ఈ ఊరి నిండా కవలలు.. ఇక్కడ మాత్రమే ఎందుకిలా!

ఈ ఊరి నిండా కవలలు.. ఇక్కడ మాత్రమే ఎందుకిలా!

సాధారణంగా చాలామంది ఇళ్లలో కవల పిల్లలు పుట్టడమనేది సర్వ సాధారణం. కానీ, ఓ ఊరిలో మాత్రం అందుకు భిన్నంగా భారీ స్థాయిలో కవలలు దర్శనమిస్తారు. ఇంతకి ఎక్కడంటే..

సాధారణంగా చాలామంది ఇళ్లలో కవల పిల్లలు పుట్టడమనేది సర్వ సాధారణం. కానీ, ఓ ఊరిలో మాత్రం అందుకు భిన్నంగా భారీ స్థాయిలో కవలలు దర్శనమిస్తారు. ఇంతకి ఎక్కడంటే..

చాలామంది ఇళ్లలో కవల పిల్లలు పుట్టడమనేది సర్వ సాధారణం. అయితే ఈ కవల పిల్లలు పుట్టమనేది ఎంతోమందికి వంశపారంపర్యంగా ఎక్కువగా జరుగుతుంటుంది. అయితే కొంతమందిలో మాత్రం ఎలాంటి జన్యుపరమైన కారణాలు లేకపోయినా చాలా అరుదుగా ఈ కవలలకు జన్మనిస్తుంటారు. అయితే, కొన్ని సందర్భల్లో మాత్రం వైద్య పరిజ్ఞానంతో కూడా కొందరు మహిళలకు కవలలు పుడుతుంటారు. ఇక  ఎటువంటి జన్యుపరమైన సమస్య కానీ, మరెటువంటి వైద్య పరిజ్ఞానం లేకుండానే ఇంటింటీకీ కవలలు పుట్టడం అనేది అసాధారణం. కానీ, తాజాగా ఓ ఊరిలో మాత్రం.. మొత్తం కవలలతో కళకళలాడి పోతుంటారు. ఇంతకి అదేక్కడంటే..

సాధారణంగా ఇంట్లో కవల పిల్లలు ఉంటే ఆ కళ వేరు. అలా ఒక ఇంట్లో కవలలు ఉన్నప్పుడు వారిని ఇంట్లో వారు మాత్రమే కాకుండా.. స్థానికులు కూడా గుర్తుపట్టడం కష్టంగా ఉంటుంది. అలాగే ఈ కవలలు చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉండటమే కాకుండా.. అందరి దృష్టి వీరి వైపే ఉంటుంది. మరి ఒక ఇంట్లో కవలలు పుడితేనే ఇలా ఉంటే.. తాజాగా ఓ ఊరిలో మాత్రం ప్రతి ఇంటికి కవలలు ఉన్నారు. అలా ఊరి ఊరంతా కవలలతో కళకళలాడుతున్నారు. ఇంతకి ఎక్కడంటే.. తమిళనాడులోని చిన్న పట్టణం సిర్కళిలోని భారీ సంఖ్యలో ఈ కవలలు దర్శనిమిస్తారు. అయితే ఇక్కడ ఓ పాఠశాల్లో విద్యార్థులు దాదాపు 150 మంది వరకు అందరూ కవలలు ఉంటారు. పైగా ఒకే పాఠశాలకి 50 మంది విద్యార్థులు వెళ్తున్నారు. కాగా, అందులో ప్రియాంక. కె.ఎం, ప్రిత్యాంగ.కె.ఎం అనే ఇద్దరు కవలలు మాట్లాడుతూ.. ‘ఇక్కడ కొన్నిసార్లు జనాల స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఇలా కవలలుగా పుట్టి, ఇతరుల దృష్టిని ఆకర్షించడం నిజంగా మా అదృష్టం అని చెప్పారు. అంతేకాకుండా.. ఇలా కవలల తల్లిదండ్రులుగా జన్మనిచ్చినందుకు మా అమ్మానాన్నలకు కూడా ఓ గుర్తింపు ఉంది అంటూ పేర్కొన్నారు.

అయితే దశాబ్ద కాలంగా.. ఈ ఊరిలో ఇలా కవలలు సంఖ్య క్రమంగా పెరుగుతోందని అక్కడ అధికారులు తెలియజేశారు. కానీ, ఇంతమంది కవలలు పుట్టడానికి కారణం ఏమిటనే విషయం పై ఇంక స్పష్టంగా తెలియలేదు. కాగా, ఈ విషయం పై ఇప్పటికైనా లోతుగా అధ్యయనం చేయాలని అధికారులకు డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇక ఈ ఊరిలో ఇలా కవలలు పుట్టడాన్ని స్థానికులు కూడా అదృష్టంగా భావిస్తున్నారు. ఈ విషయం పై ఊరిలో స్థానికుడు శివకుమార్ మాట్లాడుతూ.. ‘మా అమ్మ వాళ్ల తరాల్ల నుంచి ఇలా మూడు తరాల్లోనూ కవలలున్నారని తెలిపాడు. అలాగే నేను ఒక కవలగా పుట్టి, ఇద్దరు కవల పిల్లలకు తండ్రిని అవ్వడం సంతోషంగా ఉందని’ చెప్పాడు. మరి, ఇలా ఒకే ఊరిలో అందరూ కవలలు జన్మించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments