YS Jagan: వైసీపీ MLCకి సీఎం జగన్ ప్రమోషన్.. ఏకంగా సహాయ మంత్రి హోదా!

వైసీపీ MLCకి సీఎం జగన్ ప్రమోషన్.. ఏకంగా సహాయ మంత్రి హోదా!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో తనదైన మార్క్ చూపించారు. అదే విధంగా పార్టీ వ్యవహారాల్లో సైతం ప్రత్యేకంగా ఉంటారు. ముఖ్యంగా తనను నమ్మకున్న వారిని ఎప్పటికి జగన్ మర్చిపోరనే టాక్. అదే తాజాగా రుజువైంది.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో తనదైన మార్క్ చూపించారు. అదే విధంగా పార్టీ వ్యవహారాల్లో సైతం ప్రత్యేకంగా ఉంటారు. ముఖ్యంగా తనను నమ్మకున్న వారిని ఎప్పటికి జగన్ మర్చిపోరనే టాక్. అదే తాజాగా రుజువైంది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారు. అంతేకాక విద్యా, వైద్యంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ఇక ఇటు రాష్ట్ర పరిపాలనలో, అటు పార్టీ వ్యవహారాల్లో తనదైన మార్క్ ను చూపిస్తారు. అంతేకాక వైసీపీ నేతలకు కీలక పదవులు ఇచ్చి వారిని గౌరవిస్తారు. ఇప్పటికే ఎంతో మందికి వివిధ పదవులు ఇచ్చి సీఎం జగన్ గౌరవించారు. ఎమ్మెల్సీలుగా, మంత్రులు, రాజ్యసభ్యులుగా కూడా పలువురని సీఎం జగన్ చేశారు. అందుకే సీఎం జగన్ అంటే నేతలకు చాలా అభిమానం గౌరవం. ఇటీవలే నామినేట్, ఇతర పదవుల్లో 50 శాతం బీసీలకు ఇచ్చి గౌరవించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ వైసీపీ ఎమ్మెల్సీకి సీఎం జగన్ ప్రమోషన్ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి విప్‌ పాలవలస విక్రాంత్‌కు సీఎం జగన్ ప్రమోషన్ అచ్చారు. పాలవలస విక్రాంత్ కు ప్రభుత్వం సహాయ మంత్రి హోదా కల్పించారు. ఈ మేరకు ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి రేవు ముత్యాలరాజు ఉత్తర్వులు జారీ చేశారు. విప్‌ పర్యటనలో ఆయా జిల్లాల అధికారులు ప్రొటోకాల్‌ పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒక నెల క్రితమే ఆయనను విప్‌గా ఏపీ ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా  విక్రాంత్ సీఎం జగన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

తనను మొదట ఎమ్మెల్సీగా గుర్తించి, ఆ తరువాత శాసన మండలి ప్రభుత్వ విప్ హోదా కల్పించిన సీఎం జగన్ కి ధన్యవాదాలు. ఇప్పుడు సహాయ మంత్రిగా అవకాశం కల్పించినందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి విక్రాంత్ కృతజ్ఞతలు తెలిపారు. 2024లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో పాలకొండ, రాజాం, పాతపట్నం అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించి జగన్‌మోహన్‌రెడ్డికి బహుమతిగా ఇవ్వడమే  తన లక్ష్యమన్నారు. విక్రాంత్‌కు  పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతితో పాటు వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు అభినందనలు తెలిపారు.

ఇక విక్రాంత్ కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. ఆయన తండ్రి పాలవలస రాజశేఖరం ఉణుకూరు అసెంబ్లీకి ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా ,  శ్రీకాకుళం జిల్లా జెడ్పీ ఛైర్మన్‌ గా పని చేశారు. అంతేకాక వారి కుటుంబం నుంచి రెడ్డి శాంతి పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. తల్లి ఇందుమతి రేగిడి జెడ్పీటీసీగా.. భార్య గౌరీ పార్వతి పాలకొండ జెడ్పీటీసీగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో పాలకొండ, పాతపట్నం, రాజాం అసెంబ్లీ నియోజకవర్గాలను వైఎస్సార్‌సీపీ గెలిచింది. 2019 ఎన్నికల్లో కూడా ఈ మూడు నియోజకవర్గాల్లో విజయం సాధించింది. ఈ నియోజకవర్గాల్లో పార్టీ గెలుపు కోసం విక్రాంత్ పనిచేవారు. ఈ నేపథ్యంలోనే విక్రంతా సేవలను గుర్తించి ఎమ్మెల్సీగా, ఇప్పుడు సహయ మంత్రి హోదాను కల్పించారు. మరి..ఎమ్మెల్సీకి సీఎం జగన్ ప్రమోషన్ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments