RCBకి గట్టి ఎదురుదెబ్బ.. CSKతో మ్యాచ్‌లో ఓటమి తప్పదా?

RCBకి గట్టి ఎదురుదెబ్బ.. CSKతో మ్యాచ్‌లో ఓటమి తప్పదా?

Will Jacks, RCB, IPL 2024: ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే.. రానున్న మ్యాచ్‌లో సీఎస్‌కే కచ్చితంగా గెలిచితీరాలి ఆర్సీబీ. కానీ, ఈ మ్యాచ్‌కి ముందు ఆ టీమ్‌కు గట్టి షాక్‌ తగిలింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Will Jacks, RCB, IPL 2024: ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే.. రానున్న మ్యాచ్‌లో సీఎస్‌కే కచ్చితంగా గెలిచితీరాలి ఆర్సీబీ. కానీ, ఈ మ్యాచ్‌కి ముందు ఆ టీమ్‌కు గట్టి షాక్‌ తగిలింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్‌ 2024 సీజన్‌ గత సీజన్ల కంటే చాలా భిన్నంగా మరింత రసవత్తరంగా సాగుతోంది. మ్యాచ్‌ ముగింపు దశకు వచ్చినా.. ఇంకా ప్లే ఆఫ్స్‌కు వెళ్లే టీమ్స్‌ ఏవో ఒక క్లారిటీ రాలేదు. ఒక్క టీమ్‌ మాత్రమే ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అవ్వగా.. మిగిలిన మూడు బెర్తుల కోసం.. ఏకంగా ఏడు టీమ్స్‌ పోటీ పడుతున్నాయి. ఏడు టీమ్స్‌లో కూడా ఓ రెండు టీమ్స్‌కు కాస్త ఎక్కువ అవకాశం ఉంది. కానీ, ఒక్క స్థానం కోసం ఏకంగా ఐదు టీమ్స్‌ పోటీ పడే సరిస్థితి. ఆ ఐదు టీమ్స్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఒకటి. ప్రస్తుతం 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది ఆర్సీబీ.

ఈ నెల 18వ తేదీన చెన్నై సూపర్‌ కింగ్స్‌తో బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో జరిగే మ్యాచ్‌తో ఆర్సీబీ భవితవ్యం తేలనుంది. ఆ మ్యాచ్‌లో సీఎస్‌కేను భారీ తేడాతో ఓడిస్తే.. ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు వెళ్లే ఛాన్స్‌ ఉంది. కానీ, ప్రస్తుతం ఆర్సీబీకి తగిలిన గట్టి షాక్‌తో.. సీఎస్‌కేతో మ్యాచ్‌లో ఓటమి తప్పలేలా లేదు. ఎందుకంటే.. ఆర్సీబీలో కీలక ఆటగాడైన విల్‌ జాక్స్‌.. జట్టును వీడి స్వదేశానికి పయనం అయ్యాడు. టీ20 వరల్డ్‌ కప్‌ 2024 కోసం ఇంగ్లండ్‌ ఆటగాళ్లు ఐపీఎల్‌ నుంచి ముందుగానే వెళ్లిపోతున్నారు. విల్‌ జాక్స్‌ సైతం ఇంగ్లండ్‌ టీ20 వరల్డ్‌ కప్‌ స్క్వాడ్‌లో ఉండటంతో అతను కూడా ఇంగ్లండ్‌కు తిరిగి వెళ్లిపోయాడు.

ప్రస్తుతం చాలా మంచి ఫామ్‌లో ఉన్న జాక్స్‌.. సీఎస్‌కేతో కీలకమైన మ్యాచ్‌కి ముందు టీమ్‌కు దూరం కావడంతో.. ఆర్సీబీకి ఓటమి తప్పదని క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. విల్‌ జాక్స్‌ ఒక్కడిపైనే ఆర్సీబీ ఆధారపడింది, అతను లేకపోతే ఆర్సీబీ గెలవలేదని కాదు కానీ.. 8 మ్యాచ్‌ల్లో 7 ఓటముల తర్వాత ఆర్సీబీ వరుసగా 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో గెలిస్తే ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశం ఉంది. కానీ, ఈ ఐదు మ్యాచ్‌ల్లో టీమ్‌ బాగా సెట్‌ అయింది. ఇప్పుడు విల్‌ జాక్స్‌ లేకపోవడంతో అతని ప్లేస్‌లో మరో ప్లేయర్‌ను తీసుకోవాలి. పైగా టీమ్‌లో ఉన్న ఫారెన్‌ ప్లేయర్లు ఎవరూ అంత మంచి ఫామ్‌లో లేరు. దీంతో.. టీమ్‌ బ్యాలెన్స్‌ దెబ్బతినే అవకాశం ఉందని క్రికెట్‌ ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. జాక్స్‌ లేకపోయినా.. కోహ్లీ ఆర్సీబీని గెలిపిస్తాడని మరికొంత మంది క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments