Tilak Varma: Asia Cup: బంగ్లాతో మ్యాచ్‌! టీమ్‌లోకి తెలుగు క్రికెటర్‌

Asia Cup: బంగ్లాతో మ్యాచ్‌! టీమ్‌లోకి తెలుగు క్రికెటర్‌

టీమిండియా యువ క్రికెటర్‌, తెలుగు తేజం తిలక్‌ వర్మ.. అంతర్జాతీయ వన్డే ఫార్మాట్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఆసియా కప్‌ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తిలక్‌ వన్డే అరంగేట్రం ఫిక్స్‌ అయింది. ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తిలక్‌ వర్మకు టీమిండియా క్యాప్‌ను అందించాడు. ఇప్పటికే టీమిండియా తరఫున టీ20లు ఆడి అదరగొట్టిన తిలక్‌.. ఆసియా కప్‌ టీమ్‌లో చోటు దక్కించుకున్నాడు. కానీ ఇప్పటి వరకు అతనికి ప్లేయింగ్‌ ఎలెవన్‌లో ఆడే అవకాశం రాలేదు.

టీమిండియా ఇప్పటికే ఆసియా కప్‌ ఫైనల్‌కు క్వాలిఫై అయిపోవడం, కీలక ప్లేయర్లకు వరల్డ్‌ కప్‌కు ముందు రెస్ట్‌ ఇస్తుండటంతో తిలక్‌ వర్మకు ప్లేయింగ్‌ ఎలెవన్‌లో అవకాశం దక్కింది. వరల్డ్‌ కప్‌ టీమ్‌లో తిలక్‌కు అవకాశం దక్కకపోయినా.. వరల్డ్‌ కప్‌ తర్వాత టీమిండియాకు తిలక్‌ కీలక ప్లేయర్‌గా మారే అవకాశం ఉంది. లెఫ్ట్‌ హ్యాండర్‌, స్పిన్‌, పేస్‌ను అద్భుతంగా ఆడగల హైలీ టాలెంటెండ్‌ క్రికెటర్‌.. అతి ముఖ్యంగా జట్టు క్లిష్టపరిస్థితుల్లో మంచి ఇన్నింగ్స్‌లు ఆడగల ఆటగాడు.. వెరసి.. నాలుగో స్థానంలో టీమిండియా బెస్ట్‌ ప్లేయర్‌ అవుతాడు.

ఇప్పటికే టీ20లతో తనను తాను నిరూపించుకున్న తిలక్‌ వర్మ.. ఈ వన్డేలోనూ రాణిస్తే.. టీమిండియాకు భవిష్యత్తు స్టార్‌గా మారే అవకాశం మెండుగా ఉంది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరగనున్న వన్డేలో తిలక్‌ వర్మ ఆడటం కన్ఫామ్‌ అయినప్పటికీ.. ఎవరి స్థానంలో ఆడేది ఇంకా తెలియాల్సి ఉంది. మరి తిలక్‌ వర్మ వన్డేల్లోకి అరంగేట్రం చేస్తుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వరల్డ్ కప్ కొట్టే దిశగా శ్రీలంక! జోక్ కాదు .. కొన్ని లెక్కలు ఉన్నాయి!

Show comments