YS Jagan Memantha Siddham Yatra Day 18-Pithapuram: పవన్‌ కళ్యాణ్‌కు భారీ షాక్‌.. నేడు పిఠాపురంలో అడుగుపెట్టనున్న CM జగన్‌

CM Jagan: పవన్‌ కళ్యాణ్‌కు భారీ షాక్‌.. నేడు పిఠాపురంలో అడుగుపెట్టనున్న CM జగన్‌

సీఎం జగన్‌ మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేడు పిఠాపురంలోకి ఎంట్రీ ఇవ్వనుంది. 18 వరోజు బస్సు యాత్ర షెడ్యూల్‌ ఇలా సాగనుంది.

సీఎం జగన్‌ మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేడు పిఠాపురంలోకి ఎంట్రీ ఇవ్వనుంది. 18 వరోజు బస్సు యాత్ర షెడ్యూల్‌ ఇలా సాగనుంది.

ఎన్ని అడ్డంకులు వచ్చినా.. విపక్షాలు రాళ్లు రువ్వినా చెక్కు చెదరని సంకల్పం.. చెరగని చిరునవ్వుతో ముందుకు సాగడమే తెలుసు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి. ప్రజలకు సంక్షేమ పాలన అందించడమే ఆయన ఏకైక ధ్యేయం. అందుకు ఎవరు అడ్డుపడినా.. ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. జగన్‌ మాత్రం ఆగిపోరు. ఎన్నికల ప్రచారంలోనూ ఇదే జోరు చూపిస్తున్నారు సీఎం జగన్‌. రాళ్లతో ఆయన పై దాడి చేశారు. ఇది ముమ్మాటికే హత్యా ప్రయత్నమే అని అధికారులు తేల్చి చెప్పారు. కానీ ఇలాంటి బెదిరింపులు జగన్‌ను ఏం చేయలేవు అని నిరూపిస్తూ మేమంతా సిద్ధం బస్సు యాత్రను కొనసాగిస్తున్నారు సీఎం జగన్‌. దాడి జరగిన తర్వాత వైద్యుల సూచన మేరకు కేవలం ఒక్క రోజు మాత్రమే బస్సు యాత్రకు విరామం ఇచ్చారు. మరుసటి రోజు నుంచి ముందుకు సాగుతున్నారు. నేడు సీఎం జగన్‌ బస్సు యాత్ర.. పిఠాపురం నియోజకవర్గంలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ మేరకు షెడ్యూలు ఖరారయ్యింది.

సీఎం జగన్‌ మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. నేడు అనగా.. ఏప్రిల్‌ 19, శుక్రవారం నాడు పిఠాపురంలోకి ఎంట్రీ ఇవ్వనుండంలో సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. కారణం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌.. పిఠాపురం నుంచి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జగన్‌ యాత్ర పిఠాపురంలోకి ప్రవేశించడం రాజకీయ వర్గాల్లోనే కాక.. సామాన్యుల్లో కూడా ఆసక్తి పెంచుతోంది. పిఠాపురం దద్దరిల్లేలా సీఎం జగన్‌ ఎంట్రీ ఉండనుంది అంటున్నాయి వైసీపీ శ్రేణులు. ఈ బస్సు యాత్రలో భాగంగా నేడు అనగా శుక్రవారం ఉదయం 9 గంటలకు సీఎం జగన్‌.. రాత్రి బస చేసిన ఎస్టీ రాజపురం నుంచి బయలుదేరుతారు.

ఆ తర్వాత రంగంపేట, పెద్దాపురం బైపాస్‌, సామర్లకోట బైపాస్‌ మీదుగా ఉందూరు క్రాస్‌ చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం ఉందూరు క్రాస్‌, కాకినాడ మీదుగా మధ్యాహ్నం మూడున్నర గంటలకు అచ్చంపేట జంక్షన్‌ వద్ద నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత పిఠాపురంలోకి ప్రవేశించి.. అక్కడ బైపాస్‌ వద్ద జనాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు సీఎం జగన్‌. ఆ తర్వాత గొడిచర్ల క్రాస్‌ వద్దకు చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు.

ఇక 17వ రోజు సీఎం జగన్‌ బస్సు యాత్రకు భారీ ఎత్తున జనాలు తరలి వచ్చారు. గోదారి జనసంద్రం అయ్యింది. రోడ్డుకు ఇరువైపులా మానవహారాలు నిర్వహించారు. వేమగిరిలో ఎడ్లబండ్లపై భారీగా రైతులు తరలి వచ్చారు. బొమ్మూరులో 108 గుమ్మడి కాయలతో మహిళలకు జగన్‌కు దిష్టి తీశారు. నుదుటి గాయం బాధిస్తున్నా సరే.. తనకు చూడటానికి తరలి వచ్చిన జనాలను చెరగని చిరునవ్వుతో పలకరిస్తూ.. ముందుకు సాగారు సీఎం జగన్‌. ఇక నేడు యాత్ర పిఠాపురంలోకి ప్రవేశిస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.

Show comments