మే నెలలో OTTలోకి రానున్న 5 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే

మే నెలలో OTTలోకి రానున్న 5 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే

ఈ ఏప్రిల్ మంత్ ఎండింగ్ కావొస్తుండటంతో.. ఓటీటీ ప్రియులు తర్వాత నెలలో ఏఏ సినిమాలు స్ట్రీమింగ్ అందుబాటులోకి వస్తాయో అని ఇప్పటి నుంచే తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే.. ప్రేక్షకులను అలరించడానికి మే నెలలో వివిధ పాపులార్ సినిమాలు, సిరీస్ లు ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. మరి అవి ఏంటో చూసేద్దాం.

ఈ ఏప్రిల్ మంత్ ఎండింగ్ కావొస్తుండటంతో.. ఓటీటీ ప్రియులు తర్వాత నెలలో ఏఏ సినిమాలు స్ట్రీమింగ్ అందుబాటులోకి వస్తాయో అని ఇప్పటి నుంచే తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే.. ప్రేక్షకులను అలరించడానికి మే నెలలో వివిధ పాపులార్ సినిమాలు, సిరీస్ లు ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. మరి అవి ఏంటో చూసేద్దాం.

ఓటీటీలో ప్రతివారం, ప్రతినెల ఏదో ఒక కొత్త సినిమాలు, వెబ్ సీరిస్ లు వస్తునే ఉంటాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో.. అయితే వివిధ జోనర్స్ కు సంబంధించిన సినిమాలు అనేవి ఓటీటీలో అలరిస్తుండటంతో.. ప్రేక్షకులు ఎక్కువగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏప్రిల్ నెలలో అయితే ఓటీటీలో చాలా సినిమాలు,వెబ్ సిరీస్ లు వచ్చేశాయి. అయితే వాటిలో చాలా వరకు తెలుగు చిత్రాలే ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చాయి. ముఖ్యంగా.. అందులో గామి, ఓం భీమ్ బుష్ నుంచి టిల్లు స్క్వేర్, ఫ్యామిలీ స్టార్ వరకు ఇలా ఏప్రిల్ లో మంచి పాపులర్ సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. అయితే, ఈ మంత్ ఎండింగ్ కావొస్తుండటంతో.. ఓటీటీ ప్రియులు తర్వాత నెలలో ఏం సినిమాలు స్ట్రీమింగ్ అందుబాటులోకి వస్తాయో అని ఇప్పటి నుంచే తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే.. ప్రేక్షకులను అలరించడానికి మేనెలలో వివిధ పాపులార్ సినిమాలు, సిరీస్ లు ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. మరి అవి ఏంటో చూసేద్దాం.

ఇప్పటికే ఓటీటీలో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ అలరిస్తున్న విషయం తెలిసిందే. అయితే వస్తున్నా ఈ మే నెలలో మాత్రం తెలుగు చిత్రాలు పెద్దగా ఓటీటీలోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే.. ఈ ఏప్రిల్‍లో ఫ్యామిలీ స్టార్ మినహా థియేటర్లలో పాపులర్ సినిమాలు రిలీజ్ కాలేదు. అయితే, మే నెలలో ఇతర భాషలకు చెందిన కొన్ని పాపులర్ సినిమాలు, సిరీస్‍లు ఓటీటీలోకి రానున్నాయి.ఇందులో మంజమ్మల్ బాయ్స్ సహా మరిన్ని తెలుగు డబ్బింగ్ సినిమాలు అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. కాగా, మే నెలలో ఓటీటీలోని రిలీజ్ కావలసిన 5 ముఖ్యమైన ఉన్నాయి. మరి అవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

నెట్‍ఫ్లిక్స్

  • హిరమండి: ది డైమండ్ బజార్

బాలీవుడ్ స్టార్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ భారీ బడ్జెట్‍తో రూపొందించిన వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్. కాగా, ఈ వెబ్  సిరీస్ మే 1వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. అయితే ఇందులో మనీషా కొయిరాలా, అదితి రావ్ హైదరి, సోనాక్షి సిన్హా, షార్మీన్ సేగల్ ప్రధాన పాత్రలు పోషించారు.  ఇక ఈ హిందీ సిరీస్ పై భారీగానే అంచనాలు ఉన్నాయి. అలాగే ట్రైలర్ తో ఆకట్టుకున్న హీరామండి పై మంచి హైప్ ఉంది. ఇక ఎన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించిన సంజయ్ లీలా భన్సాలీ నుంచి వస్తున్న తొలి వెబ్ సిరీస్ కావడం కూడా చాలా ఇంట్రెస్టింగ్‍గా ఉంది. మే 1న ఈ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ స్ట్రీమింగ్‍కు వస్తుంది. తెలుగు డబ్బింగ్‍లోనూ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

  • సైతాన్

బాలీవుడ్ సూపర్ నేచులర్ హారర్ థ్రిల్లర్ రూపొందించిన చిత్రం  సైతాన్.  అయితే ఈ మూవీ కూడా మే నెలలో నెట్ ఫ్లిక్స్ ఓటీటీలోకి రానుంది. కాగా, ఈ చిత్రం మే 3న స్ట్రీమింగ్ కు అందుబాటులో రానుందని సమాచారం తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంక అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో అజయ్  దేవ్‍గణ్, జ్యోతిక, మాధవన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇకపోతే సైతాన్ మూవీ  మూవీ మార్చి 8న థియేటర్లలో విడుదలై రూ.200కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి సూపర్ హిట్ అయింది.

అమెజాన్ ప్రైమ్

  • ఆవేశం

మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ఆవేశం. కాగా, ఈ  సినిమా ఏప్రిల్ 11న  థియేటర్లలో విడుదలై భారీ బ్లాక్‍బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక  జీతూ మాధవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికే రూ.100 మార్కును దాటేసింది. అయితే ఈ యాక్షన్ కామెడీ చిత్రంను ఓటీటీ హక్కులకు అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. కాగా, ఆవేశం సినిమా మే 17వ తేదీన ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వస్తుందనే సమాచారం వినిపిస్తోంది.  ఒకవేళ అనుకున్న తేదీకి  ఆలస్యమైతే మే ఆఖరి వారంలోనే అయినా ప్రైమ్ వీడియోలోకి అందుబాటులోకి వస్తుందని సమాచారం.

డిస్నీ ప్లస్ హాట్‍స్టార్ 
  • మంజుమ్మల్ బాయ్స్

మలయాళ బ్లాక్‍బస్టర్ గా నిలిచిన  మంజుమ్మల్ బాయ్స్ సినిమా ఇటీవలే తెలుగులో ఏప్రిల్ 6న రిలీజైన  విషయం తెలిసిందే. కాగా, ఈ చిత్రం కూడా మే మే 5వ తేదీన ఓటీటీలోకి రానుంది. అయితే ఈ సినిమాను  డిస్నీ ప్లస్ హాట్‍స్టార్ ఓటీటీ హక్కులను దక్కించుకుంది.  కాగా, మంజుమ్మల్ బాయ్స్ సినిమా..  మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్‍కు రానుంది.  ఇక మలయాళ ఇండస్ట్రీలో ఈ సినిమా రూ.200 కోట్ల కలెక్షన్లు దక్కించుకున్న తొలి చిత్రంగా రికార్డు సృష్టించింది. అయితే ఈ మూవీకి చిదంబరం దర్శకత్వం వహించగా.. సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసీ, బాలు వర్గీస్, గణపతి, లాల్ జూనియర్ ప్రధాన పాత్రలు పోషించారు.

జియో

  • జర హట్కే జర బచ్కే

జర హట్కే జర బచ్కే సినిమా ఎట్టకేలకు మే నెలలో ఓటీటీలోకి రానుంది. జియో సినిమా ఓటీటీలో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వస్తుంది. మే మూడో వారంలో ఈ చిత్రం జియో సినిమాలోకి అడుగుపెడుతుందని తెలుస్తోంది. త్వరలోనే స్ట్రీమింగ్ డేట్‍పై ప్రకటన రానుంది. విక్కీ కౌశాల్, సారా అలీఖాన్ హీరోహీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ కామెడీ మూవీ  2023 జూన్ 2న థియేటర్లలో రిలీజ్ అయింది. ఇప్పుడు సుమారు 11 నెలల తర్వాత జియో సినిమా ద్వారా  ఓటీటీలోకి అడుగుపెట్టనుంది.

అయితే మే నెలలో ఓటీటీలో విడుదల కాబోతున్న ఈ సినిమాలను అసలు మిస్ కాకుండా చూసేయండి. అలాగే ఇందులో మీకు నచ్చిన సినిమా ఏదో మీ  అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments