Vijaykanth:ప్రభుత్వ లాంఛనాలతోనే విజయకాంత్‌ అంత్యక్రియలు: CM స్టాలిన్‌

Vijaykanth:ప్రభుత్వ లాంఛనాలతోనే విజయకాంత్‌ అంత్యక్రియలు: CM స్టాలిన్‌

తమిళ కథనాయకుడు డీఎండీకే అధినేత విజయ్ కాంత్ ఈరోజు ఉదయం కోవిడ్ కారణంగా తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో ఇండస్ట్రీతో పాటు, రాజకీయ శ్రేణుల్లో కూడా తీవ్ర విషాదం అలుముకుంది. ఇక తాజాగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. అలాగే ఆయన అంత్యక్రియలు నిర్వహించడం పై కీలక ప్రకటన చేశారు.

తమిళ కథనాయకుడు డీఎండీకే అధినేత విజయ్ కాంత్ ఈరోజు ఉదయం కోవిడ్ కారణంగా తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో ఇండస్ట్రీతో పాటు, రాజకీయ శ్రేణుల్లో కూడా తీవ్ర విషాదం అలుముకుంది. ఇక తాజాగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. అలాగే ఆయన అంత్యక్రియలు నిర్వహించడం పై కీలక ప్రకటన చేశారు.

తమిళ స్టార్ హీరో, డీఎండీకే అధినేత విజయ్ కాంత్ ఈరోజు ఉదయం కోవిడ్ కారణంగా తుదిశ్వాస విడిచారు. గతకొంత కాలంగా ఆయన తీవ్ర ఆనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇటీవలే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని మాయత్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ప్రత్యేక వైద్య బృందంతో చికిత్స తీసుకున్న ఆయన కొలుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయనకు కరోనా సోకడంతో చెన్నైలోని మియోట్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఇది వరకే శ్వాసకోశ సమస్యలు ఉండగా, దానికి తోడు కరోనా రావడంతో ఆయన్ను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. కాగా, పరిస్థితి బాగా విషమిండంతో.. ఆయన కన్నుమూశరని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఆయన మరణంతో ఇండస్ట్రీతో పాటు, రాజకీయ శ్రేణుల్లో కూడా తీవ్ర విషాదం అలుముకుంది. అలాగే పలవురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు విజయకాంత్ కుటుంబానికి ప్రగాడ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

కెప్టెన్ విజయ్‌కాంత్‌ కన్నుమూయడంతో.. తమిళ సినీ, రాజకీయ ప్రముఖులు విజయ్‌కాంత్‌ కి భారీగా నివాళులర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే.. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. చెన్నైలోని ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతేకాకుండా ప్రభుత్వ లాంఛనాలతో విజయకాంత్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు స్టాలిన్ వెల్లడించారు.

కాగా, విజయ్‌కాంత్‌ మరణంపై అటు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా సంతాపం ప్రకటించారు. ఆయన మరణం చాలా బాధాకరం, తమిళ చలనచిత్ర పరిశ్రమలో ఆయన ఒక లెజెండ్‌ అని పేర్కొన్నారు. అలాగే తన నటనతో కోట్ల మంది అభిమానులను విజయకాంత్‌ సొంతం చేసుకున్నారు. ఇక రాజకీయలో ప్రజా నాయకుడిగా ప్రజల సేవలో నిమగమయ్యారు. అలాగే డీఎండీకే అధినేత విజయకాంత్‌ నాకు ఒక మంచి మిత్రుడు, ఆయన లేరనే వార్త నన్ను తీవ్రంగా కలిచి వేస్తుందని ప్రధాని పేర్కొన్నారు. అలాగే విజయకాంత్‌ కుటుంబానికి, ఆయన అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. ఓ శాంతి అని ప్రధాని మోడీ ఆయన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.

ఇక గతంలో విజయ్ కాంత్ కరోనా విజృంభిస్తున్న సమయంలో ఆయన గొప్ప మనసును చాటుకున్నారు. కరోనా వైరస్ బారినపడి మృతి చెందిన వారి ఖననానికి తన సొంత స్థలం ఇస్తానని ప్రకటించారు. తన ఆండాళ్ అళగర్ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలోని కొంత భాగాన్ని ఖననానికి ఇస్తున్నట్లు వెల్లడించారు. అలాగే కరోనాతో మృతి చెందినవారిని ఖననం చేయటంతో వైరస్ వ్యాపించదని.. ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించాలని అప్పటి ప్రభుత్వానికి విజయ్ కాంత్ విజ్ఞప్తి కూడా చేశారు. అలాంటీ గొప్ప మహనభావుడు మృతి చెందడం పై ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. మరి, అంత గొప్ప నటుడు ఈ లోకాన్ని విడిచి వెళ్లడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments