రష్మిక ఫేక్ వీడియోపై కీర్తి సురేష్ షాకింగ్ కామెంట్స్! భయమేస్తోందంటూ..!

రష్మిక ఫేక్ వీడియోపై కీర్తి సురేష్ షాకింగ్ కామెంట్స్! భయమేస్తోందంటూ..!

  • Author Soma Sekhar Published - 04:11 PM, Thu - 9 November 23

రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియోపై రియాక్ట్ అయ్యింది నటి కీర్తి సురేష్. ఈ ఘటనపై తీవ్ర అసహనం వ్యక్తం చేయడమే కాకుండా భయమేస్తోంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియోపై రియాక్ట్ అయ్యింది నటి కీర్తి సురేష్. ఈ ఘటనపై తీవ్ర అసహనం వ్యక్తం చేయడమే కాకుండా భయమేస్తోంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

  • Author Soma Sekhar Published - 04:11 PM, Thu - 9 November 23

స్టార్ హీరోయిన్ రష్మిక డీప్ ఫేక్ వీడియో దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ వీడియోపై ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులతో పాటుగా ఇతర రంగాలకు చెందిన ముఖ్యులు కూడా తీవ్రంగా స్పందించారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని, భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు జరకుండా నిబంధనలు తీసుకురావాలని వారు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో పాటుగా మా అధ్యక్షుడు మంచు విష్ణు, విజయ్ దేవరకొండతో పాటుగా మరికొందరు ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిచారు. తాజాగా ఈ సంఘటనపై భయంతో పాటుగా అసహనం వ్యక్తం చేశారు నటి కీర్తి సురేష్. సోషల్ మీడియా వేదికగా కీర్తి స్పందించింది.

రష్మిక మందన్నాకు సంబంధించిన ఓ మార్ఫింగ్ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు సినీ ప్రముఖులు. ఇక ఈ ఘటనపై తాజాగా స్పందించారు హీరోయిన్ కీర్తి సురేష్. ఇలాంటి చెత్త వీడియోలను సృష్టించే బదులుగా ఆ సమయాన్ని ఏదైనా మంచి పని చేసేందుకు వినియోగించాలని సూచించారు కీర్తి. “రష్మిక డీప్ ఫేక్ వీడియో చూస్తుంటే నాకు భయమేస్తోంది. భవిష్యత్ లో ఇంకా ఎన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో అని ఆందోళనగా ఉంది. ఇక ఈ ఆధునిక టెక్నాలజీ మనకు వరమో.. శాపమో అర్ధం కావడంలేదు. మంచిని పంచడం కోసం టెక్నాలజీని ఉపయోగిద్దాం. కానీ ఇలాంటి చెత్తను పంచుకోవడం కోసం కాదు” అంటూ సోషల్ మీడియా వేదికగా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు కీర్తి సురేష్.

కాగా.. ఇలాంటి చెత్త వీడియోలు క్రియేట్ చేసే సమయంలో జనాలకు ఉపయోగపడే మంచి పనుల కోసం వినియోగించాల్సిందిగా కోరారు కీర్తి. ఇక ఈ డీప్ ఫేక్ వీడియో ఘటనను కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఇలాంటి సంఘటనలు భవిష్యత్ లో పునరావృతం కాకుండా కొన్ని నిబంధనలను జారీ చేసింది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలను, ఫొటోలను 36 గంటల్లోగా అన్ని సైట్ల నుంచి తొలగించాలని సంబంధిత శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ సైబర్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేయాలని సూచించింది.

Show comments