ గుడ్ న్యూస్… నేటి నుంచి వారందరికి నెలకు రూ.3 వేలు

2019 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా ఓ గుడ్ న్యూస్ చెప్పారు. ఆ వివరాలు..

2019 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా ఓ గుడ్ న్యూస్ చెప్పారు. ఆ వివరాలు..

రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ఆలోచిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 2019 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ.. అర్హులైన లబ్ధిదారులందరికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నారు. అప్పుడే పుట్టిన చిన్నారులు మొదలు.. వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చేలా ఏదో ఒక సంక్షేమ పథకాన్ని తీసుకువచ్చారు సీఎం జగన్. అలానే ప్రభుత్వ పథకాలన్ని లబ్ధిదారులకు నేరుగా అందేలా.. గ్రామ, వార్దు సచివాలయ వ్యవస్థలను తీసుకువచ్చి.. ప్రభుత్వ సేవలన్నింటిని ప్రజల గడప వద్దకే చేర్చారు. ఈ  క్రమంలో తాజాగా 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో హమీని నిలబెట్టుకోనున్నారు సీఎం జగన్. నేటి నుంచే ఆ హామీ అమల్లోకి రానుంది. ఆ వివరాలు..

2024 కొత్త సంవత్సరంలోకి ప్రవేశించాము. సరికొత్త ఆశలతో ఏడాది సాగిపోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఇక న్యూ ఇయర్ సందర్భంగా ఏపీ ప్రజలకు సీఎం జగన్ గుడ్‌న్యూస్ చెప్పారు. వైఎస్సార్ పెన్షన్ కానుకను రూ.3 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 2019 ఎన్నికల వేళ ఇచ్చిన హామీ ప్రకారం ఏటా పింఛన్‌ను  పెంచుకుంటూ పోతూ రూ.3 వేలు చేస్తామని హామీ ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి.. నేడు దాన్ని నిలబెట్టుకున్నారు.

పెన్షన్ పెంపు సందర్భంగా..  నేటి నుంచి జనవరి 8 వ తేదీ వరకు 8 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పండగ వాతావరణంలో పెన్షన్ల పెంపు ఉత్సవాలు నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ ఉత్సవాల్లో ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పాల్గొనాలని సీఎం జగన్ సూచించారు. కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్స్‌లో ఈనెల 3 వ తేదీన జరగనున్న కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం జగన్.. పెంచిన పెన్షన్లను లబ్ధిదారులకు అందజేయనున్నారు.

ఈ సందర్భంగా కొత్తగా అర్హులైన వారికి పెన్షన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. వైఎస్సార్ పెన్షన్ కానుక కింద కొత్తగా 1,17,161 మంది పెన్షన్లు అందుకోనున్నారు. పెన్షన్ పెంపుపై వైసీపీ నేతలు స్పందిస్తూ.. దేశంలోనే అత్యధికంగా 66.34 లక్షల మందికి నెలకు రూ.3 వేల చొప్పున పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని గర్వంగా చెప్పుకుంటున్నారు.

2019 వరకు వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ పెన్షన్ కేవలం రూ.1000 మాత్రమే ఉండేది. ఈ క్రమంలో నాడు పాదయాత్రలో భాగంగా జగన్.. తాము అధికారంలోకి వస్తే విడతల వారిగా పెన్షన్లను పెంచుతూ రూ.3 వేలు చేస్తామని హామీ ఇచ్చారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ హామీని నిలబెట్టుకున్నారు సీఎం జగన్. 1000 రూపాయలుగా ఉన్నపెన్షన్ మొత్తాన్ని ఒకేసారి రూ.2250 కి పెంచారు. ఆ తర్వాత ఏటా రూ.250 పెంచుకుంటూ ఇప్పుడు చివరిగా.. రూ.3,000 అందిస్తున్నారు. 66.34 లక్షల పెన్షన్లకు ఏటా జగన్ మోహన్ రెడ్డి సర్కార్ రూ.23,556 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇక ఈ ఐదేళ్లలో వైసీపీ పెన్షన్ల కోసం రూ. 83,526 కోట్లకు పైనే ఖర్చు చేసింది.

Show comments