బేబీ తర్వాత వైష్ణవి.. ఏ హీరోతో సినిమా చేయనుందో తెలుసా?

బేబీ తర్వాత వైష్ణవి.. ఏ హీరోతో సినిమా చేయనుందో తెలుసా?

  • Author ajaykrishna Published - 11:52 AM, Mon - 24 July 23
  • Author ajaykrishna Published - 11:52 AM, Mon - 24 July 23
బేబీ తర్వాత వైష్ణవి.. ఏ హీరోతో సినిమా చేయనుందో తెలుసా?

చిత్రపరిశ్రమలో డెబ్యూ మూవీతో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారే హీరోయిన్స్ అరుదుగా వస్తుంటారు. మొదటి అడుగులోనే నటనతో పాటు బోల్డ్ సీన్స్ కి కూడా ఓకే చేయడం అంటే సాహసం అనే చెప్పాలి. అందులోనూ ఫస్ట్ సినిమాతో అంచనాలు పెంచేస్తే.. తర్వాత సినిమాలపై ఆ ప్రభావం వేరేలా ఉంటుంది. అయితే.. ఇటీవల కాలంలో డెబ్యూ మూవీతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న భామలలో ఆర్ఎక్స్100 తో పాయల్ రాజపుత్, ఉప్పెనతో కృతిశెట్టి.. ఇప్పుడు కొత్తగా బేబీతో వైష్ణవి చైతన్య. తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి.. హాట్ టాపిక్ గా మారింది. పైగా డిగ్లామర్, గ్లామర్ ఎలాంటి రోల్స్ కైనా తాను సిద్ధమే అని చెప్పకనే చెప్పేసింది.

సాధారణంగా ఫస్ట్ సినిమా తర్వాత అవకాశాలు రావాలంటే కాస్త గ్లామర్ ఒలికిస్తే సరిపోతుందని అనిపిస్తుంది. కానీ.. ప్రేక్షకుల దృష్టిలో పడాలంటే గ్లామర్ ఒక్కటే కాదు మంచి ప్రతిభ కూడా ఉండాలి. అవి రెండు వైష్ణవి చైతన్యలో ఉన్నాయి. పైగా బేబీలో తన క్యారెక్టర్ వరకు తాను చాలా చక్కగా నటించింది. కట్ చేస్తే.. టీమ్ అందరి కృషి కలిసి.. బేబీ మూవీ రూ. 50 కోట్ల క్లబ్ లో చేరింది. అయితే.. ఫస్ట్ సినిమా హిట్ అయితే సెకండ్ మూవీ నుండి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్స్ ఏమాత్రం తడబడినా కెరీర్ మళ్లీ మొదటికి వచ్చే అవకాశం లేకపోలేదు. ఎలాగో బేబీ బ్లాక్ బస్టర్ అయ్యింది కదా.. మరి వైష్ణవి నెక్స్ట్ మూవీ ఏంటనే చర్చలు అప్పుడే మొదలైపోయాయి.

యూత్ ని బాగా అట్రాక్ట్ చేసిన వైష్ణవి నెక్స్ట్ ఏ హీరో సరసన నటించబోతుంది? అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే.. సినీ వర్గాల తాజా సమాచారం ప్రకారం.. వైష్ణవి తన సెకండ్ మూవీ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చేయబోతుందట. దీనికి సంబంధించి ఆల్రెడీ మాటామంతి కూడా పూర్తయిందని, అది ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ అని ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ బేబీ సక్సెస్ మీట్ లో ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చారు. అయితే.. అదే కాకుండా వైష్ణవిని అల్లు శిరీష్ చేయబోయే నెక్స్ట్ మూవీకి హీరోయిన్ గా తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్లు టాక్. ఒకవేళ అదే నిజమైతే ఆ సినిమా వైష్ణవి కంటే శిరీష్ కు ప్లస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. ఎందుకంటే.. వైష్ణవి ప్రెజెంట్ ట్రెండింగ్ లో ఉంది కాబట్టి. ఇక దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. అదే నిజమైతే వైష్ణవి సెకండ్ మూవీ హీరో అల్లు శిరీష్ అవుతాడు. మరి వైష్ణవి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Show comments