IPL 2024: పంజాబ్-రాజస్తాన్ మ్యాచ్.. ఫామ్ లో ఉన్న.. బట్లర్, ధావన్, అశ్విన్ ఎందుకు ఆడట్లేదు?

IPL 2024: పంజాబ్-రాజస్తాన్ మ్యాచ్.. ఫామ్ లో ఉన్న.. బట్లర్, ధావన్, అశ్విన్ ఎందుకు ఆడట్లేదు?

సూపర్ ఫామ్ లో ఉన్న సెంచరీ హీరో జోస్ బట్లర్, పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్, రాజస్తాన్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ ఎందుకు ఈ మ్యాచ్ లో ఆడట్లేదు? అని ప్రేక్షకులు బుర్రలు బద్దలుకొట్టుకుంటున్నారు.

సూపర్ ఫామ్ లో ఉన్న సెంచరీ హీరో జోస్ బట్లర్, పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్, రాజస్తాన్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ ఎందుకు ఈ మ్యాచ్ లో ఆడట్లేదు? అని ప్రేక్షకులు బుర్రలు బద్దలుకొట్టుకుంటున్నారు.

ఐపీఎల్ 2024లో భాగంగా తాగాజా పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు రాజస్తాన్ కెప్టెన్ సంజూ శాంసన్. అయితే ఈ మ్యాచ్ లో ప్రేక్షకులు ఊహించని విషయాలు చోటుచేసుకున్నాయి. సూపర్ ఫామ్ లో ఉన్న సెంచరీ హీరో జోస్ బట్లర్, పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్, రాజస్తాన్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ ఎందుకు ఈ మ్యాచ్ లో ఆడట్లేదు? అని ప్రేక్షకులు బుర్రలు బద్దలుకొట్టుకుంటున్నారు.

పంజాబ్ వర్సెస్ రాజస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ రెండు జట్లు అనూహ్య నిర్ణయాలు తీసుకున్నాయి. అవేంటంటే? పంజాబ్ తమ కెప్టెన శిఖర్ ధావన్ ను ఈ మ్యాచ్ లోకి తీసుకోలేదు. అతడి ప్లేస్ లో అథర్వ తైడేను తుది జట్టులోకి తీసుకుంది. అయితే ఈ సీజన్ లో సూపర్ ఫామ్ లో ఉన్న ధావన్ ఎందుకు ఈ మ్యాచ్ ఆడటం లేదో సరైన కారణం లేదు. గబ్బర్ ఆడకపోవడంతో.. స్టార్ ఆల్ రౌండర్ సామ్ కర్రన్ కెప్టెన్ గా పగ్గాలు చేపట్టాడు. ఇక రాజస్తాన్ టీమ్ లో సైతం రెండు భారీ మార్పులే జరిగాయి. సెంచరీ హీరో జోస్ బట్లర్, రవిచంద్రన్ అశ్విన్ లు ఈ మ్యాచ్ ఆడట్లేదు. బట్లర్ 100 శాతం ఫిట్ గా లేకపోవడంతో ఆడట్లేదని తెలుస్తుంది.

ఇక అశ్విన్ సాధారణ కారణంతో తుదిజట్టులో లేడు. ఎలాంటి గాయాలు కాకుండానే ఈ ముగ్గురు ఈ మ్యాచ్ ఆడకపోడంతో.. అభిమానులకు సందేహం కలుగుతోంది. పైగా వీరు ఈ సీజన్ లో బాగానే రాణిస్తున్నారు. వీరి ప్లేస్ లో రోవ్ మన్ పావెల్, తనుష్ కోటియన్ టీమ్ లోకి వచ్చారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్తాన్ టీమ్ పంజాబ్ కు ఆదిలోనే భారీ షాకిచ్చింది. అద్బుతమైన బౌలింగ్ లో పంజాబ్ ను కష్టాల్లోకి నెట్టేసింది. 10 ఓవర్లకు 4 వికెట్లు తీసి 52 రన్స్ మాత్రమే ఇచ్చింది. ఆర్ఆర్ బౌలర్లలో కేశవ్ మహరాజ్ 2 వికెట్లు తీశాడు. మరి సూపర్ ఫామ్ లో ఉన్న ముగ్గురు ప్లేయర్లు ఈ మ్యాచ్ ఆడకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments