Gold and Silver Rates: అక్షయ తృతీయ సందర్భంగా మహిళలకు గుడ్ న్యూస్.. ఈ రోజు ధర ఎంతంటే?

అక్షయ తృతీయ సందర్భంగా మహిళలకు గుడ్ న్యూస్.. ఈ రోజు ధర ఎంతంటే?

Gold and Silver Rates: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బంగారం కొనుగోలుదారుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. దీనికి తోడు అక్షయ తృతీయ రోజున ఒక్క గ్రాము బంగారం అయినా కొనాలనే సెంటిమెంట్ ఉంటుంది.. దీంతో జ్యులరీ షాపులు కిట కిటలాడుతున్నాయి.

Gold and Silver Rates: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బంగారం కొనుగోలుదారుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. దీనికి తోడు అక్షయ తృతీయ రోజున ఒక్క గ్రాము బంగారం అయినా కొనాలనే సెంటిమెంట్ ఉంటుంది.. దీంతో జ్యులరీ షాపులు కిట కిటలాడుతున్నాయి.

ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. అనూహ్యంగా మార్చి, ఏప్రిల్ నెలలో ధరలు ఆకాశాన్నంటాయి. పసిడి ధరలు ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు తగ్గుతాయో తెలియని అయోమయ స్థితిలో కొనుగోలుదారులు ఉంటున్నారు. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాలు బంగారం, వెండిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గత నెలలో పసిడి ధర ఏకంగా రూ.75 వేల మార్క్ దాటిపోయింది. మే నెలలో బంగారం, వెండి ధరలు వరుసగా తగ్గుముఖం పట్టినా ఒక్కోసారి షాక్ ఇస్తున్నాయి. అక్షయ తృతీయ సందర్భంగా మహిళలకు గుడ్ న్యూస్.. నేడు పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఈ రోజు మార్కెట్ లో పసిడి, వెండి ధరల ఎలా ఉన్నాయంటే..

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్. అక్షయ తృతీయ సందర్భంగా పసిడి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఇటీవల చుక్కలు చూపించిన బంగారం ఇప్పుడే నేల చూపులు చూస్తుంది. ఇదిలా ఉంటే ఈ మధ్య భారతీయులు బంగారం ఆభరణాలు గానే కాకుండా ఇన్వెస్ట్ మెంట్ గా చూస్తున్నారు. బంగారం ధరలు ఎప్పటికైనా పెరిగే ఛాన్స్ ఉంది.. ఇది దృష్టిలో పెట్టుకొని చాలా మంది బంగారం కొనుగోలు చేస్తున్నారు. దీంతో పసిడి డిమాండ్ ఎప్పుడూ తగ్గడం లేదు. దేశంలో  బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గి.. రూ.66,140 కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం రూ.6,614 వద్ద ట్రెండ్ అవుతుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.10 తగ్గి రూ.72,150 కి చేరింది. తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,150 వద్ద కొనసాగుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గి ప్రస్తుతం రూ.66,140 వద్ద కొనసాగుతుంది. వెండి ధర కిలో రూ.100 పెరిగివది. ప్రస్తుతం రూ. 88,800 వద్ద కొనసాగుతుంది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.72,300 వద్ద కొనసాగుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,290 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.72,150 వద్ద కొనసాగుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.66,140 వద్ద కొనసాగుతుంది. ముంబై, కోల్ కొతా, బెంగుళూరు లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.72,150 వద్ద కొనసాగుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,140 వద్ద కొనసాగుతుంది. ఢిల్లీ, ముంబై, బెంగుళూరులో కిలో వెండి ధర రూ. 85,300 వద్ద ఉండగా, చెన్నైలో కిలో వెండి ధర రూ.88,800 వద్ద ట్రెండ్ అవుతుంది. అక్షయ తృతీయ సందర్భంగా బంగారం ధరలు స్వల్ప ఊరటనివ్వడంతో మహిళలు జ్యులరీ షాపులకు క్యూ కడుతున్నారు. పసిడి కొనాలనుకునే వారికి ఇదే మంచి సమయం అంటున్నారు నిపుణులు.

గమనిక : పసిడి, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి.. ఈ పైన తెలుపబడిన సమాచారం సూచికగా మాత్రమే ఉంటుంది.

 

Show comments