Aleru MLA Ilaiah-Salary: YSR బాటలో కాంగ్రెస్‌ MLA.. ఆ డబ్బు మొత్తం ప్రజలకే అంటూ ప్రకటన

YSR బాటలో కాంగ్రెస్‌ MLA.. ఆ డబ్బు మొత్తం ప్రజలకే అంటూ ప్రకటన

Aleru MLA Ilaiah: ప్రజా సంక్షేమమే తన జీవితాశయంగా బతికిన గొప్ప నేత వైఎస్సార్‌. ఎందరో రాజకీయ నాయకులకు ఆయన ఆదర్శం. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఒకరు వైఎస్‌ఆర్‌ బాటలో పయనిస్తానని చెప్పి.. కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలు..

Aleru MLA Ilaiah: ప్రజా సంక్షేమమే తన జీవితాశయంగా బతికిన గొప్ప నేత వైఎస్సార్‌. ఎందరో రాజకీయ నాయకులకు ఆయన ఆదర్శం. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఒకరు వైఎస్‌ఆర్‌ బాటలో పయనిస్తానని చెప్పి.. కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలు..

మన దేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీలకు జీతాలు భారీగా ఉంటాయి. అది మాత్రమే కాక అనేక అలవెన్సులు కూడా లభిస్తాయి. అయినా సరే చాలా మంది ప్రజా ప్రతినిధులు.. అక్రమార్జనకు తెర తీస్తారు. భారీ ఎత్తున ప్రజల సొమ్ము మింగేస్తారు. మనం ఎక్కువగా అవినీతి రాజకీయ నాయకుల గురించే వింటూ ఉంటాం. కానీ కొన్ని సార్లు.. ఇందుకు భిన్నమైన వారి గురించి కూడా వార్తలు వస్తుంటాయి. సదరు నేతలకు ప్రజల సంక్షేమమే ముఖ్యం. ప్రజాభివృద్ధే తమ కర్తవ్యం అని భావిస్తారు. ఇలాంటి వారి జాబితాలో.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ ముందు వరుసలో ఉంటారు. ఆయన జీతం తీసుకోకుండా పని చేశారు అని అందరకి తెలుసు.

తాజాగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే కూడా వైఎస్‌ఆర్‌ బాటలోనే నడుస్తానని.. తన జీతం మొత్తం ప్రజలకే అని ప్రకటించారు. ఎమ్మెల్యేగా నెలకు తనకు వచ్చే జీతం నుంచి కేవలం 9 రూపాయలు మాత్రమే తీసుకుంటానని.. మిగతా మొత్తం ప్రజా సంక్షేమం కోసమే ఖర్చు చేస్తానని తెలిపారు. ఆవివరాలు..

ఎమెల్యేగా తనకు వచ్చే జీతాన్ని ప్రజలకే ఖర్చుపెడతానని ప్రకటించారు ఆలేరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. ‘తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ సాక్షిగా నా జీతం ఆలేరు ప్రజలకే ఇస్తాను’ అని తెలిపారు. ఎమ్మెల్యేగా తనకు ప్రతి నెలా వచ్చే జీతంలో నుంచి కేవలం రూ. 9 మాత్రమే తీసుకొని మిగిలిన మొత్తాన్ని ప్రతి నెల ఒక్కో వర్గానికి అందజేస్తానని ఐలయ్య ప్రకటించారు. తన జీతాన్ని ప్రజలకు.. జీవితాన్ని ప్రజా సంక్షేమానికి అంకితం చేస్తానని చెప్పుకొచ్చారు. డిసెంబర్ నెల జీతంతో 6 నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల పరీక్ష కోసం అవసరమైన సామగ్రిని కొనిచ్చానన్నారు.

ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ.. పాల సెంటర్ చైర్మన్‌గా ఉన్న తను రాజకీయంగా ఎదగడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చిందన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనకు అన్ని విధాలుగా అండగా నిలిచి.. తాను ఎమ్మెల్యే కావడానికి కారకులయ్యారని ప్రకటించారు. రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి తనకు స్ఫూర్తి అని.. ఆయన కూడా జీతం తీసుకోకుండా పని చేశారని ఈ సందర్భంగా ఐలయ్య గుర్తు చేశారు. అందుకే తాను కూడా వైఎస్సార్‌ బాటలోనే నడవాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఆలేరు నియోజకవర్గంలోని అనాథలు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృద్ధులు, ఆటో డ్రైవర్లు, జర్నలిస్టులు ఇలా ఒక్కో వర్గానికి తన జీతాన్ని ఖర్చు చేస్తానన్నారు ఎమ్మెల్యే ఐలయ్య.

ఎమ్మెల్యే జీతం ఎంతంటే..

సాధారణంగా ఎమ్మెల్యే తీసుకొనే నెలవారి జీతంలో వారికి లభించే అలవెన్స్‌లు కూడా కలిసే ఉంటాయి. బేసిక్‌ శాలరీ, ట్రావెలింగ్‌ అలవెన్స్‌, నియోజకవర్గ అలవెన్స్‌లతో పాటు ఇతర అలెవన్సులు కూడా వారికిచ్చే శాలరీలో కలిసే ఉంటాయి. ఎమ్మెల్యేలకు ఇచ్చే జీతాలు కూడా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఎమ్మెల్యేల జీతం ఏకంగా 170 శాతం పెరిగింది. ప్రస్తుతం నెలకు ఒక్కో ఎమ్మెల్యే రూ. 2.50 లక్షల జీతం అందుకుంటున్నారు. వీటిలో బేసిక్‌ శాలరీ రూ.20 వేలు కాగా.. రూ.2.30 లక్షలు నియోజక వర్గ అలవెన్సులు. సీఎం జీతం కూడా 72 శాతం పెరిగింది. గతంలో రూ.2.44 లక్షలు ఉండగా.. ఇప్పుడు రూ 4.21 లక్షలకు పెరిగింది.

Show comments