TTE Pushed Women From Train: TTE దారుణం.. కదులుతున్న రైలులో నుంచి మహిళను తోసేసి..

TTE దారుణం.. కదులుతున్న రైలులో నుంచి మహిళను తోసేసి..

TTE Pushed Women From Train: రైలులో టీటీఈలు ఆగ్రహం వ్యక్తం చేయడం, రైలు నుంచి తోసేయడం సినిమాల్లో చూస్తూ ఉంటాం. కానీ, కొన్నిసార్లు నిజ జీవితంలో కూడా అలాంటి ఘటను జరుగుతున్నాయి.

TTE Pushed Women From Train: రైలులో టీటీఈలు ఆగ్రహం వ్యక్తం చేయడం, రైలు నుంచి తోసేయడం సినిమాల్లో చూస్తూ ఉంటాం. కానీ, కొన్నిసార్లు నిజ జీవితంలో కూడా అలాంటి ఘటను జరుగుతున్నాయి.

భారతదేశంలో రైల్వేస్ అతి పెద్ద ప్రజా రవాణా వ్యవస్థ. రోజుకు కొన్ని లక్షల మందిని గమ్య స్థానాలకు చేరుస్తూ ఉంటారు. కేంద్రం అధీనంలో ఉండే ఈ శాఖలో రకరకాల ఉద్యోగాలు ఉంటాయి. వాటిలో టీటీఈ కూడా ఒక పోస్టు. టీటీఈ అంటే ట్రావెలర్ టికెట్ ఎగ్జామినర్. మీరు తీసుకున్న టికెట్స్ సరిగ్గానే ఉన్నాయా? మీరు మీకు కేటాయించిన సీటులోనే కూర్చుని ఉన్నారా? అనే విషయాలను టీటీఈ గమనిస్తూ ఉంటారు. అలాంటి టీటీఈలు కొన్నిసార్లు హద్దులు మీరి ప్రవర్తించిన ఘటనలు కూడా చూశాం. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకున్నా.. ఇంకా అలాంటి ఘటనలే రిపీట్ అవుతూ ఉండటం విచిత్రం అనే చెప్పాలి.

సాధారణంగా సినిమాల్లో ఎప్పుడూ చూపిస్తూ ఉంటారు. టీటీఈ వచ్చి టికెట్ అడగడం లేదు అనగానే.. మూవింగ్ ట్రైన్ లో నుంచి కిందకు తోసేయడం చేస్తారు. అయితే అవన్నీ సినిమాలో కదా అని అందరూ ఊరుకుంటారు. కానీ, రియల్ లైఫ్ లో కూడా అలాంటి ఘటనలు కొన్ని జరిగాయి. అలాంటి దురుసు ప్రవర్తన కలిగిన టీటీలపై అధికారలు చర్యలు కూడా తీసుకున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి ఫరిదాబాద్ లో వెలుగు చూసింది. ఒక 40 ఏళ్ల మహిళ ఫరిదాబాద్ లో జెలుమ్ ఎక్స్ ప్రెస్ లోని ఏసీ కోచ్ లోకి ఎక్కింది.

రైలు కదులుతోంది అనే కంగారులో ఆమె ఏసీ బోగీలోకి ఎక్కింది. ఆ విషయాన్ని గమనించిన టీటీఈ ఆమెను దిగిపోవాల్సిందిగా ఆదేశించాడు. ఆవిడ నెక్ట్స్ స్టేషన్ లో దిగి తన కోచ్ కు వెళ్తానని చెప్పింది. అంతగా కావాల్సి వస్తే తాను ఫైన్ కట్టేందుకు కూడా సిద్ధమని చెప్పింది. కానీ, ఆవె వాదనను పట్టించుకోని టీటీఈ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా ఆమె వస్తువులను బయట పడేశాడు. అలాగే ఆ మహిళను కూడా కదులుతున్న రైలు నుంచి బయటకు తోసేశాడు. ఆమె అప్పుడు స్టార్ అయిన రైలు నుంచి ఒక్కసారిగా ప్లాట్ ఫామ్ పై పడింది. ఆమె తల, చేతులు, కాళ్లకు గాయాలు అయ్యాయి. అక్కడున్న వాళ్లు ఆమెను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఎట్టకేలకు ఆమె గాయాలతో బయటపడింది. ఈ ఘటన ఫిబ్రవరి 29న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఆ మహిళకు గాయాలు అయ్యాయి. అయితే ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు. ఈ ఘటనను చూసిన స్టేషన్ లో వాళ్లంతా ఆశ్చర్యం, ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా కదులుతున్న రైలులో నుంచి మహిళను తోసేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నరు. అలాగే ఈ ఘటన నెట్టిట కూడా వైరల్ అవుతోంది. ఒక 40 ఏళ్ల మహిళను అలా తోసేస్తే.. తనకు ఏమైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై రైల్వే శాఖ స్పందించడం మాత్రమే కాకుండా.. ఆ టీటీఈపై కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు. అలాగే మహిళకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు రైలు ప్రయాణం అంటేనే భయమేస్తుంది అంటూ తమ అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు. మరి.. కదులుతున్న రైలు నుంచి మహిళను తోసేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments