Jyothi Rai: గ్లామర్ షో ఇందుకోసమా..! 'గుప్పెడంత మనసు' జగతి కొత్త పోస్ట్ వైరల్!

గ్లామర్ షో ఇందుకోసమా..! ‘గుప్పెడంత మనసు’ జగతి కొత్త పోస్ట్ వైరల్!

  • Author ajaykrishna Published - 01:27 PM, Tue - 26 September 23
  • Author ajaykrishna Published - 01:27 PM, Tue - 26 September 23
గ్లామర్ షో ఇందుకోసమా..! ‘గుప్పెడంత మనసు’ జగతి కొత్త పోస్ట్ వైరల్!

ఈ మధ్యకాలంలో సీరియల్ ఆర్టిస్టులు కూడా గ్లామర్ విషయంలో హద్దులు చెరిపేస్తున్నారు. ఓవైపు సీరియల్స్ లో నటిస్తూనే.. మరోవైపు సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆల్రెడీ సోషల్ మీడియాలో ఎలాంటి రచ్చ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటిది సినిమాలలో అవకాశాలు వస్తే.. ఊరుకుంటారా.. ఖచ్చితంగా సీన్ డిమాండ్ బట్టి గ్లామర్ షో చేసేందుకు సిద్ధం అవుతున్నారు. అంతెందుకు టీవీ యాంకర్స్ విషయానికి వస్తే.. ఏ రేంజ్ లో అందాల ప్రదర్శన జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. మరి ఆల్రెడీ ఎప్పటినుండో సినిమా అవకాశాల కోసం వెయిట్ చేస్తున్న బ్యూటీలకు అవకాశం వస్తే.. అంతే ఇక.

ప్రస్తుతం సీరియల్స్ లో తల్లిగా నటిస్తూ.. సినిమాలలో గ్లామరస్ హీరోయిన్ గా నటిస్తోంది నటి జ్యోతి రాయ్. ఇది ఆమె అసలు పేరు. జ్యోతి రాయ్ అంటే గుర్తు పట్టకపోవచ్చు. కానీ.. గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి క్యారెక్టర్ పోషించిన బ్యూటీ అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఆ రేంజ్ లో జగతి క్యారెక్టర్ తో పాపులర్ అయ్యింది జ్యోతి. అయితే.. సీరియల్ లో రిషి తల్లిగా నటిస్తున్న ఈ భామ.. పర్సనల్ లైఫ్ లో ఎంత గ్లామర్ ని మెయింటైన్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఓసారి ఆమె సోషల్ మీడియాలో పెట్టే ఫోటోలు, వీడియోలు చూస్తే తెలుస్తుంది. అసలు ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ ని బీట్ చేసే విధంగా జ్యోతి గ్లామర్ తో మతులు పోగొడుతోంది.

తాజాగా జ్యోతి కొత్త పోస్ట్ పెట్టి సర్ప్రైజ్ చేసింది. అసలు ఇన్నాళ్లు ఆమె ఎందుకు డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్స్ తో అందాల షో చేస్తుందో అర్ధం కాకపోయి ఉండొచ్చు. కానీ.. లేటెస్ట్ పోస్ట్ తో ఆమె గ్లామర్ షో వెనుక అసలు రీసన్ ఏంటనేది చెప్పకనే చెప్పేసింది. జ్యోతి లీడ్ రోల్ లో ‘ప్రెట్టి గర్ల్’ అనే మూవీ చేస్తోంది. ఆ సినిమా నుండి తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ లో.. జ్యోతి గ్లామర్ లుక్ చూసి అందరి మతులు పోతున్నాయని ఫ్యాన్స్ అంటున్నారు. అంటే.. ఇన్నిరోజులు కొంచం కొంచంగా గ్లామర్ షో చేసింది.. ఈ సినిమా కోసమేనా అని ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం జ్యోతి రాయ్ పిక్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే.. జ్యోతి ఆ మధ్య చెప్తానన్న గుడ్ న్యూస్ ఇదేనేమో అని భావిస్తున్నారు నెటిజన్స్. మరి జ్యోతి అలియాస్ గుప్పెడంత మనసు జగతి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Show comments