SBI Recruitment 2024-Hiring Nearly 12000 Employees: నిరుద్యోగులకు SBI భారీ శుభవార్త.. 12 వేల ఉద్యోగాల భర్తీకి ప్రకటన

నిరుద్యోగులకు SBI భారీ శుభవార్త.. 12 వేల ఉద్యోగాల భర్తీకి ప్రకటన

SBI Hiring 2024: నిరుద్యోగులకు దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన ఎస్‌బీఐ భారీ శుభవార్త చెప్పింది. సుమారు 12 వేల ఉద్యోగాల భర్తీకి రెడీ అయ్యింది. ఆ వివరాలు..

SBI Hiring 2024: నిరుద్యోగులకు దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన ఎస్‌బీఐ భారీ శుభవార్త చెప్పింది. సుమారు 12 వేల ఉద్యోగాల భర్తీకి రెడీ అయ్యింది. ఆ వివరాలు..

మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ఉన్న క్రేజ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందునా బ్యాంకు ఉద్యోగాలంటే.. యువతకు మరింత క్రేజ్‌. ఎలాంటి ఒత్తిడి లేకుండా.. అధిక వేతనం, సెలవులు పొందే అవకాశం ఉందడటంతో.. చాలా మంది యువత బ్యాంకు ఉద్యోగాల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఈ రోజుల్లో బ్యాంకు ఉద్యోగాలు సాధించడం అంత తేలిక కాదు. పరీక్ష పత్రాలు చాలా కఠినంగా ఉంటున్నాయి. ఏళ్ల తరబడి బ్యాంకు ఉద్యోగం కోసం కష్టపడి శ్రమించి చదువుతూ ఉంటారు. ఇక ఈ ఉద్యోగాల కోసం లక్షల మంది యువత పోటీ పడుతుంటారు. ఇక మీరు కూడా బ్యాంకు ఉద్యోగాల కోసం ప్రిపేర్‌ అవుతున్నారా.. అయితే మీకోసమే ఈ శుభవార్త. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ భారీ ఎత్తున​ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆ వివరాలు..

దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎస్‌బీఐ.. నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త చెప్పింది. దాదాపు 12 వేల మంది ఉద్యోగులను నియమించుకునేందుకు రెడీ అయ్యింది. ఆయా విభాగాల్లో పలు ఉద్యోగాల భర్తీకి సంబంధించి.. ఈ నోటిఫికేషన్‌ను వెల్లడించింది. 12 వేల ఉద్యోగాల్లో.. ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ఇతర విధుల్లో ఉద్యోగులుగా నియమించేందుకు సిద్దంగా ఉన్నామని చైర్మన్ దినేష్ ఖరా వెల్లడించారు.

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన ఎస్బీఐలో ప్రస్తుతం 2,32,296 మంది ఉద్యోగులున్నారనీ చెప్పుకొచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 2,35,858గా ఉండేదని తెలిపారు. ఈ క్రమంలో సుమారు 11,000 నుండి 12,000 మంది ఉద్యోగులు రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ప్రారంభమైందని చైర్మన్ తెలిపారు. త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రకటన వెలువడనుంది అని వెల్లడించారు. వీరు సాధారణ ఉద్యోగులు, కానీ వాస్తవానికి వారు అసోసియేట్ స్థాయిలో, అధికారుల స్థాయిలో, వారిలో 85 శాతం మంది రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ఉందని ఖరా తెలిపారు.

అలాగే..స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా .. 2024 క్యూ 4 ఫలితాల్లో నికర లాభం 24 శాతం పెరిగి రూ.20,698 కోట్లకు చేరుకుందని తెలిపారు. ఎస్‌బీఐ ప్రకటనపై నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంత భారీ ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేయడం పట్ల వారు సంతోషంగా ఉన్నారు.

Show comments