Virat Kohli Is Not God Said Navjot Singh Sidhu: కోహ్లీ దేవుడేం కాదు.. టీమిండియా మాజీ క్రికెటర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Virat Kohli: కోహ్లీ దేవుడేం కాదు.. టీమిండియా మాజీ క్రికెటర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ఓ టీమిండియా మాజీ క్రికెటర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అతడేమీ దేవుడు కాదన్నాడు. ఇంకా ఏమేం అన్నాడంటే..

స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ఓ టీమిండియా మాజీ క్రికెటర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అతడేమీ దేవుడు కాదన్నాడు. ఇంకా ఏమేం అన్నాడంటే..

స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సూపర్బ్ టచ్​లో కనిపిస్తున్నాడు. కొడుకు పుట్టడంతో ఆ మధ్య కొంత గ్యాప్ తీసుకున్న కింగ్.. మళ్లీ ఐపీఎల్-2024తో కాంపిటీటివ్ క్రికెట్​ ఆడటం స్టార్ట్ చేశాడు. ఈసారి క్యాష్ రిచ్ లీగ్​లో అతడి బ్యాట్ ఓ రేంజ్​లో గర్జిస్తోంది. మ్యాచ్​ మ్యాచ్​కు మరింత పదునెక్కి పరుగుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటిదాకా ఆడిన 10 మ్యాచుల్లో 147 స్ట్రయిక్ రేట్​తో 500 పరుగులు చేశాడు విరాట్. 4 హాఫ్ సెంచరీలు బాదిన కింగ్.. ఓ సెంచరీ కూడా కొట్టాడు. దీన్ని బట్టే అతడి ఫామ్​ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆర్సీబీ గెలుపోటములతో సంబంధం లేకుండా కోహ్లీ బ్యాటింగ్​ను చూసేందుకు వేలాది మంది ప్రేక్షకులు స్టేడియాలకు పోటెత్తుతున్నారు. అయితే ఇంత బాగా ఆడుతున్నా అతడిపై విమర్శలు మాత్రం తగ్గడం లేదు.

ఐపీఎల్​లో కోహ్లీ యావరేజ్ 71గా ఉంది. సగటు విషయంలో అతడ్ని వంక పెట్టడానికి లేదు. కానీ స్ట్రయిక్ రేటే ఆందోళన కలిగిస్తోంది. ఓపెనర్​గా వస్తున్న విరాట్ ఆఖరి వరకు క్రీజులో ఉంటున్నా, భారీ స్కోర్ చేస్తున్నా, స్ట్రయిక్ రేట్​ను మాత్రం మెరుగుపర్చుకోవడం లేదు. యాంకర్ ఇన్నింగ్స్ ఆడుతూ స్లో అయిపోతున్నాడు. దీంతో అతడిపై విమర్శలు వస్తున్నాయి. చాలా నెమ్మదిగా ఆడుతున్నాడని, ఇలా ఆడితే టీ20 వరల్డ్ కప్​లో కష్టమేనని, స్పిన్నర్లను ఎదుర్కోవడంలోనూ ఇబ్బందులు పడుతున్నాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ నవ్​జ్యోత్ సింగ్ సిద్ధు రియాక్ట్ అయ్యాడు. కోహ్లీ ఏమీ దేవుడు కాదని.. అతడూ మనలాగే సామాన్య మానవుడేనని అన్నాడు. కింగ్​కు అతడు సపోర్ట్​గా నిలిచాడు.

‘విరాట్ కోహ్లీని చాలా మంది ప్రేక్షకులు దేవుడిలా కొలుస్తారు. కింగ్ ప్రతిదీ చేయగలడని, అతడికి సాధ్యం కానిది ఏదీ లేదని, ఏదైనా సరే పర్ఫెక్ట్​గా చేయడం అతడి వల్ల అవుతుందని అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే కోహ్లీ కూడా మనలాగే ఓ మామూలు మనిషి. కానీ అతడో అసాధారణ బ్యాట్స్​మన్. అతడి బ్యాట్ నుంచి 80 సెంచరీలు వచ్చాయి. స్పిన్నర్ల బౌలింగ్​లో అతడి మాదిరిగా పరుగులు చేయడం ఎవరి వల్లా కాదు. స్పిన్నర్లను అతడు బాదినట్లుగా రన్ ఛేజ్ టైమ్​లో ఎవరైనా ఆడగలరా? కాబట్టి అతడి విషయంలో అంత కఠినంగా వ్యవహరించడం సరికాదు’ అని సిద్ధు స్పష్టం చేశాడు. ఇక, నిన్న గుజరాత్ టైటాన్స్​తో మ్యాచ్​లో విరాట్ 44 బంతుల్లో 70 పరుగులు చేశాడు. ఇందులో పేసర్ల బౌలింగ్​లో 10 బంతుల్లో 9 పరుగులు చేసిన కోహ్లీ.. స్పిన్​లో 34 బంతుల్లో 61 రన్స్ చేశాడు.

Show comments