ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఆ టీమిండియా క్రికెటర్‌లో మార్పు రాలేదు: యువీ

ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఆ టీమిండియా క్రికెటర్‌లో మార్పు రాలేదు: యువీ

Yuvraj Singh, Rohit Sharma, T20 World Cup 2024: కొంతమంది కాస్త నేమ్‌ అండ్‌ ఫేమ్‌ వస్తే చాలు.. బలుపుతో వ్యవహరిస్తారు. కానీ, ఓ క్రికెటర్‌ ఎంత ఎదిగినా.. ఒదిగే ఉన్నాడంటూ యువరాజ్‌ సింగ్‌ పేర్కొన్నాడు. మరి ఆ క్రికెటర్‌ ఎవరో చూద్దాం..

Yuvraj Singh, Rohit Sharma, T20 World Cup 2024: కొంతమంది కాస్త నేమ్‌ అండ్‌ ఫేమ్‌ వస్తే చాలు.. బలుపుతో వ్యవహరిస్తారు. కానీ, ఓ క్రికెటర్‌ ఎంత ఎదిగినా.. ఒదిగే ఉన్నాడంటూ యువరాజ్‌ సింగ్‌ పేర్కొన్నాడు. మరి ఆ క్రికెటర్‌ ఎవరో చూద్దాం..

టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌.. తాజాగా టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ క్రికెటర్‌ ఎంత ఎదిగినా కూడా అంతనిలో కొంచెం కూడా మార్పురాలేదని, అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలానే, అంతే ఒదిగి ఉన్నాడంటూ పేర్కొన్నాడు. ఇంతకీ యువరాజ్‌ సింగ్‌ ఎవరి గురించి చెప్పాడనుకుంటున్నారు.. ఇంకెవరు మన హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ గురించి. రోహిత్ శర్మ జీవితంలో ఎంతో సాధించినా.. వ్యక్తిగా మారలేదు, అదే రోహిత్ శర్మలోని గొప్పతనం. సరదాగా ఉంటాడు, అందర్ని ప్రేమిస్తాడు, ఎప్పుడూ కుర్రాళ్లతో సరదాగా ఉంటాడు. అతను గొప్ప నాయకుడు అలాగే క్రికెటర్లలో నాకు మంచి మిత్రుడు అంటూ యువీ తెలిపాడు.

కాగా, రోహిత్‌ శర్మ తన కెరీర్‌లో ఎన్నో ఎత్తు పల్లాలు చూశాడు. 2007లోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చినా.. చాలా కాలం టీమ్‌లోకి వస్తూ పోతూ ఉండేవాడు. అద్భుతమైన టాలెంటెడ్‌ ఆటగాడిగా పేరున్నా.. టీమ్‌లో మాత్రం ఎప్పుడూ స్థిరంగా ఉండలేదు. కొన్ని సార్లు రోహిత్‌ శర్మకు సరైన అవకాశాలు కూడా రాలేదు. 2011 వన్డే వరల్డ్‌ కప్‌ టీమ్‌లో చోటు దక్కపోవడంతో రోహిత్‌ తీవ్ర మానసిక వేదనను అనుభవించాడు. ఆ సమయంలో రోహిత్‌ శర్మతో మాట్లాడి అతన్ని నార్మల్‌ చేసింది యువరాజ్‌ సింగే. అలాంటి క్లిష్టసమయంలో యువీ అందించిన ఎమోషనల్‌ సపోర్ట్‌ను రోహిత్‌ శర్మ పలు సందర్భాల్లో గుర్తు చేసుకున్నాడు. అయితే.. రోహిత్‌ అక్కడితో ఆగిపోలేదు.

ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి.. టీమిండియాలో కీ ప్లేయర్‌గా మారిపోయాడు. లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ నుంచి ఓపెనర్‌గా మారిన తర్వాత రోహిత్‌ శర్మ దశ తిరిగిపోయిందనే చెప్పాలి. విరాట్‌ కోహ్లీ తర్వాత టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టి.. ప్రస్తుతం తన సారథ్యంలో టీమిండియా రెండో టీ20 వరల్డ్‌ కప్‌లో నడిపించనున్నాడు. ప్రస్తుతం రోహిత్‌ శర్మ ఫోకస్‌ మొత్తం టీ20 వరల్డ్‌ కప్‌ పైనే ఉంది. ఎలాగైనా ఈ సారి కప్పు సాధించాలనే కసితో ఉన్నాడు హిట్‌మ్యాన్‌. ఈ నేపథ్యంలో యువరాజ్‌ సింగ్‌ రోహిత్‌ శర్మ గురించి చేసిన ఈ పాజిటివ్‌ కామెంట్స్‌ అతనికి మరింత బూస్ట్‌ ఇస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి రోహిత్‌ గురించి యువీ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ​

Show comments