గాంధీ జయంతి స్పెషల్‌ ఆఫర్‌.. ఆ సినిమా ఒక టికెట్‌ కొంటే మరొకటి ఫ్రీ

గాంధీ జయంతి స్పెషల్‌ ఆఫర్‌.. ఆ సినిమా ఒక టికెట్‌ కొంటే మరొకటి ఫ్రీ

  • Author Soma Sekhar Published - 11:49 AM, Mon - 2 October 23
  • Author Soma Sekhar Published - 11:49 AM, Mon - 2 October 23
గాంధీ జయంతి స్పెషల్‌ ఆఫర్‌.. ఆ సినిమా ఒక టికెట్‌ కొంటే మరొకటి ఫ్రీ

సాధారణంగా పండగల వేళ వివిధ రంగాలకు చెందిన సంస్థలు ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటాయి. ఈ సంప్రదాయం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి కూడా పాకింది. అవును ఆఫర్లు ప్రకటించే సంస్కృతిని ఇండియన్ సినీ పరిశ్రమ అనుసరిస్తోంది. ఇటీవలే ఆదిపురుష్, జవాన్ సినిమాలు ఒక టికెట్ కొంటే మరో టికెట్ ను ఫ్రీగా ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరో మూవీ టీమ్ ఇదే ఆఫర్ ను ప్రకటించింది. గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ ఆఫర్ ను ప్రకటించింది చిత్ర యూనిట్. ఇక ఈ ఆఫర్ ఈ ఒక్కరోజే అందుబాటులో ఉంటుందని పేర్కొంది.

‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. వివాదాలు సృష్టించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్ల రూపాయాల వసూళ్లను రాబట్టింది. ఎక్కువగా నిజ జీవిత సంఘటనల ఆధారంగా సినిమాలను తెరకెక్కిస్తుంటాడు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. తాజాగా ‘ది వ్యాక్సిన్ వార్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సెప్టెంబర్ 28న విడుదలై ఈ చిత్రం డీసెంట్ టాక్ తెచ్చుకుంది. కరోనా కాలంలో ప్రజలు ఎదుర్కొన్న పరిస్థితులను ఈ చిత్రం ద్వారా చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. కాగా.. 10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం.. మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ. 3.25 కోట్లు వసూల్ చేసినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. తెలుగులోనూ వ్యాక్సిన్ వార్ మూవీకి కలెక్షన్లు పెద్దగా లేవు. దీంతో మూవీ యూనిట్ సినిమా లవర్స్ కు బంపరాఫర్ ప్రకటించింది.

ఈ క్రమంలోనే గాంధీ జయంతిని పురస్కరించుకుని (అక్టోబర్ 2) సోమవారం ఒక్క టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ అని ఆఫర్ ఇచ్చింది. కాగా.. బుక్‌ మై షో, పీవీఆర్‌ ఐనాక్స్‌, సినీపోలిస్‌ వెబ్‌సైట్లు/ ఆన్‌లైన్‌ యాప్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని కోరింది. ఈ ఆఫర్ ఈ ఒక్కరోజు మాత్రమే ఉంటుందని పేర్కొంది. ఈ ఆఫర్ కు సంబంధించిన పోస్ట్ ను డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. “గాంధీ జయంతి నాడు మీ కుటుంబంతో కలిసి ది వ్యాక్సిన్ వార్ చూడండి. లేదా మీకు ఫ్రీగా వచ్చిన టికెట్ ను మీ ఇంట్లో పనిమనిషికి లేదా ఇతరులకు ఇవ్వండి. నా సినిమా చూసి స్ఫూర్తి పొంది ఒక్కరైనా వైరాలజిస్ట్ గా మారితే.. అది నా సినిమాకు దక్కిన విజయంగా భావిస్తా” అంటూ రాసుకొచ్చాడు డైరెక్టర్.

Show comments