TS Electricity Dept-Command Control Center In Hyderabad: పవర్‌ కట్‌ సమస్యలకు పరిష్కారం.. విద్యుత్‌ శాఖ కీలక నిర్ణయం

పవర్‌ కట్‌ సమస్యలకు పరిష్కారం.. విద్యుత్‌ శాఖ కీలక నిర్ణయం

Power Supply: మండుతున్న ఎండలతో జనాలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటుండగా.. తరచుగా కరెంట్‌ పోయి ఈ ఇబ్బందిని మరింత పెంచుతుంది. ఈ సమస్య పరిష్కారం కోసం విద్యుత్‌ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

Power Supply: మండుతున్న ఎండలతో జనాలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటుండగా.. తరచుగా కరెంట్‌ పోయి ఈ ఇబ్బందిని మరింత పెంచుతుంది. ఈ సమస్య పరిష్కారం కోసం విద్యుత్‌ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. వందేళ్లలో భానుడు ఇంతలా తన ప్రతాపం చూపడం ఇదే మొదటిసారి అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈ ఏడాది అత్యధిక వేడి సంవత్సరంగా రికార్డులు క్రియేట్‌ చేసింది. మే నెల చివరి వారంలో నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు.. ప్రారంభంలోనే నమోదవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో 47 డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. ఇక హైదరాబాద్‌లో కూడా భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భాగ్యనగరంలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో 45 డిగ్రీల పైగానే ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. ఎండలు చూసి జనాలు భయపడిపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచే బయటకు రావాలంటే జడుసుకుంటున్నారు. ఇక వేడి బారి నుంచి తప్పించుకోవడం కోసం 24 గంటలు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్స్‌ నడిపిస్తూనే ఉన్నాము
ఇక ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడం కోసం ప్రజలు పగలు రాత్రి తేడా లేకుండా నిరంతరం ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు వేసుకుంటున్నారు. అయితే వాటిని కాసేపు ఆపుతూ.. మరికాసేపు వేస్తూ ఉండటంతో కరెంట్ వినియోగంలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. దాంతో గ్రిడ్‌ను నిర్వహించడం సవాలుగా మారింది అంటున్నారు విద్యుత్‌ శాఖ అధికారులు. ఓవర్‌లోడ్‌, ఇతర కారణాల వల్ల నగరంతో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో రోజులో కొంత సమయం కరెంట్‌ పోతుంది. దీనిపై జనాలు.. విద్యుత్ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. కరెంట్‌ వెంటనే వస్తున్నా.. ఎక్కువసార్లు ట్రిప్పింగ్‌ అవుతుండటంతో.. జనాలు ఇబ్బంది పడుతున్నారు. గతంతో పోలిస్తే సరఫరా వ్యవస్థ మెరుగైనా.. ఇలాంటి సమస్యలపై ఫిర్యాదులు ఎక్కువగా వస్తుండటంతో.. డిస్కంకు ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, అగ్నిమాపక కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ మాదిరిగానే.. నిరంతర విద్యుత్ సరఫరాకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు తెలంగాణ విద్యుత్‌ శాఖ అధికారులు. విద్యుత్‌ సమస్యలపై ట్విటర్‌లో వచ్చే ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందించేలా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లోని ఒక విభాగం పనిచేస్తోంది. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తూ.. క్షేత్రస్థాయిలో సిబ్బందిని అప్రమత్తం చేస్తూ కరెంట్‌ను పునరిద్ధరిస్తోంది. వార్‌రూమ్‌ను ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాపై నిరంతరం దృష్టి సారించారు.
ప్రస్తుతం విద్యుత్ వినియోగం 90 మిలియన్‌ యూనిట్లు దాటి వంద మిలియన్ యూనిట్ల దిశగా పరుగులు తీస్తుంది అని విద్యుత్‌ శాఖ అధికారులు తెలిపారు. దీంతో డిస్కం యాజమాన్యం మరింత అప్రమత్తమైంది. మరి కొన్ని రోజుల పాటు ఎండల తీవత్ర మరింత పెరిగే అవకాశం ఉంది. దాంతో మొత్తం విద్యుత్తు సిబ్బందిని డిస్కం రంగంలోకి దించింది. ప్రతి 11కేవీ ఫీడర్‌కు షిఫ్ట్‌లవారీగా ఒక ఇంజినీర్‌ను ఇంఛార్జ్‌గా నియమించారు. కరెంట్‌ సరఫరాలో అంతరాయం లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. విధి నిర్వాహణలో ఇంజినీర్లు, సిబ్బంది నిర్లక్ష్యంగా ఉంటే సస్పెండ్‌ చేసేందుకు కూడా సీఎండీ వెనకాడటం లేదు.

Show comments