Gokulpuri Metro Station Collapsed: కుప్పకూలిన మెట్రో స్టేషన్ వాల్.. ఒకరు మృతి

కుప్పకూలిన మెట్రో స్టేషన్ వాల్.. ఒకరు మృతి

Gokulpuri Metro Station Collapsed: ఈ మద్య కాలంలో మెట్రో స్టేషన్ లో ఎన్నో రకాల ప్రమాదాలు జరుగుతున్నాయి.. అలాంటి ఘటనే ఢిల్లీలో చోటు చేసుకుంది

Gokulpuri Metro Station Collapsed: ఈ మద్య కాలంలో మెట్రో స్టేషన్ లో ఎన్నో రకాల ప్రమాదాలు జరుగుతున్నాయి.. అలాంటి ఘటనే ఢిల్లీలో చోటు చేసుకుంది

మనిషికి ప్రమాదాలు ఎలా ముంచుకు వస్తాయో ఎవరికీ అర్థం కాదు. అందుకే పెద్దలు వాన రాకడ.. ప్రాణం పోకడ ఎవరూ చెప్పలేరని. హార్ట్ ఎటాక్, రోడ్డు ప్రమాదాలు, విద్యుత్ షాక్, అగ్ని ప్రమాదాలు, నీటిలో పడి చనిపోవడం ఇలా ఎన్నో రకాల ప్రమాదాలు మృత్యురూపంలో మనిషిని కబలిస్తాయి.  అప్పటి వరకు మన కళ్ల ముందు ఉన్నవారు.. ఒకేసారి కంటికి కానరాని లోకాలకు వెళ్తుంటారు. ఇటీవల దేశంలో పలు రైల్వే స్టేషన్ లో అనుకోని ప్రమాదాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదృష్టం కొద్ది కొంతమంది ప్రాణాలతో ఉంటే.. మరికొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి ఘటనే ఢిల్లీ మెట్రో స్టేషన్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే..

దేశ రాజధాని ఢిల్లీలో విషాదం చోటు చేసుకుంది. గురువారం ఢిల్లీ-గోకులపురి మెట్రో స్టేషన్ లో ఫ్లాట్ ఫామ్ సైడ్ వాల్ హఠాత్తుగా కుప్పకూలిపోయింది. ఆ సమయంలో మెట్రో స్టేషన్ కింద నుంచి నడుచుకుంటూ వెళ్తున్న కొంతమందిపై పెచ్చులు ఊడి పడి పలువురికి గాయాలయ్యాయి.  వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అందులో ఓ వ్యక్తి చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ స్లాబ్ శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసుకువచ్చిన పోలీసులు దగ్గరలోని హాస్పిటల్ కి తరలించారు. స్లాబ్ కూలుతున్న సమయంలో ప్రమాదాన్ని గమనించి కొంతమంది పాదాచారులు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గోకల్ పూరి మెట్రో స్టేషన్ లో జరిగిన ప్రమాదం గురించి పోలీసులు మాట్లాడుతూ.. ‘గురువారం 11 గంటల ప్రాంతంలో గోకల్ పూరి మెట్రో సరిహద్దు గోడ హఠాత్తుగా కూలిపోయి దిగువ రహదారిపై పడిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకునే వారిని రక్షించాం.. వారిలో కొంతమందికి స్వల్ప గాయాలు కావడంతో దగ్గరలోని హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించాం. క్షతగాత్రులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతం జేసీబీ, క్రేన్ సహాయంతో శిథిలాలను తొలగిస్తున్నాం’ అని తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Show comments