Urvashi Rautela: NBK109 పాన్ ఇండియా సినిమా అంటున్న ఊర్వశి రౌతేలా

NBK109 పాన్ ఇండియా సినిమా అంటున్న ఊర్వశి రౌతేలా

Urvashi Rautela, NBK 109 movie: బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తదుపరి చిత్రం 'NBK 109'. ఈ సినిమాలో బాబీ డియోల్, దుల్కర్ సల్మాన్ ఊర్వశి రౌతేలా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఊర్వశి రౌతేలా కీలక వ్యాఖ్యలు చేసింది.

Urvashi Rautela, NBK 109 movie: బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తదుపరి చిత్రం 'NBK 109'. ఈ సినిమాలో బాబీ డియోల్, దుల్కర్ సల్మాన్ ఊర్వశి రౌతేలా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఊర్వశి రౌతేలా కీలక వ్యాఖ్యలు చేసింది.

ఇటీవల దసరా పండగ సందర్భంగా విడుదలైన భగవంత్ కేసరితో మంచి హిట్ అందుకున్నారు నందమూరి బాలకృష్ణ. అభిమానుల చేత మ్యాన్ ఆఫ్ మాసేస్, నందమూరి నటసింహంగా పిలిపించుకునే బాలకృష్ణ ప్రస్తుతం బాబీ కొల్లి దర్శకత్వంలో ఒక మాస్ ఎంటర్టైనర్ ను సిద్ధం చేస్తున్నారు. కాగా బాలయ్య కెరీర్‌లో ఇది 109వ చిత్రం కావడంతో పాటు ఇటీవలి తొలి గ్లింప్సెస్‌తో ఈ చిత్రం పై అంచనాలు బాగా పెరిగాయి. అయితే ఈ సినిమాతో బాలయ్య పాన్ ఇండియా అరంగేట్రం చేస్తున్నారని నటి ఊర్వశి రౌతేలా తెలిపారు.

NBK109 చిత్రంలో ఊర్వశి ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో బాలయ్య 109 చిత్రం పాన్-ఇండియా సినిమాగా తెరకెక్కుతుందని తెలిపారు. అయితే, ఈ విషయంపై నిర్మాతల నుండి ఇంకా ఎటువంటి ప్రకటనా రాలేదు. నిజానికి సినిమా టైటిల్ కూడా ఇంకా ప్రకటించలేదు. మరి పాన్ ఇండియా సినిమానా కాదా అనేది ఎప్పుడు చెప్తారో చూడాలి. కాగా ఇటీవల మహాశివరాత్రి సందర్భంగా విడుదలైన టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. “సింహం నక్కల మీదకు వస్తే అది వార్ అవ్వదురా లఫూట్.. ఇట్స్ కాల్డ్ హంటింగ్” అంటూ సాగే బాలయ్య పవర్ఫుల్ డైలాగ్ తో పాటు థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ప్రేక్షకులని ఆకట్టుకుంది.

కాగా NBK109 యూట్యూబ్ లో ప్రస్తుతం నంబర్ వన్ పొజిషన్ లో ట్రెండ్ అవుతుంది. మరి ఈ భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తో బాలయ్య పాన్-ఇండియన్ ఎంట్రీ ఇస్తారా లేదా అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం పై నాగవంశీ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. గత సంవత్సరం మెగాస్టార్ చిరంజీవికి వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు బాబీ, తమ అభిమాన హీరోకి కూడా మంచి హిట్ ఇస్తారని నందమూరి అభిమానులు ఆశిస్తున్నారు. కాగా NBK109 సినిమా దసరా సీజన్ లో విడుదల కానున్నట్లు టాక్ వినిపిస్తుంది.

Show comments