ప్రాణాలు తీస్తున్న చికెన్ షవర్మా! మీరు ఇంకా తింటున్నారా? చాలా డేంజర్!

ప్రాణాలు తీస్తున్న చికెన్ షవర్మా! మీరు ఇంకా తింటున్నారా? చాలా డేంజర్!

ఈ మధ్యకాలంలో చికెన్ షవర్మా తిని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఘటనలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. అయితే రోడ్ల మీద ఎక్కడబడితే అక్కడ ఈ చికెన్ షవర్మా సెంటర్లు దర్శనం ఇవ్వడమే కాకుండా.. నాణ్యత లేని ఫుడ్ ను కస్టమర్లకు విక్రయించి వారి ప్రాణలతో ఆడుకుంటున్నారు. తాజాగా ఈ చికెన్ షవర్మా తిని ఓ యువకుడు మరణించగా..మరో ఐదుగురికి ఫుడ్ పాయిజన్ అయింది. ఇంతకి ఎక్కడంటే

ఈ మధ్యకాలంలో చికెన్ షవర్మా తిని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఘటనలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. అయితే రోడ్ల మీద ఎక్కడబడితే అక్కడ ఈ చికెన్ షవర్మా సెంటర్లు దర్శనం ఇవ్వడమే కాకుండా.. నాణ్యత లేని ఫుడ్ ను కస్టమర్లకు విక్రయించి వారి ప్రాణలతో ఆడుకుంటున్నారు. తాజాగా ఈ చికెన్ షవర్మా తిని ఓ యువకుడు మరణించగా..మరో ఐదుగురికి ఫుడ్ పాయిజన్ అయింది. ఇంతకి ఎక్కడంటే

ఈ మధ్యకాలంలో చికెన్ షవర్మా తిని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఘటనలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. అయితే రోడ్ల మీద ఎక్కడబడితే అక్కడ ఈ చికెన్ షవర్మా సెంటర్లు దర్శనం ఇవ్వడమే కాకుండా.. నాణ్యత లేని ఫుడ్ ను కస్టమర్లకు విక్రయించి వారి ప్రాణలతో ఆడుకుంటున్నారు. ముఖ్యంగా ఈ చికెన్ షావర్మా తిని మరణించిన వారిలో ఎక్కువ శాతం 20 సంవత్సరాల లోపు వయసున్న వారే ఉన్నారు. కాగా, ఇటీవలే కాలంలో ముంబైలోని కొంతమంది ఈ చికెన్ షవర్మా తిని అస్వస్థకు గురై ఆసుపత్రిపాలయిన ఘటన మరువక ముందే తాజాగా మరొ యువకుడు ఈ చికెన్ షవర్మా తిని మృతి చెందిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ప్రస్తుతం ఇప్పుడు బయట ఉండే పాస్ట్ ఫుడ్ సెంటర్ లలో ఆహారాన్ని అసలు నమ్మే విధంగా ఉండటం లేదు. ఎందుకంటే.. ఎక్కడ చూసిన కుల్లిపోయిన, పురుగుల పట్టిన పదార్థలను విక్రయిస్తూ.. అమయాకపు ప్రజల ప్రాణాలతో చెలగటమాడుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఎక్కువగా ఏనోట విన్నా..ఏ చోట చూసిన వినిపిస్తున్న పేరు చికెన్ షవర్మా. దీనిని తిని చాలామంది ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ మధ్యనే ఈ చికెన్ షవర్మా తిని మరణించడం, అలాగే తీవ్ర అస్వస్థకు గురై ఆసుపత్రి పాలవ్వటం వంటి ఘటన మరువక ముందే తాజాగా ఇప్పుడు మరో యువకుడు ఈ చికెన్ షవర్మా తిని మృతి చెందిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. కాగా, పాడైపోయిన చికెన్ తో తయారు చేసిన షవర్మా తినడం వలన 19 ఏళ్ల ప్రతిమేశ్ భోక్సే అనే యువకుడు మృతి చెందాడు. అంతేకాకుండా.. ఇదే షవర్మా తిన్న మరో ఐదుగురు కూడా ఫుడ్ పాయిజన్ కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందతున్నారు. అయితే ఈ సంచలన ఘటన మే3వ తేదీన ముంబైలో చోటు చేసుకుంది. కాగా, ఆ రోజున ప్రతిమేశ్ తన స్నేహితులతో కలిసి ఓ షాపులో షవర్మా తిన్నాడు. ఆ తర్వాత తీవ్ర కడుపు నొప్పితో వాంతులు చేసుకున్నాడు. అయితే మరుసటి రోజు కూడా ఆ వాంతులు ఆగకపోవడంతో అతని తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు.

ఇక అక్కడే చికిత్స పొందతూ ప్రతిమేశ్ మృతి చెందాడు. అయితే ఈ ఘటనపై ప్రతిమేశ్ భోక్సే కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో షవర్మా షాపు నడుపుతున్న ఆనంద్ కాంబ్లే, మహ్మద్ అహ్మద్ రెజా షేక్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాకుండా.. షావర్మా శాంపిల్ ను ల్యాబ్ కు పంపారు.ఇదిలా ఉంటే..గత నెల ఏప్రిల్ లో గోరేగావ్ లోని ఈ చికెన్ షావర్మా తిన్న 12 మంది ఫుడ్ పాయిజన్‌తో ఆసుపత్రి పాలయ్యారు. ఇక అంతకముందు కేరళలో కూడా ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. దీంతో ఇప్పటికే స్ట్రీట్ ఫుడ్ తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, వీలైనంత వరకు మంచి హోటల్స్ నాణ్యత గత ఫుడ్ కాదో అవునో సరిచూసుకొని తినలని వైద్యులు చెబుతున్నారు. అలాగే సాధ్యమైనంత వరకు బయట ఫుడ్ లకు దూరంగా ఉంటే మేలు అని హెచ్చరిస్తున్నారు. అయితే ఈ షవర్మా తిని మరణించడం, అస్వస్థకు గురయ్యే ఘటనలు ఎక్కువగా ముంబైలో చోటు చేసుకోవడం గమన్హారం. మరి, చికెన్ షవర్మా తిని యువకుడు మరణించిన ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments